వర్గం: అనువాదాలు
-
బతికున్నవాడికో పువ్వు… నిక్సన్ వాటర్ మన్, అమెరికను
శవాలపై విలువైన పూలమాలలుంచే కంటే బ్రతికున్నవాడికి ఒక గులాబి ఇవ్వడం మెరుగు; అంతులేని ప్రేమ కోశాన్ని నింపే ప్రక్రియలో బ్రతికున్నవారికి ఇచ్చే ఒక గులాబీ అమూల్యమైనది, అలమటిస్తున్న ఆత్మ శలవుతీసుకోకమునుపే కోరకుండా ఉదారంగా ఇవ్వగలిగితే… బ్రతికున్న వాడికి ఇచ్చే ఒక గులాబి పువ్వు శవాలమీది విలువైన దండల కంటే మిన్న . నిక్సన్ వాటర్ మన్ 12 నవంబరు, 1859 – 1 సెప్టెంబరు 1944) అమెరికను . A Rose to the Living .…
-
కొత్త సంవత్సరం… ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను
2014 మిత్రులకీ బ్లాగు సందర్శకులకీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు My Hearty Greetings to all Friends and visitors for a very Happy and Prosperous New Year . May the New Year fill your Homes with Health, Prosperity and Happiness. . కొత్తసంవత్సరంలో కవితల్లో చెప్పడానికేముంటుంది ఇంతకుముందు కొన్నివేల సార్లు చెప్పింది కాకుండా? కొత్తసంవత్సరాలొస్తుంటాయి, పాతవి వెళ్తుంటాయి మనం కలలు కంటుంటాం, అవి గాలిమేడలని…
-
నగరం లోని చెట్లు… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను
పుర వీధుల్లోని చెట్లు రోడ్లమీద వాహనాలూ, రైళ్ళ కూతలూ లేకుంటే జనపథాలపక్కని చెట్లలా, అంత సుతిమెత్తని, తీయని ధ్వని చేస్తాయి. వర్షానికి, వాటి నీడలో తలదాచుకుంటున్న మనుషులు నిస్సందేహంగా పల్లెల్లోని చెట్లమీద వాన చేసే సంగీతాన్ని వినగలరు నగర రణగొణధ్వనికి మౌనాన్ని వహించే చిన్ని చిగురాకుల్లారా! పిల్లతెమ్మెర వీచినపుడు నే గమనింఛా,- మీరెంత చిరుసవ్వడి చేస్తారో. . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే (February 22, 1892 – October 19) అమెరికను కవయిత్రి . .…
-
క్రీడ… హేమ్లిన్ గార్లాండ్, అమెరికను కవి
ఎక్కడో, దూరంగా పెనవేసుకున్న పనలతో, పండిన గోధుమ చేలలో ఒక చిన్న అడివికోడిపిల్ల ఏడుస్తోంది తనవాళ్ళందరినుండి తప్పిపోయి, వేడుకుంటూ, వెక్కివెక్కి. ఇంతలో, మట్టికొట్టుకుని, రెక్కలు చెదిరి దుమ్ముకొట్టుకున్న కళ్ళతో సమాధానం చెప్పలేని తల్లి కోడి వేటగాడి కాళ్ళదగ్గర రక్తమోడుతూ, కదల్లేక పడి ఉంది. . హేమ్లిన్ గార్లాండ్ (September 14, 1860 – March 4, 1940) అమెరికను కవి. . . Sport . Somewhere, in deeps Of tangled, ripening wheat,…
-
సమవర్తి మృత్యువు… జేమ్స్ షెర్లీ. ఇంగ్లీషు కవి
గొప్పింటి పుట్టుకలగురించీ, అధికార దర్పాలగురించీ చెప్పుకునే వన్నీ కేవలం మిధ్య, వాస్తవాలు కావు; విధిని ఎదిరించి నిలవగల కవచం ఏదీ లేదు; మహరాజులైనా మృత్యువు తన శీతహస్తంతో స్పృశిస్తుంది, కిరీటాలూ, రాజ చిహ్నాలూ దొర్లి పడవలసిందే పాడుబడ్డ బొరిగ తోనూ, పార తోనూ సమానంగా మట్టిపాలుకావలసిందే. కత్తులతో కొందరు యుద్ధరంగంలో జయించొచ్చు మృతుల హారాలని ధరించి సరికొత్త చరిత్ర లిఖించుకోవచ్చు కానీ, చివరకి ఏదోనాటికి వాళ్ళ సత్త్వము ఉడుగక తప్పదు విధితో పోరాడుతూ జయాపజయాలు చేతులు మారొచ్చు…
-
విస్మృతి… జెస్సీ రెడ్మన్ ఫాసెట్, అమెరికను కవయిత్రి
