వర్గం: అనువాదాలు
-
సంగతులు 18- కాన్రాడ్ ఐకెన్, అమెరికను కవి
సూర్యుడు పసిడికిరణాలని వడకడుతున్నాడు సూర్యుడు నిశ్శబ్దాన్ని కూడా వడకడుతున్నాడు. ఆకాశంలో మేఘాలు మిరిమిట్లుగొలుపుతున్నాయి. తెమ్మెర వీస్తున్న పూదోటలో నడుస్తున్నాను ఎండిపోయిన పండుటాకులను కాళ్లతో తొక్కుకుంటూ… పాలరాతి పలకమీద ఆకులు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి దాని మీద ప్రేమికులు మౌనంగా కూచున్నారు; ఆకులు ఖాళీ బల్లమీద చెదురుమదురుగా పడి ఉన్నై. అదిగో అక్కడి తేటనీటికొలను, వణుకుతున్నట్టు, సూర్యుడి వేడి కిరణాల్ని అలలతో జాడిస్తోంది. దూరాన పొడవాటి ఒంటరి చెట్టు, అసహనంగా ఆకాశంక్రింద ఎండలో ఊగుతోంది. ప్రియతమా! నేను ఒంటరిగా…
-
ప్రేమ ఒక రోగం… సామ్యూల్ డేనియల్, ఇంగ్లీషు కవి
ప్రేమ విపత్తులతో నిండిన ఒక రోగం; దానికి ఏ మందూ పనిచెయ్యదు; త్రుంచుతున్నకొద్దీ పెరిగే మొక్కలాంటిది వాడిన తర్వాత ఎందుకూ కొరగాదు ఎందుచేత? మనం దాన్ని అనుభవించినకొద్దీ అది తరుగుతుంది; దాన్ని అనుభవించలేదా, అయ్యో అంటూ నిట్టూరుస్తుంది. ప్రేమ ఒక మానసిక హింస, ఎన్నటికీ వదలని తుఫాను భగవంతుడు దాన్నో రకంగా చేశాడు ఎప్పుడూ సుఖం ఉండదు, పూర్తవదు, కరువూ ఉండదు, ఎందుచేత? మనం దాన్ని అనుభవించినకొద్దీ అది తరుగుతుంది; దాన్ని అనుభవించలేదా, అయ్యో అంటూ నిట్టూరుస్తుంది.…
-
భ్రమణ గీతం… ఆల్ఫ్రెడ్ హిచ్, అమెరికను (బహుశా)
కాలంతో పాటే నేనూ దేశదేశాలు తిరుగుతాను కాలంలాగే నేనూ, వెనక్కి తిరిగి రాను; ఎప్పుడూ ఒక కొత్త అజరామరమైన ముఖం నాకు ద్వారం దగ్గర స్వాగతం పలుకుతుంటుంది. స్నేహితులు మారరు, ప్రేమలో వేడి తగ్గదు. జీవితం ఏ మార్పూ రాబట్టదు; నాకు పాతవన్నీ ఎప్పటికీ పాతవే కొత్తవి ఎప్పుడూ కొత్తవే. కాలంతో పాటే నేనూ దేశదేశాలు తిరుగుతాను కాలంలాగే నేనూ, వెనక్కి తిరిగి రాను; ఎప్పుడూ ఒక కొత్త అజరామరమైన ముఖం నాకు ద్వారం…
-
మనిషి బలహీనతలు… సామ్యూల్ బట్లర్, ఇంగ్లీషు కవి
మన బాధలు సత్యం ; కానీ మన సమస్త సుఖాలు ఊహాజనితాలు. రోగాలు వాటంతట అవే వస్తాయి, చికిత్స మాత్రం అంత సులువుగా దొరకదు. మన అపార ధనరాశులూ, ఇంద్రభవనాలూ కేవలం మన సమాధులకు పెరటిళ్ళు; కనీ వినీ ఎరుగని మహానగరాలైనా తుదకు మిగిలేది సమాధుల భాండాగారాలుగానే. ప్రపంచపు నిర్లక్షాన్నుంచి మనల్ని దాచుకునే వ్యర్థ ప్రయత్నమే మన శౌర్యప్రదర్శన; మన నగ్నత్వంలో నిండుగా కనిపించే లోపాలని కప్పిపుచ్చుకుందికి ఆరాటపడుతూనే ఓటమిలోనే మేలుజరిగిందని గొప్పలుపోతూ గర్వంతో వెకిలినవ్వులు నవ్వుతాం.…
-
దూరంగా … క్రిస్టినా రోజెటి, ఇంగ్లీషు కవయిత్రి
ప్రతిస్పందనలేని ఈ నేలమీది నిశ్శబ్దమూ, ప్రత్యుత్తరం లేని కడలి గంభీరమైన ఘోషా, రెండూ నాకు ఒకే అర్థాన్ని అందిస్తున్నాయి: దూరం, దూరం. మేం దూరంగా ఉంటున్నాం. నువ్వుకూడా దూరంగా ఉండు ఖచ్చితమైన హద్దులో: అదే నీ లోపలి శాంతి; మేము నిన్ను కట్టిపడెయ్యము; కాని, నీకు నువ్వు వేసుకున్న సంకెళ్ళనుండి ఎవరు విడిపించగలరు? ఏ హృదయం నిన్ను కదల్చగలదు? ఏ చెయ్యి నిను తాకగలదు? ఒకోసారి గర్వంగా, మరోసారి బేలగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పాతరోజులు గుర్తొస్తుంటాయి అప్పుడు…
