వర్గం: అనువాదాలు
-
మనసు తాకే రీతులు… మిల్లర్ విలియమ్స్, అమెరికను కవి
నువ్వు కలిసే ప్రతిమనిషిపై అనుకంప చూపించు… వాళ్ళు అక్కరలేదన్నప్పటికీ. మనకి అసభ్య నడతగా, చిటపటలాడే స్వభావంగా, నిరాశావాదంగా కనిపించే ప్రవర్తన మన చెవులు వినని, కనులు చూడని ఎన్నో వాటికి సంకేతం. అక్కడ… “దేహమూ ఆత్మా సహజీవనంచేసే చోట” ఎన్ని అగోచర అంతర్యుద్ధాలు జరుగుతున్నాయో నీకు తెలియదు. . మిల్లర్ విలియమ్స్ (born April 8, 1930) Note: దేహమూ ఆత్మా సహజీవనంచేసే చోట (“Spirit meets the Bone”): దేహము పదార్థానికి ఉదాహరణ అయితే, ఆత్మ…
-
కాలం ఏ ఉపశాంతీ కూర్చదు… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి.
కాలం ఏ ఉపశాంతీ ఇవ్వదు; మీరుచెప్పినదంతా పచ్చి అబద్ధం. కాలమే నా బాధని మాన్పుతుందని చెప్పిందెవడు? ఈ హోరుమంటున్న రాత్రిలో అతని తోడులేమి వెలితే. సముద్రం ఆటులో ఉన్నప్పుడు తను నాప్రక్కనుంటే బాగుణ్ణు ప్రతి కొండ వాలులోనూ మంచు కరిగి ప్రవహిస్తోంది. క్రిందటేడువి ఆకులు ప్రతివీధిలో దర్శనమిస్తున్నాయి; కానీ, ఆలోచనలలోనే మిగిలిన క్రిందటేటి గాఢమైన ప్రేమ నా గుండెల్లో భద్రంగా పేరుకుంది. నేను వెళ్ళడానికి భయపడే స్థలాలు వంద. ఎందుకంటే అవన్నీ అతని జ్ఞాపకంతో పొర్లుతుంటాయి. ప్రశాంతతకోసం, అతని…
-
ప్రియురాలి స్మృతికి… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి.
ఆమె జీవితం అంతా బంగారపు ఇసుకని తెలివితక్కువగా చక్రాలుగా, ముగ్గులుగా అరచేతి వేళ్లసందుల్లోచి జారనిస్తూ ఇసుకకోటలు కట్టడానికే సరిపోయింది. హరివిల్లులు ఒకదానివెనకఒకటివచ్చినట్టు మంచిరోజులు కట్టగట్టుకుని వచ్చినా వాటినన్నిటినీ ఆమె తృణప్రాయంగా విసిరేసింది కుళ్ళు కాలవలో సుడులుతిరుగుతూ పోయేట్టు. ఆమె కొరకు ఒక కొత్త గులాబీ మొగ్గని వదిలి మీ మానాన్న మీరు వెళ్ళండి; జాలి పడొద్దు; ఆమె హాయిగానే జీవించింది; ఆమెకి తెలుసు, తను మట్టిలోకలిసినా, అదీ అందంగా ఉంటుందని. . డొరతీ పార్కర్. August 22,…
-
ప్రార్థన … కెరోల్ ఏన్ డఫీ, బ్రిటిషు కవయిత్రి
ఒక్కో సారి, మనం ప్రార్థన చెయ్యకపోయినా, ప్రార్థన దానంతట అదే నోటంట వస్తుంది; ఒకోసారి చేతుల జల్లెడలోంచి ఓ స్త్రీ తలెత్తి పైకి చూసి అనుకోని వరం లాంటి చెట్లుపాడే శృతులు వింటుంది. మనకి విశ్వాసం లేకపోవొచ్చు గాని, కొన్ని రాత్రుళ్ళు సత్యం మనగుండెల్లో జొరబడి సన్నగా సలుపుతుంది; అప్పుడు మనిషి చెట్టుబోదెలా నిశ్చలంగా నిటారుగా నిలబడి దూరంగా పట్టాలమీద అర్థంకాని రైలుపాటలో తన యవ్వన గీతాల్ని వింటాడు. ఇప్పుడు మాకై ప్రార్థించండి. సత్రంనుండి నగరాన్ని వీక్షిస్తున్న…
-
ప్రశాంత సాగరం… లాంగస్టన్ హ్యూజ్, అమెరికను కవి
ఎంత నిశ్చలంగా ఉంది, చిత్రంగా ఎంత నిశ్చలంగా ఉంది ఈ రోజు సముద్రం. నీరు అలా నిశ్చలంగా ఉండడం అంత మంచిది కాదు. . లాంగ్ స్టన్ హ్యూజ్ ఫిబ్రవరి 1, 1902 – మే 22, 1967 అమెరికను కవి . Langston Hughes . Sea Calm . How still, How strangely still The water is today, It is not good For water To be so…
-
పసిఫిక్ తీరంలో ఒకసారి… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి
