వర్గం: అనువాదాలు
-
నా మాట నమ్మకు… ఏ కె టాల్ స్టాయ్, రష్యను కవి
ఎప్పుడైనా నేను నిన్ను ప్రేమించడం లేదంటే ప్రియతమా! నువ్వు నా మాట విశ్వసించకు. కెరటాలు వెనక్కి తగ్గేయని సముద్రాన్ని నమ్మకు అది కొత్తగా విరుచుకు పడుతుంది. అప్పుడే మనసు రాగరంజితమై నీకై పరితపిస్తోంది. మరోసారి నా స్వాతంత్ర్యాన్ని నీకు సమర్పించుకుంటాను. అప్పుడే అలలు ఆనందంతో తుళ్ళుతూ ఉరకలేస్తున్నాయి ఎరిగిన ఆ ప్రేమ తీరాలని తిరిగి ముంచెత్తడానికి. . ఏ కె టాల్ స్టాయ్ 5 September 1817 – 10 October 1875 రష్యను కవి …
-
నా రాతల గమ్యం … విలియం బట్ల యేట్స్, ఐరిష్ కవి
నేను మాటాడిన మాటలన్నీ నేను రాసిన పదాలన్నీ విషాద భరితమైన నీ గుండెలు చేరే దాకా… అలుపులేకుండా వాటి రెక్కలని సాచాలి, విరామమెరుగకుండా ఎగరాలి… ఎగిరి, ఆ రాత్రి, ప్రవహిస్తున్న నీ కన్నీరు నక్షత్రకాంతిలో మెరిసినా, తుఫాను చీకట్లకు నల్లబడినా, నా పాటను నీకు వినిపించాలి. . విలియం బట్ల యేట్స్ 13 June 1865 – 28 January 1939 ఐరిష్ కవి . . Where My Books Go . All the…
-
నిద్ర… సర్ ఫిలిప్ సిడ్నీ, ఇంగ్లీషు కవి
(కవిత్వమన్నా, స్నేహానికిప్రాణంపెట్టడమన్నా, ఉత్తమమైనశీలాన్ని అలవరచుకోవడమన్నా, చనిపోతున్నపుడుకూడా మానవీయవిలువలకి జీవితాన్నిఅంకితంచేసి ఉదాత్తంగా వ్యవహరించడమన్నా, సర్ ఫిలిప్ సిడ్నీ నుండి ఈ కాలపు కవులు నేర్చుకోవగలిగినది చాలా ఉంది. ఇంగ్లీషు కవీ, రాజసేవకుడూ, సైనికుడూ అయిన సర్ ఫిలిప్ సిడ్నీది ఉదాత్తమైన వ్యక్తిత్వం. అతని అపురూపమైన వ్యక్తిత్వానికి చిహ్నంగా ఒక కథ బహుళ ప్రచారం లో ఉంది. తన స్నేహితుడికోసం యుధ్ధానికి వెళ్ళిన సిడ్నీ, గాయపడి పడిపోయి, దాహ దాహం అంటుంటే, ఎవరో తాగడానికి నీళ్ళు తీసుకు వచ్చి అతనికి…
-
వీడ్కోలు… హారియట్ మన్రో, అమెరికను కవి
శలవు! అంతా ముగిసిపోయిందని దుఃఖించకు. ఇదే సరియైన సమయం. ఆనందపు రెక్కల నికుంజవిహారి, మధుపాయి పువ్వును వీడిందని వగవొద్దు. అది ప్రకృతి ధర్మం. ప్రేమ క్షణికం. ఓహ్! ప్రేమేమిటి, అన్నీ క్షణికమే. జీవితం ఆనందంగా గడిచింది. మృత్యువుని కూడా పరమానందమే. ఆకుల్ని రాలిపోనీ. . హారియట్ మన్రో 23 డిశంబరు 1860 – 26 సెప్టెంబరు 1936 అమెరికను కవి. . A Farewell . Good-by!—no, do not grieve that it is over, …
-
మృత్యువుకి వినతి … కెరొలీన్ సదే, ఇంగ్లీషు కవయిత్రి
ఓ మృత్యువా! భయపెడుతూ రాకు, ఏమాత్రం ప్రతిఘటించని ఈ ఎరని ఎగరేసుకుపోడానికి సాయంత్రపు నీడలా రా, అంత నిశ్శబ్దంగానూ, అంత చాటుగానూ! నా కన్నులు మూసి, ఊపిరి తీసుకుపో; అప్పుడు నేను ఇష్టంగా, ఓహ్, ఇష్టంగానే నిన్ను నేను అనుసరిస్తాను. . సున్నితంగా తాకితే సరిపడేచోట ఇనపగొలుసుల అవసరమేముంది చెప్పు? ఈ అలసిన ఆత్మ పట్టించుకోకపోయినా అంత ఘోరంగా, అంత భయానకంగా నల్లని ఆకృతితో భయపెట్టవలసిన అవసరం ఏముంది? నెమ్మదిగా పిలిస్తే, సుకుమారంగా అడిగితే చాలదూ అఖండమైన…
-
అటువంటి దేశాన్ని చూసి జాలిపడు… ఖలీల్ జిబ్రాన్, లెబనీస్ అమెరికన్ కవి
