వర్గం: అనువాదాలు
-
అనుభూతి … ఆర్థర్ రింబాడ్, ఫ్రెంచి కవి
చక్కని వేసవి రాత్రుల్లో లేత పచ్చికని తొక్కుతూ, గోధుమలు గుచ్చుకుంటుంటే, పొలాలంబడి నడుచుకుంటూ వెళ్తాను… కలలు కంటూ, నా కాళ్ళకింద చల్లదనాన్ననుభవిస్తాను, ఏ ఆచ్ఛాదనా లేని నా శిరస్సుని చిరుగాలి అనునయానికి వదిలేస్తూ. ఒక మాటగాని, ఒక ఆలోచనగాని ఉండదు; నా ఆత్మలో అనంతమైన ప్రేమతత్త్వం పెల్లుబుకుతుంది, నెచ్చెలి చెంత ఉన్నవాడిలా, ఆనందంగా ప్రకృతిలో ఏ గమ్యమూ లేని దేశదిమ్మరిలా అలా దూరతీరాలకు సాగిపోతాను. . ఆర్థర్ రింబాడ్, (20 October 1854 – 10…
-
ఒక్క గుండెనైనా … ఎమిలీ డికిన్సన్, అమెరికను
ఎమిలీ డికిన్సన్ స్మృతిలో ఒక్క గుండెనైనా పగలకుండా ఆపగలిగితే నా జీవితం వృధా కానట్టే; ఒక జీవితంలోనైనా కష్టాన్ని తగ్గించగలిగితే, బాధని ఉపశమింపజెయ్యగలిగితే, శోషిల్లుతున్న ఒక పక్షినైనా రక్షించగలిగి దాని గూటికి చేర్చగలిగితే, ఫర్వాలేదు… నా జీవితం వృధా పోలేదు. . ఎమిలీ డికిన్సన్ (December 10, 1830 – May 15, 1886) అమెరికను. . . If I Can Stop One Heart From Breaking . If I can stop…
-
పరోక్షము… రిఛర్డ్ జాగో, ఇంగ్లీషు కవి
డేలియా దూరంగా ఉన్నప్పుడు, గుదిబండ తగిలించినట్టు కాళ్ళీడ్చింది కాలం; ఆమె వెంట ఉన్నప్పుడు పాటలోనూ వేదనలేదు ఏ రోజూ విసుగు కలగలేదు. ఓ అసూయాగ్రస్త కాలమా! నీ విధి తిరగరాయి; నీ నడకని మరింత నెమ్మది చెయ్యి, ఎంత కష్టపడాలో పడు, ఎంత దోచుకుంటావో దోచుకో ఆమె పక్కన ఉన్నప్పుడు క్షణాలనన్నిటినీ. . రిఛర్డ్ జాగో (1 October 1715 – 8 May 1781) ఇంగ్లీషు కవి. . . Absence . With leaden…
-
ఓ జ్ఞాపకమా! నమ్మక ద్రోహీ! … ఆలివర్ గోల్డ్ స్మిత్, ఐరిష్ కవి
ఓ జ్ఞాపకమా! నమ్మక ద్రోహీ, నువ్వొక మిధ్యవి, అయినా విసిగిస్తూ ఉంటావు ఎప్పుడూ గతకాలపు వైభోగాలు గుర్తుచేస్తూ గతాన్ని అంతటినీ ఒక బాధగా మిగులుస్తావు. ప్రపంచం లాగే, నువ్వూ బాధితుల్నే బాధిస్తావు, నీ నవ్వులు, పాపం ఆ బడుగు జీవి వేదనను పెంచుతూంటుంది ఎవడైతే అందరి శ్రేయస్సూ ఆశిస్తుంటాడో వాడికి తప్పకుండా నువ్వో బద్ధ శత్రువవుతావు. . ఆలివర్ గోల్డ్ స్మిత్ (10 November 1730 – 4 April 1774) ఐరిష్ కవి. . Oliver…
-
గరికలో మిలమిల… వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి.