విరిగిన అల పెద్ద చప్పుడుచేసుకుంటూ బిందుతెర వేసింది. పెద్ద కెరటాలు వెనక్కి తిరిగిచూశాయి తమని అనుసరిస్తున్నవాటిని, మునుపెన్నడూ నీరు తీరానికి చెయ్యనిది ఏదో చెయ్యాలని సంకల్పించుకున్నాయి. ఆకాశంలో మేఘాలు దిగువగా కేశాల్లా వేలాడుతున్నాయి కళ్ళవెలుగులకి అడ్డంగా తారాడుతున్న ముంగురుల్లా మనం ఆ మాట అనలేము గానీ, అలా అనిపిస్తోంది తీరం అదృష్టవంతురాలే, పెద్దకొండదన్నుగా ఉందని. ఆ కొండకి భూఖండం దన్నుగా ఉంది; రాత్రి ఏదో ఉపద్రవం రాబోతోందనిపిస్తోంది, రాత్రి ఒక్కటే కాదు, బహుశా ఒక యుగం కావొచ్చు.…
-
హార్బరులో… కన్స్టాంటిన్ కవాఫిజ్, గ్రీకు కవి
ఏమ్స్ అన్న యువకుడు, ఇరవై ఎనిమిదేళ్ళుంటాయి, టెనోజ్ రేవు నుండి ఈ సిరియను హార్బరులో దిగేడు అత్తరు వ్యాపారం లో మెలకువలు నేర్చుకుందామన్న తలపుతో. కానీ, పాపం, ప్రయాణంలో రోగం పాలయ్యాడు. అలా ఓడలోంచి దిగడమే తడవు, చనిపోయాడు. అతని ఖననం, చాలా కనికిష్టమైనది, ఇక్కడే జరిగింది. చనిపోవడానికి కొన్ని గంటలు ముందు, “ఇంటి” గురించీ, “ముసలి తల్లిదండ్రులు” గురించీ ఏవో గొణిగాడు. కానీ, వాళ్ళెవరో ఎవరికీ తెలీదు. ఈ గ్రీకుప్రపంచానికి ఆవల అతనిది ఏదేశమో తెలీదు.…
-
విశ్రాంతి… క్రిస్టినా రోజేటి, ఇంగ్లీషు కవయిత్రి
ఓ నేలతల్లీ! ఆమె కళ్ళను గట్టిగా ముయ్యి; ప్రపంచాన్ని చూసి చూసి అలసిన ఆమె అందమైన కళ్ళని ముయ్యి; ఆమెను దగ్గరగా హత్తుకో; సుఖానికి ఏ మాత్రం సందివ్వకు గట్టిగా నవ్వే ఆ నవ్వుకీ; లేదా నిట్టుర్చే నిట్టూర్పులకీ. ఆమెకు అడగడానికి ప్రశ్నలూ, చెప్పడానికి సమాధానాలూ లేవు; పుట్టిన దగ్గరనుండీ ఆమెను బాధించినవాటిలో ఈ కరువు ఆమెను మూగదాన్ని చేసి ఆమెపై పరదా కప్పింది; ఆ నిశ్చలత్వం ఒక రకంగా నిజంగా స్వర్గమే. మధ్యాహ్నం కంటే కూడా…
-
కీట్స్ వర్థంతి సందర్భంగా… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి.
వెన్నెలలనద్దుకున్న తమాల వృక్షాలు అర్థరాత్రి అతని సమాధిమీద వింత వింత నీడలు అల్లుతున్నప్పుడు, అప్పుడే విడిచిన నులివెచ్చని వానచినుకులలో తడిసిన జాజిపూలగుత్తులమీదనుండి పరిగెత్తే ప్రాతసమీరంలా అతని అసంపూర్ణ గీతాన్ని దీనంగా ఆలపిస్తోంది గాలి; అతని శిరసు మీదకి వంగి చంద్రకాంత రోదిస్తోంది, కెరటాలన్నీ నిశ్చలమై నిలిచిపోగా, పోటెత్తుతున్న సముద్రాలు చీకటిలో మునిగి ప్రశాంతమై పోయేయి; గాఢనిద్రలో అప్పుడపుడు మూలిగుతూ, తనను ఆవరించిన నీరవ మేదినిని ఆశ్చర్య పరిచే అతనిపై ఎంత జాలంటే మైదానాలనీ, కెరటాలనీ మేల్కొలపగలిగినవారికి అతన్ని…
-
జీవన శకటం … అలెగ్జాండర్ పుష్కిన్, రష్యను కవి
ఉండుండి అదిమొయ్యవలసిన బరువు భారమైనా ఈ శకట గమనం నెమ్మదిగా సాగుతుంటుంది; జుత్తు నెరిసిన సాహస కాల చోదకుడు బండి మొగలులో సుఖంగా కూచిని తోలుతుంటాడు. ప్రాభాతవేళ దానిలోకి ఉత్సాహంతో దూకి ఒక అద్భుతమైన ప్రయాణానికి సిద్ధపడతాం. సోమరితనాన్నీ, అలసటనీ లక్ష్యపెట్టకుండా మనం అరుస్తాం: “ఊం! త్వరగా! మనం అక్కడికి చేరుకోవాలి” కానీ మధ్యాహ్నమయే సరికి మన ధైర్యం సన్నగిలితుంది, మనం భయపడతాం; ఆ సమయానికి కొండలూ లోయలూ భీతావహంగా కనిపిస్తాయి. అప్పుడు, “ఓ, సారధీ! మూర్ఖుడా!…