వర్గం: అనువాదాలు
-
క్రమశిక్షణ లేమి… కింగ్ క్రిమ్సన్, బ్రిటిష్ రాక్ బాండ్
నాకు మాత్రం ఇది గుర్తుంది. దానితో గంటలు గంటలు దొర్లిపోయేవి దానిమీద వ్యామోహం తగ్గే వేళకి, నేను ఎంతగా అందులో లీనమయ్యేనంటే మరొకటి చెయ్యడానికి పాలుపోలేదు. కొన్ని రోజులపాటు అలాగే కొనసాగేను దానితో దాగుడుమూతలాడుతూ… అంటే, రోజల్లా అటుచూడడం మానేసి తర్వాత అటుచూడడం అన్నమాట దానిమీద ఇంకా ఇష్టం మిగిలుందో లేదో చూడ్డానికి. చిత్రం! నాకు ఇంకా ఇష్టం మిగిలే ఉంది. . కింగ్ క్రిమ్సన్ రాక్ బాండ్ ఇంగ్లండు King Crimson, 2003, L–R…
-
నేను పవనాన్ని… జో ఏకిన్స్, అమెరికను కవయిత్రి
నేను నిలకడలేని పవనాన్ని నువ్వు నిశ్చలమైన నేలవి; నేను ఇసుకతిన్నెలమీద క్షణికమై నిలిచే పదముద్రని. నేను ఇట్టే కంపించే తలిరాకుని నువ్వు మొక్కవోని మహా వృక్షానివి; నువ్వు స్థిరమైన తారానివహానివి నేను చంచలమైన నీటిపుట్టని. నువ్వు నశ్వరమైన కాంతిపుంజానివి— నేనొక దివిటీలా సమసిపోతాను; ఉప్పొంగిన సంగీత కెరటానివి నువ్వు, నే నేవో పిచ్చికూతలు కూస్తుంటాను. . జో ఏకిన్స్ October 30, 1886 – October 29, 1958 అమెరికను కవయిత్రి . Zoe Akins . I…
-
సౌందర్య పిపాసి కీట్స్ కి… కౌంటీ కలెన్, అమెరికను కవి
Epitaph on Keats Tombstone reads: THIS GRAVE CONTAINS ALL THAT WAS MORTAL OF A YOUNG ENGLISH POET WHO ON HIS DEATH BED IN THE BITTERNESS OF HIS HEART AT THE MALICIOUS POWER OF HIS ENEMIES DESIRED THESE WORDS TO BE ENGRAVEN ON HIS TOMB STONE “Here lies One Whose Name was writ in Water” .…
-
XXVI … ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
ఇల్లు పూర్తయేదాకా దాని ప్రాపులు అండగా ఉంటాయి, తర్వాత వాటిని తొలగిస్తారు… నిటారుగా, సమర్థవంతమై ఇల్లు పునాదులపై తనంతతాను నిలబడుతుంది; బరమానీ, వండ్రంగినీ గుర్తుచేసుకోవడం మరచి. సంపూర్ణమైన జీవితానికి అటువంటి సింహావలోకనం అవసరం. బల్లచెక్కా, మేకుల గతం తాపీగా తయారవడం, ఆధారాలు కూలిపోవడం… అవి ఆత్మగా స్థిరపరుస్తాయి. . ఎమిలీ డికిన్సన్ December 10, 1830 – May 15, 1886 అమెరికను కవయిత్రి Emily Dickinson . XXVI . The props assist…
-
చాప్మన్ కళ్ళతో హోమరును చూసినపుడు … కీట్స్, ఇంగ్లీషు కవి
(కీట్స్ 220 వ జయంతి సందర్భంగా నివాళి) . ఎంతోమంది కనకమణిమయములైన దేశాలు తిరిగి, గొప్ప సామ్రాజ్యాలనీ, మహానగరాలనీ చూసి ఉండొచ్చు; నేనుకూడా కవులు సూర్యుడికి సవినయంగా మొక్కులు చెల్లించే దాపటి ద్వీపాలనెన్నో దర్శించాను. వాటిలో ఒక సువిశాలమైన ద్వీపాన్ని గభీరమైన నుదురుగల హోమరు స్వంతం చేసుకున్నాడు; కానీ, చాప్మన్ స్పష్టంగా, విశదంగా చెప్పేదాకా అందులోని స్వారస్యాన్ని ఆస్వాదించలేకపోయాను. మొదటిసారి తన వీక్షణాపరిథిలోకి ఒక కొత్తగ్రహం వచ్చినపుడు రోదసివీక్షకుడుపొందే అనుభూతి చెందాను. డేరియన్ శిఖరాగ్రం నుండి డేగకన్నులతో…