నేను మరణించిన పిదప ఎక్కడో నిర్మానుష్యమైన సమాధిలో ఉండాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే చెప్పలేను; కానీ, నాకు ఎవ్వరికీ తెలియని, అందరూ మరచి, పాడుబడి ఉపేక్షించబడిన చోట నిద్రించాలని ఉంది. నే నలా పడుక్కుని, నా మృత్యుశ్వాసతో గ్రహించగలగాలి నిర్జీవత్వాన్నీ, పరిపూర్ణమైన మృత్యు స్పర్శనీ; సమాధుల పక్కనుండి పోయేవాళ్ళు తరచు పలికే అసూయా, ద్వేషాలతో కూడిన వాక్కులెన్నడూ వినకూడదు ప్రార్థనలు గాని, కన్నీళ్ళు గాని నాలోకి ఇంకకూడదు అవి నిష్కారణంగా మృతుల్ని హింసించి, చెవులని బాధిస్తాయి; అక్కడ నేను…
-
రెండు దృక్పధాలు… ల్యూసియన్ వాట్కిన్స్, అమెరికను
గంభీరమైన ఈ లోయలోంచి చూస్తుంటే, వావ్! జీవితం ఎంత అద్భుతంగా, అందంగా, ప్రశాంతంగా, గొప్పగా అనిపిస్తోంది, దూరాన శైలసింహాసనం మీద పసిడి సూర్యబింబ మకుటం! సమున్నతమైన ఈ శిఖరాగ్రంమీదనుండి చూస్తుంటే దూరాన కలువలు విరిసిన ఆ కనుమ ప్రశాంతంగా నిద్రిస్తూ, ఏ సడీ లేక, నులివెచ్చగా, మెత్తగా, పచ్చగా నిగనిగలాడుతూ కనిపిస్తోంది! . ల్యూసియన్ వాట్కిన్స్ అమెరికను . Image Courtesy: http://digitalgallery.nypl.org/nypldigital/dgkeysearchdetail.cfm?trg=1&strucID=539826&imageID=1216454&parent_id=539787&word=&snum=&s=¬word=&d=&c=&f=&k=0&sScope=&sLevel=&sLabel=&total=41&num=20&imgs=20&pNum=&pos=40 . Two Points of View . From this low-lying valley;…
-
ఆఫ్రికా నుండి అమెరికాకు … ఫిల్లిస్ వ్హీట్లీ, అమెరికను
నాగరికత ఎరుగని నేల నుండి విధి ఇక్కడకి తీసుకొచ్చింది అంధకారంలో ఉన్న నా ఆత్మకి అవగాహన నేర్పింది: దేవుడున్నాడనీ, ఒక రక్షకుడున్నాడనీ నేను మోక్షాన్ని కోరుకోనూ లేదు, అసలుందనీ తెలీదు. మా నల్ల జాతిని కొందరు నిరసనగా చూస్తారు, “వాళ్ళ రంగు రాక్షసుల రంగు,” అంటూ క్రిస్టియనులారా! గుర్తుంచుకొండి. నీగ్రోలు కెయిన్ లా నల్లగా ఉండొచ్చు కాని వాళ్ళు సంస్కరించబడి, దివ్యపరంపరలో చేరగలరు. . ఫిల్లిస్ వ్హీట్లీ (1753 – 5 డిశంబరు 1784) అమెరికను .…
-
మన వియోగం విలక్షణమైనది … అజ్ఞాత కవి
మిత్రులకీ, బ్లాగు సందర్శకులకీ క్రిస్మస్ శుభాకాంక్షలు . మనం ఎడబాసినపుడు అందరిలా ఉండకూడదు… నిట్టూరుస్తూ, కన్నీరు కారుస్తూ. ఇద్దరం శరీరాలు వేరయినా, ఒకరికొకరు దూరమయినపుడు ఒకరి హృదయంలో రెండోవారిని నిలుపుకుంటాం. ఎవరు వెదకి పట్టుకోగలరు నేను లేకుండా నువ్వు మాత్రమే ఉండగలిగే జీవిని? సిసలైన ప్రేమకి రెక్కలుంటాయి; తలచినంత మాత్రమే అది ప్రపంచాన్ని చుట్టి రా గలదు సూర్యచంద్రుల్లా. ఇతరులు అందరూ ఎడబాటుకి వగచి విలపించే చోట మన విజయాలు ఎడబాటుని మరపింపజేస్తాయి. దానివల్లే, స్వర్గంలో…
-
పెళ్ళిచేసుకోమని ఒక స్త్రీని అర్ధిస్తున్న వానికి హితవు … కేథరీన్ ఫిలిప్స్, ఇంగ్లీషు- వెల్ష్ కవయిత్రి
నిలు నిలు, ధైర్యశాలీ! ఇదంతా స్వర్గ ధామమే. నువ్వు ఏది ప్రమాణం చేసిచెపుతున్నావో ఇతరులకి అది పెండ్లికి అభ్యర్థిస్తున్నట్టు కనిపించొచ్చు ఆమెపట్ల అది మహాపచారం. ఆమె ప్రజలందరికీ ఆరాధ్య దేవత. ఒక చిన్న అనామకమైన ఇంట్లో దేవతలా ఆమె కొలువై ఉండడం చూడ్డానికి చాలా వింతగా అనిపించదూ? ముందు ఒక పని చెయ్యి. లోకానికి సెలవు చెప్పి సూర్యుణ్ణి నీ ఒక్కడికోసం ప్రకాశించమను. అతడు తన కిరణాలన్నిటితో నీకు పరిపూర్ణత ప్రసాదించనీ. అల జరగడం లేదని ఒకవేళ…