-
నిలకడ లేమి … జెఫ్రీ ఛాసర్, ఇంగ్లీషు కవి
(ఈ కవిత 600 సంవత్సరాలక్రిందటిది అంటే నమ్మడం కష్టం. ఇదేదో నిన్ననో మొన్ననో రాసినట్టుంది. మనుషుల స్వభావంలో అప్పటినుండీ ఇప్పటివరకూ ఏమీ మార్పు లేదన్నమాట.) ఒకప్పుడు ప్రపంచం ఎంత నిలకడగా, కలిసికట్టుగా ఉండేదంటే మనిషి మాట ఇచ్చేడంటే, అది తన ధర్మంగా ఆచరించేవాడు. ఇప్పుడంతా అబద్ధమూ, మాటతప్పడమూను. ఇచ్చిన మాటా, చేసిన చేతా చివరకి వచ్చేసరికి తల్లక్రిందులై, ఒకదానికొకటి పొంతనలేకుండా ఉంటాయి. ప్రపంచం అంతా ఇంతేనా, కేవలం స్వార్థం, లాభాపేక్షేనా నిలకడలేమితో అంతా సర్వనాశనం కావలసిందేనా? మనుషులు ఈ…
-
ఆత్మహత్య… హార్హి లూయిస్ బోర్హెస్, అర్జెంటీనా కవి
రాత్రి ఇక ఒక్క నక్షత్రమూ మిగలదు. ఆమాటకొస్తే, అసలు రాత్రే మిగలదు నేను మరణిస్తాను, నాతో పాటే దుర్భరమైన ఈ సమస్త విశ్వమూను. నేను పిరమిడ్లని తుడిచిపెట్టెస్తాను. ధనాన్నీ, ఖండాలనీ, అక్కడి అన్నిరకాల ముఖాలనీ, పోగుపడ్డ గతాన్నీ నేను చెరిపెస్తాను. చరిత్రనీ, పాటు, మట్టినీ మట్టిలో కలిపెస్తాను. నేనిపుడు కడపటి సూర్యాస్తమయాన్ని చూస్తున్నాను. చిట్టచివరి పక్షి పాట వింటున్నాను. నే నెవరికీ ఏదీ వారసత్వంగా మిగల్చను. . హార్హి లూయిస్ బోర్హెస్ 24 August 1899 – 14 June…
-
అనంతం… రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి
ఓ వయసా! కాలమా! శలవు! చూడండి, నేను నిష్క్రమిస్తున్నాను. నేను వెళ్ళబోయేచోట మాత్రం శాశ్వతంగా ఉంటానని తెలుసు. నా ఈ నేత్రాలు త్రి కాలాలూ ఎలా ఈ సువిశాల అనంతత్వంలో కొట్టుకుపోయాయో చూడగల్గుతాయి. అక్కడ చంద్రబింబం నక్షత్రాల్ని శాసించదు; బదులు, రాత్రితో పాటే, ఆమెకూడా అంతులేని వెలుగులో మునకలేస్తుంది. . రాబర్ట్ హెర్రిక్ 24 August 1591 – 15 October 1674 ఇంగ్లీషు కవి . . Eternitie . O Yeares!…
-
వసంతాగమనం… థామస్ కారీ, ఇంగ్లీషు కవి
శీతకాలం గడిచిందేమో, ధరిత్రి తన హిమస్వచ్ఛమైన శుక్లాంబరాల్ని విడిచింది. ఇక గడ్డిపరకలమీద మంచు పీచుమిఠాయిలా , స్వచ్ఛంగా పారే సెలయేటి తరగలమీదా నిర్మలమైన సరస్సుమీదా మీగడతరకలా … పేరుకోదు గోర్వెచ్చని ఎండ కొయ్యబారిన నేలని కరిగించి మెత్తబరుస్తుంది; మరణించిన పిచ్చుక పునరుజ్జీవిస్తుంది. చెట్టుతొర్రలో మత్తుగా పడుక్కున్న కోకిలనీ, గండుతుమ్మెదల్నీ తట్టిలేపుతుంది. కువకువలాడుతూ గాయకగణం స్వరరచనచేస్తూ దర్పంగా వసంతుణ్ణి ప్రకృతిలోకి ఆదరిస్తాయి. లోయలూ, కొండలూ, వనాలూ, సరికొత్త శోభతో కళ్ళు కాయలుగాచేలా ఎదురుచూస్తున్న చైత్రాన్ని స్వాగతిస్తాయి. . థామస్…
-
స్మృతి గీతిక… రాబర్ట్ వైల్డ్ , ఇంగ్లీషు కవి
ఇక్కడ క్రీస్తులో కొంత భాగం పరుంది;నేలపాలైన ఒక తారక; బంగారు తునక; భగవంతుడు స్వర్గంలో సద్వర్తనులకు విందు చేస్తే, అక్కడ ఉండవలసిన హేమ పాత్రిక. . రాబర్ట్ వైల్డ్ 1615–1679 ఇంగ్లీషు కవి . Epitaph : “Here lies a piece of Christ” . Here lies a piece of Christ; a star in dust; A vein og gold; a china dish that must Be used…