(మహాకవులు ఎప్పుడూ దార్శనికులే. వాళ్ళ కృతులు పరిమితం కావచ్చునేమో గాని వాళ్ళ పలుకుల విస్తృతి అపరిమితం. అవి దేశకాల అవధుల్ని అవలీలగా జయించి వాటిలోని సత్యాన్ని ఆవిష్కరిస్తూనే ఉంటాయి. ఈ కవితలోని ప్రతి పాదములో చెప్పిన భావానికీ (లేదా వేదనకీ), నేడు మనదేశ వ్యవస్థలో పొల్లుపోకుండా ఉదాహరణలు కనిపిస్తాయి. అంతకంటే గొప్పనిదర్శనం ఏమిటి కావాలి?) ఏ దేశ ప్రజలకి అఖండమైన విశ్వాసాలుండి, ఆచరణలో అవి మృగ్యమో; ఏ దేశం అక్కడ నేయని బట్టని తొడుక్కుని, అక్కడపండని పంటని…
-
చవకబారు సత్రం….ఛార్లెస్ బ్యుకోవ్స్కీ, అమెరికను కవి
చవకబారు సత్రంలో నువ్వు ఎన్నడైనా ఉండి ఉండకపోతే నీకు జీవితం అంటే ఏమిటో తెలియనట్టే… అక్కడ ఒక్కటే బల్బూ 56 మంది మనుషులూ మంచాలమీద ఇరుక్కుంటూ… అందరూ ఒకేసారి గురకపెడుతూ; అందులో కొందరి గురక నమ్మలేనంత దీర్ఘంగా, గట్టిగా ఘోరంగా అమానుషంగా ఉండి సాక్షాత్తూ నరకంనుండి వస్తున్నాయా అనిపిస్తుంది. ఆ మృత్యుఘోషని మరపించే గురకకి దానితో కలగలిసిన దుర్గంధానికీ నీకు మతిపోయినంత పనిజరుగుతుంది: ఎన్నడూ ఉతికి ఎరగని మేజోళ్ళూ మలమూత్రాల వాసన పట్టెసిన లో దుస్తులూ వాటిమీదనుండి…
-
తుదిపలుకులు… జాన్ నీహార్ట్, అమెరికను కవి
ఓహ్! నన్ను సమాధిలో వెతక్కు నేనా మట్టిలో కనిపించను! వెలుగులో కలిసిపోడానికి ఆ చికటి కుహరానికి ఒక కంత పెడతాను. గడిచిన అన్ని సందర్భాలతో చెలిమిచేశాను దిమ్మతిరిగే ఆనందమైనా, నొసలు చిట్లించే దుఃఖమైనా; నేను గడ్డితోనూ స్నేహానికి సిద్ధమే ఎండకాగే తలిరాకుతోనైనా సిద్ధమే. మృత్యువు నన్ను కనుమరుగుచెయ్యలేదు; బాధతో సానపట్టిన ఆనందపు కత్తి పట్టి వానచినుకుల, మెరుపుల, మేఘాల పటాలాలతో జతగూడుతాను. ఆహ్! నా కణాల్లో ఏదో తెలియని ఉత్తేజం నన్ను ఆనందంతో చురుకుగా లేవనెత్తుతుంది విశ్వ…
-
స్పెయిను కి… జోస్ జొరిల్ల, స్పానిష్ కవి
ఓ నా దేశమా! నీకోసం ఎన్ని కన్నీళ్ళు కారేయి! ఎంతమంది సోదరుల రక్తం ఏరులై ప్రవహించింది! ఎంతమంది వీరులు అపురూపమైన నీ నేలమాళిగల్లో ప్రశాంతంగా నిద్రిస్తున్నారు ! ఎనాళ్ళనుండో మా కళ్ళు కవోష్ణ బిందువులతో నిండేయి… ఎన్నిసార్లో అవి బయటకి ఉబుకుదామని ప్రయత్నించేయి! కాని, ప్రతి సారీ మరో యుద్ధభూమికి మొగ్గుతూ విపత్తులకీ, రక్తానికీ జారి పడడం మానుకున్నాయి. చూడు! అదిగో అల్లంత దూరాన ఉన్న అడవులూ, నేలగుండెమీద నిద్రిస్తున్న పంటచేలూ, ఈ లోయలపై తమ పచ్చని…
-
అదృష్టాన్ని వెతుక్కుంటూ… జూరి ఫెడ్కోవిచ్, బ్యుకోవియన్ కవి
సోదరా! నువ్వు ఇంటిపట్టున ఉన్నావు వ్యవసాయం చేసుకుంటూ నేను అదృష్టాన్ని వెతుక్కుంటూ మైళ్ళకి మైళ్లు తిరుక్కుంటూ జర్మనీకి పరిగెత్తేను. ఇక్కడ ఈ బ్యుకోవినా ఆకాశం క్రిందకి వచ్చేను, రాళ్ళూ రప్పలతో కూడిన తియరోల్ చేరుకున్నాను. ఎక్కడైనా అదృష్టం కలిసొస్తుందేమోనని ఇంకా తిరుగుతూనే ఉన్నా. సోదరా! నువ్వు మంచిపని చేశావు ఇన్నాళ్ళూ వ్యవసాయం చేసుకుంటూ. నాకు అదృష్టం కలిసిరాలేదు. నేను దాన్ని వెతుక్కుంటూ ఇంతదూరం వచ్చేను అసలది అది ఉన్నది … ఆ పంటపొలాల్లో. . జూరి ఫెడ్కోవిచ్…