వర్గం: అనువాదాలు
-
జపనీస్ కవి బాషో 7 కవితలు…

1 ఓ జలజలా రాలుతున్న మంచు! ఈ తుచ్ఛమైన జీవితాన్ని నీలో ప్రక్షాళన చేసుకోనీ! 2 రోడ్డువార చిన్ని మొక్క దారినపోతున్న వారిని చూడాలని ముందుకి వంగింది. దారినపోతున్న ఓ గాడిద దాన్ని నమిలి మింగింది. 3 ఓ పిచ్చుక మిత్రమా! వేడుకుంటాను. నా పూల రెమ్మల్లో రాగాలుతీస్తూ ఆడుకుంటున్న కీటకాల జోలికి పోకేం? 4 ఎక్కడో దూరంగా, ఒంటరిగా ఉన్న తటాకం అందులోకి చెంగున ఒక కప్ప దూకీ దాకా నిశ్చలంగా, యుగాలనాటి నిర్వికల్ప సమాధిలో…
-
జపనీస్ సంకలనం Shūi Wakashū నుండి రెండు కవితలు
ఇప్పటికీ మంచు పూర్తిగా కరుగనిఆ కొండమీది పల్లెఆ కోకిల కుహుకుహూలకు తప్పవసంతం అడుగుపెట్టిందనిఎలా గ్రహించగలిగి ఉండేది?.నకత్సుకాసా9వ శతాబ్దం.జపనీస్ కవి కొండ మొదలునిమరుగుపరుస్తున్న నదిమీది పొగమంచుపైకి తేలిపోతుంటేహేమంతప్రభావానికి ఆ కొండఆకాసానికి వ్రేలాడుతున్నట్టు కనిపిస్తోంది..కొయొవారా ఫుకుయాబు900-930జపనీస్ కవి Selections from Shūi Wakashū If it were not for the voice Of the Nightingale, How would the mountain-village Where the snow is still unmelted Know the spring? . Nakatsukasa C.900…
-
జపనీస్ కవితా సంకలనం “Kokinshū” నుండి 3 కవితలు…
1 ఈ ప్రపంచంలో ఏ బాహ్య చిహ్నాలూ అగుపించకుండా వడలి వాడిపోయే వస్తువు బహుశా మగవాడి హృదయ కుసుమమే! . ఒనో నో కొమాచి 825- 900 జపనీస్ కవయిత్రి 2 నా ప్రేమ మహాపర్వతాల అంతరాలలో ఎక్కడో పెరిగే గడ్డి లాంటిది. అది ఎంత ఒత్తుగా పెరిగినా ఏం ప్రయోజనం దాని ఉనికి గుర్తించేవాడెవరూ ఉండరు. . ఒనో నో యొషీకి మరణం 902. 3 ముదిమి వస్తోందని ఎవరికైనా ముందే తెలిస్తే ఎంత బాగుండును?…
-
అరవై నిండినపుడు… పో చూ-యి, చీనీ కవి