ఒకప్పుడు ఎంతో అందంగా ఉండి మిలమిలలతో మెరిసిన దాని అందం మనకళ్ళముందునుండే మాయమైతే నేమి? గరికలో మెరిసిన ఆ పువ్వు సౌరభమూ, మెరుపులూ ఆ క్షణాలూ ఇక తిరిగి రాకపోయినా మనమేమీ బాధపడము. బదులుగా అది విడిచివెళ్ళిన దానిలోనుండి ఏదోధైర్యాన్నీ అనాదిగా మనసు స్పృశించే సానుభూతి పంచుకుంటాం… మానవ హృదయంలో బాధలు చూస్తున్నపుడు అసంకల్పితంగా చిప్పిలే ఆత్మీయ అనుభూతి అది ఒక సారి పొందిన అనుభూతి శాశ్వతంగా ఉంటుంది; అదే విశ్వాసం మృత్యువును చూస్తున్నపుడూ కలుగుతుంది. కాలం…
-
The Guest … Shajahana, Telugu, Indian
The Guest . I said, “Welcome to my guest.” He said, “No, I am a refugee. A dove that has escaped The talons of pursuing hawks. ” I just treated him as a guest. I could not make out what to serve him. “May I know what would you like…?” I meant food. “Like…
-
ఒక నక్క మీ పెంపుడు కోళ్ళు ఎత్తుకు పోతుంది, సర్ … జాన్ గే , ఇంగ్లీషు
ఒక నక్క మీ పెంపుడు కోళ్ళు ఎత్తుకు పోతుంది, సర్ ఒక వేశ్య మీ ఆరోగ్యాన్నీ, ఆస్థినీ, సర్ మీ అమ్మాయి కేవలం మీ ఇనప్పెట్టె ఎత్తుకుపోవచ్చు, సర్ మీ భార్య మీ మనశ్శాంతినీ, ఒక దొంగ మీ వస్తువుల్నీ, వాహనాల్నీ, సర్. కానీ ఇదంతా కేవలం ఎత్తుకుపోవడం గురించి. మనశ్శాంతైనా, ఆస్థైనా, ఇనప్పెట్టైనా, కోళ్ళైనా; కాని అదెప్పుడో రాసిపెట్టి ఉంది సర్, ఒక వేళ న్యాయవాదికి గాని ఫీజు చెల్లించాల్సి వస్తే అతడు మీ సర్వ…
-
ముదిమి… ఎడ్మండ్ వేలర్, ఇంగ్లీషు కవి
గాలులు అలసి శోషించి, సాగరాలు ప్రశాంతంగా ఉన్నాయి; ఉద్రేకాలు చల్లబడినపుడు మనమూ అంత ప్రశాంతంగానూ ఉంటాము. క్షణభంగురాలై, నశించిపోయేవాటిగురించి గర్వించడం ఎంత వృధానో మనకి తెలుస్తుంది. ముదిమి స్పష్టంగా చూడగల ఆ శూన్యాన్ని యవ్వనంలో ఉన్నపుడు ప్రేమ పొరలు మసకబారుస్తాయి. ఎన్నో ఎదురుదెబ్బలు తిని, శిధిలమైన ఈ అంధకారపు ఆత్మ గృహం కాలం చేసిన రంధ్రాలలోంచి కొత్తవెలుగులు లోనికి పోనిస్తుంది; వాళ్ళ శాశ్వత నివాసానికి దగ్గర చేరుతున్నకొద్దీ, మనుషులు తమ బలహీనతల వల్ల, జ్ఞానవంతులౌతారు. ఈ శరీరాన్నీ,…
-
పసిపాప … జార్జ్ మేక్డొనాల్డ్, స్కాట్లండు
ప్రియమైన పాపాయీ, నువ్వెక్కడనుండి వచ్చేవు? సర్వవ్యాప్తమైన ప్రకృతినుంచి ఇక్కడికి. నీకు ఆ చక్కని నీలి కళ్ళు ఎలా వచ్చేయి? దారిలో నే తెరుచుకొచ్చిన ఆకాశపు తెరనుండి. మరి ఆ కళ్ళలో వెలుగుల మిలమిలలెక్కడివి? చుక్కల తునకలు కొన్ని అందులో చిక్కుకున్నందుకు. ఆ చిరు కన్నీటి చుక్క ఎక్కడినుంఛి వచ్చింది? నే నిక్కడికొచ్చేసరికి నాకోసం ఎదురుచూస్తోంది. నీ నుదురు అంత మెత్తగా, ఎత్తుగా ఉందెందుకు? నేను పక్కనుండి వెళుతుంటే ఒక మృదు హస్తం…
-
నావిక ప్రియునికి… అజ్ఞాత కవి
నేనెప్పుడూ నీకోసం తపించడమేగాని పిసరంతైనా దరిచేరలేనా? నేను మొరపెట్టుకోవడమే గాని, నా మాట వినిపించుకోవడం ఉండదా? అయ్యొ! కనీసం అలా కాదు, కాదులే అనైనా చెప్పు. అలా ముంగిలా ఊరుకోకు. నీ మగతనం ఉట్టిపడే గొంతుకతో చెప్పు : నేను వస్తున్నానని. అప్పుడు నిన్ను చూడలేకపోయినా నా మనసు ఊరటచెందుతుంది నువ్వు వస్తావన్న నమ్మకంతో. నీ మాటే ప్రమాణం. నువ్వు బ్రతికుంటే. ఉధృతంగా ఎగసిపడే ఈ కెరటాలు నన్ను భయపెడుతున్నాయి ఆలోచనలను ముందుకీ వెనక్కీ కుదిపి భయపెడుతూ.…