-
మృదుల కంఠస్వరాలు మరుగైనపుడు… షెల్లీ, ఇంగ్లీషు కవి
మృదుల కంఠస్వరాలు మరుగైనపుడు సంగీతం, జ్ఞాపకాలలో నినదిస్తుంది. కమ్మని పూవులు వాడిపోయినా, వాటి నెత్తావి, మేల్కొలిపిన ఇంద్రియంలో పదిలం. గులాబి రేకులు, గులాబి రాలిపోయినా, ప్రియుల సమాధులపై పోగుబడతాయి. అలాగే నువ్వు లేకున్నా, నీ గూర్చిన ఆలోచనలూను; ప్రేమ ఎప్పుడూ నివురుగప్పి ఉంటుంది. . షెల్లీ 4 August 1792 – 8 July 1822 ఇంగ్లీషు కవి. . . Music, when Soft Voices die . Music, when soft voices die,…
-
పాపం! క్లియోపాత్రా!… కాన్రాడ్ ఐకెన్, అమెరికను కవి
అతి నేర్పుగల చేతులు పూతపూసి పదిలపరచగా పాపం! జడమైన క్లియోపాత్రా గాజు గాజు పెట్టెలో నిద్రిస్తోంది. ఆమె మెడకి వాళ్ళొక మేలిమి కంఠహారం తగిలించేరు ఆమె పాద రక్షలు, ఎడారిలో అరిగిపోయాయని ప్రతీతి. వాడి చూపులుగల ఈ దక్షిణాది యువరాణి క్లియోపాత్రా ఒకప్పుడు ఈజిప్టులో గొప్ప మన్ననలందుకుంది ఇప్పుడు ఆమె బాగా ముసలిదై, శుష్కించి, కళతప్పింది, ఆమె నోరు ఇప్పుడు నల్లని తారుతో మూసీసేరు. సమాధుల దొంగలు ఆమె చేతులనుండి బంగారు ఉంగరాలు లాగేసేరు. ఆమె గుండెపై…
-
మేఘాలూ- కెరటాలూ…. రబీంద్రనాథ్ టాగోర్, భారతీయ కవి
అమ్మా, అమ్మా! మేఘాల్లో ఉండేవాళ్ళు నన్ను పిలుస్తారే “మనం లేచిందగ్గరనుండి రోజు అంతమయ్యేదాకా ఆడుకుందాం బంగారు ప్రభాతంతో ఆడుకుందాం, వెన్నెలబిళ్ళ చంద్రుడితోనూ ఆడుకుందాం,”అని “మరి నేను అక్కడికి చేరేదెలా?” అని అడుగుతానే. వాళ్ళు, “భూమి అంచుదాకా రా, ఆకాశానికి చేతులు చాచు, నువ్వు వెంటనే మేఘాల్లోకి తీసుకుపోబడతావు,” అన్నారే. “అమ్మో! మా అమ్మ నాకోసం ఇంటిదగ్గర ఎదురు చూస్తుంటుంది. ఆమెను వదలి ఎలా రాను?” అని నే నన్నానే. అప్పుడు వాళ్ళు నవ్వుకుంటూ తేలి పోయారే. అమ్మా,…
-
తన మృతిపై … వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి
మృత్యువు నామీద నిలబడింది, వంగి, తలవాల్చి నా చెవిలో ఏదో గుసగుసలాడుతోంది; ఆ వింతభాష నాకు అర్థం కాలేదు గాని, తెలిసిందల్లా, ఇకపై భయపడనవసరం లేదని. . వాల్టర్ సావేజ్ లాండర్ 30 జనవరి- 1775 – 17 సెప్టెంబరు 1864 ఇంగ్లీషు కవి On His Own Death . Death stands above me, whispering low I know not what into my ear: Of his strange language all…
-
బాంబు వ్యాసం … యెహుదా అమిఖాయ్, ఇజ్రేలీ కవి
ఆ బాంబు వ్యాసం ముఫై సెంటిమీటర్లు, నలుగురు చనిపోయి, పదకొండుగురు గాయపడేలా దాని ప్రభావం కనిపించింది 7 మీటర్ల వ్యాసంలో. వాళ్ళ చుట్టూ … ఇంకా పెద్ద కాల వృత్తంలో బాధావృతమై రెండు ఆసుపత్రులు చెల్లాచెదరైపోయాయి ఒక శ్మశానం కూడా. కాని పాపం నగరంలో ఖననం చెయ్యబడ్డ యువతి వచ్చిన వందకిలోమీటర్లు పైబడిన దూరమూ కలుపుకుంటే ఆ వృత్తం ఇంకా పెద్దదవుతుంది. సముద్రాల్ని దాటి ఎక్కడో దూర దేశపు తీరాల్లో ఆమెకోశం శోకిస్తున్న ఒంటరి మనిషి దుఃఖం…