ముప్ఫై కి – నలభై కి మధ్య ఇంద్రియభోగాలు మనసు చంచలం చేస్తాయి డెబ్భై కీ – ఎనభై కీ మధ్య మనిషి చెప్పలేనన్ని రోగాలకు లోనౌతాడు కానీ, యాభైకీ – అరవై కీ మధ్య ఈ రకమైన బాధలకి దూరంగా ఉంటాడు. ఏ చాంచల్యాలకూ లోనుగాక మనసు నిశ్చలమై, విశ్రాంతి తీసుకుంటుంది. ప్రేమల్నీ, లాలసలనీ విడిచిపెట్టేసేను. చాలు! లాభనష్టాల, కీర్తిప్రతిష్ఠల ధ్యాస వదిలేసేను. ఇప్పటికి ఆరోగ్యంగా, ముదిమికి దూరంగా ఉన్నట్టే తీర్థయాత్రలకీ, పర్వతారోహణకీ కాళ్లలో ఇంకా…
-
కొడుకు పుట్టిన సందర్భంలో… సూ తుంగ్ పో, చీనీ కవి
ఈ కవితలోని వ్యంగ్యం/ అధిక్షేపణ విప్పి చెప్పనవసరంలేదు. ****** సాధారణంగా కుటుంబాల్లో బిడ్డ పుట్టినపుడు వాళ్ళు తెలివైన వాళ్ళు కావాలని కోరుకుంటారు. నేను, నా తెలివితేటలవల్లనే నా జీవితాన్ని నాశనంచేసుకోవడం వల్ల వాడు అజ్ఞానీ, మూర్ఖుడూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అప్పుడు వాడు రాజదర్బారులో మంత్రిపదవి అలంకరించి ఏ చీకూ చింతాలేక ప్రశాంతంగా జీవించగలడు. . సూ తుంగ్ పో, 8 January 1037 – 24 August 1101 చీనీ కవి. .…
-
ఏదో ఒకరోజు నువ్వు గతించక తప్పదు… అజ్ఞాత చీనీ కవి
నీకు రకరకాల కోట్లూ, దుస్తులూ ఉన్నాయి, కానీ వాటిని నీతో తీసుకు పోలేవు; నీకు రథాలూ, గుఱ్ఱాలూ ఉన్నాయి, కానీ వాటిని నువ్వు ఎక్కి స్వారీ చెయ్యలేవు. ఏదో ఒకరోజు నువ్వు గతించక తప్పదు, వాటిని వేరెవరో అనుభవిస్తారు. నీకు విశాలమైన పెరళ్ళూ, భవంతులూ ఉన్నాయి, వాటిని ఊడ్చి, కళ్ళాపిచిలకరించే వారు ఉండరు. నీకు ఢంకాలూ, ఘంటలూ ఉన్నాయి వాటిని ఎన్నడూ మ్రోగించేవారే ఉండరు. ఏదో ఒకరోజు నువ్వు గతించక తప్పదు, అవి ఇంకెవరి అధీనంలోకో వెళ్ళిపోతాయి.…
-
ఇంటికి ఫోను చేసినపుడు… జోయ్ – హార్యో, అమెరికను కవయిత్రి
ఈ కవిత కరోనా నిబంధనల సడలింపు నేపథ్యంలో, ప్రభుత్వాలు ఆల్కహాలు, సారాదుకాణాలకు అనుమతి ఇచ్చిన తర్వాత కొన్ని గ్రామాల్లోని పరిస్థితిని గుర్తు చేసింది. *** ఎమ్మా లీ ని వాళ్ళాయన వారాంతపు శలవుల్లో చితక బాదేడుట. కారణం ప్రభుత్వం అతని జీతాన్ని తొక్కిపెట్టింది తన తాగుడుకోసం అతను అప్పుచెయ్యవలసి వచ్చింది. ఏనా పనికి వారం రోజులు శలవు పెట్టవలసి వచ్చింది వాళ్ళ చిన్నబ్బాయికి సుస్తీ చేసింది. ఆమె అన్నది కదా, “ఒక్కోసారి కష్టం అనిపిస్తుంది, కానీ, మొగుణ్ణి…
-
ఋతుచక్రం … తావో చిన్, చీనీ కవి

చంక్రమణం చేస్తున్న ఋతువులు స్వేచ్ఛగా పరిభ్రమిస్తున్నాయి. ప్రాభాత సమయపు అద్భుతమైన ప్రశాంతత నలుదెసలా ఆవరిస్తోంది వసంతఋతు సూచకములైన దుస్తులు ధరించి నేను తూరుపు పొలాలను కలయతిరుగుతున్నాను. హేమంతపు తుది మొయిళ్ళు పర్వతాగ్రాలను తుడిచిపోతున్నై. సాలెగూడువంటి సన్నని తెలిమంచు అకసాన్ని మరుగుపరుస్తోంది. ఇక కొద్దిరోజుల్లో, దక్షిణగాలి తగలడమే ఆలస్యం, పాలుపోసుకున్న గింజ రెక్కలు అలలుగా విచ్చుకుంటుంది. . తావో చిన్ (365 – 427) చీనీ కవి . Turning Seasons . Turning Seasons turning wildly…
-
ఒక సాయంవేళ … చియా తావో, చీనీ కవి
చేతికర్రమీద ఆనుకుని చూస్తున్నా. మంచు స్పష్టంగా పేరుకుంటోంది. మేఘాల, సెలయేళ్ల దొంతరలు మేటువేస్తున్నట్టున్నాయి. కట్టెలుకొట్టి జీవించే వారు ఇంటిదారి పడుతున్నారు. కొద్దిసేపట్లో వాలైన కొండకొమ్ములలో చలిపట్టిన సూరీడు అస్తమించబోతున్నాడు. కొండల అంచున ఎండుగడ్డిమీదనుండి దావానలం వ్యాపిస్తున్నట్టు ఉంది. రాళ్ళ మీదనుండీ, చెట్లమీదనుండీ తెరలు తెరలుగా పొగమంచు పైకి లేస్తోంది కొండమీది ఆరామానికి మలుపుతిరుగుతున్న దారిలో సూర్యాస్తమయ సూచకంగా మ్రోగుతున్న ఘంట నినదిస్తోంది. . చియా తావో (779–843), చీనీ కవి . . Evening landscape, Clearing…
-
A Stale Roti… Abd Wahed, Telugu, Indian
Hunger Is much a like loan taken on compound interest; The principal never gets cleared, You perpetually pay the interest … in installments. Forget just one EMI, It will hit you on your tummy Like the brute loan-collector. With mushrooming hotels, restaurants, And pizzas, burgers, and biryanis sold therein A stomach un-famished Can hardly relish…