వర్గం: అనువాదాలు
-
What if … Nishigandha, Telugu, Indian
Silly! These evenings are always like that… They gently walk through the open windows And over the frail fagged countenances. A dewy flower flutters, swings and drops Into the valley like a streak of light. And a long reticent journey begins… What if those nights hadn’t cared to visit Brushing aside the catch…
-
బాల-వధువు … ఊడ్గరూ నూనుక్కల్, ఆస్ట్రేలియను ఆదివాసీ కవయిత్రి
వాళ్ళు నన్నో ముసలాడికి ఇచ్చేరు. ఏ ఆనందమూ లేని పండు ముసలి. బ్రహ్మముడి నవ్వునుండి బొమముడిలోకి. అతని గుడిశలో నా బాల్యం సమాధి, కన్నీరు ఆగకుండా ప్రవహిస్తోంది నేను కోరుకున్నది ప్రేమ నా ఈడువాడే జోడు కావాలని. చామనచాయతో నవ్వుతూ తుళ్ళే దున్వా నన్ను ఇష్టపడ్డాడు. ఓహ్! నన్ను గుంజకి కట్టిపడేస్తున్న పాత ఆచారాలు. అయ్యో! నాకోసం ఎదురుచూస్తున్న భవిష్యత్తు! దుఃఖం నన్ను చుట్టుముడుతోంది. కన్నీళ్ళు జలజలా రాలుతున్నాయి. ఆ బుల్లి పిట్టలు ఎంతహాయిగా ఉన్నాయో గూడుకట్టుకుని…
-
నేనొక గులాబి రెమ్మని వంచేను… థామస్ బ్రౌన్, ఇంగ్లీషు కవి
వాసనచూద్దామని, నా వైపుకి ఒక లేత గులాబి రెమ్మని వంచేను. నేను అంతగా వంచినా, బాగానే, విరిగిపోకుండా నిలదొక్కుకుంది. కానీ, దాన్ని వెనక్కి వదిలెయ్యగానే ఆ నాజూకు కొమ్మ ఎంత హేలగా, ఎంత తూగుతో యథాస్థితికి వచ్చిందంటే… చెప్పడం కష్టం. నాకు అనిర్వచనీయ ఆనందాన్నిచ్చింది. నాకు తెలుసు… మీకేమైనా సందేహమా? వెనుతిరిగి చూస్తే…దానిగురించే గుసగుసలుపోడం విన్నాను. . థామస్ ఎడ్వర్డ్ బ్రౌన్ మే 5, 1830- 29 అక్టోబరు 1897 ఇంగ్లీషు కవి . . I…
-
విశ్వంలో ఒక పరమాణువు … రిఛర్డ్ ఫీన్మన్, అమెరికను భౌతిక శాస్త్రవేత్త
… నేను ఒంటరిగా సముద్రపొడ్డున నిలబడి ఆలోచిస్తున్నాను దూసుకువస్తున్న కెరటాలు, అసంఖ్యాకమైన అణువులు దేనిమట్టుకు అదే పిచ్చిపట్టినట్లు దానిపని అది చేసుకుంటూ అంత వైరుధ్యంలోనూ కలిసి తెల్లని నురుగు సృష్టిస్తూ… యుగాలు జగాలకి ముందు, ఏ కన్నూ దానిపై పడకమునుపు ఇప్పటిలాగే, ఏళ్లతరబడి అలా ఒడ్డును బాదుతూనే ఉన్నాయి. ఎందుకు? ఎవరికోసం? ప్రాణమన్న ఊసులేని ఈ మృత గోళం మీద ఎవర్ని రంజింపడానికని? పోనీ ప్రశాంతంగా ఉందా? అదీ లేదు. రోదసిలోకి సూర్యుడు…
-
పగవాడు కలగంటున్నాడు… నార్మన్ హెచ్ రసెల్, అమెరికను కవి
ఎప్పుడైతే నా పగవాడు నిద్రపోతున్నాడని చూశానో వాడికి ఎదురుగా నిశ్చలంగా నిలబడ్డాను రాత్రిపూట గుడ్లగూబలా చేపకోసం ఎదురుచూస్తున్న కొంగలా. ఒక్క వేటు వెయ్యడానికి కత్తి ఎత్తేను. అప్పుడు గమనించాను శత్రువు కలగనడం అతని పెదాలమీద చిన్న దరహాసం మెరిసింది అతని కాళ్లు వణికేయి అతను నిద్రలో ఏవో చప్పుళ్ళు చేసేడు అతని మనసులో ఆనందకరమైన కలే మెదిలుంటుంది. నాకు ఒక్కడికే ఇది గుర్తుంటుంది. మిగతావాళ్ళకి అందరికీ నా శత్రువు గుర్రాన్ని చూపిస్తాను ఎవరికీ ఈ విషయం చెప్పను…
-
A Funny Call!… Palaparthy Indrani, Telugu, Indian
My daughter got a new pal yesterday: It’s our new neighbour’s kid. My daughter started playing with her happily displaying all her toys. That kid was just picking up how to speak. After a while they both came to me in the kitchen. “Mommy! I want water,“ asked my daughter. Immediately, her friend repeated, “Mommy!…
-
మృగతృష్ణ… ఎలా వీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి
మార్గమధ్యంలో దప్పికతో అతను ఆగేడు కనుచూపుమేర ఆవరించిన వేడి బంజరులమీంచి అకస్మాత్తుగా, చల్లని తళతళ మెరుస్తున్న నీటితో దూరాన అందంగా ఒక పచ్చని బీడు కనిపించింది. ఎన్నాళ్ళనుండో మనసులో పదిలపరచుకున్న కోరిక పాదాలక్రింద ప్రేమపూర్వకంగా పచ్చని తివాచీ పరిచింది; ఊసరక్షేత్రాలు ఒక్కసారిగా రాజనాల చేలుగా మారిపోయేయి. ఆలస్యమైనవాళ్ళదే నష్టం అన్నట్టు త్రోవ ఎంతో హాయిగా ఉంది. అతని మనసులో ఆ అపురూపమైన స్త్రీ ఒకసారి మెరిసింది; మగాళ్ళందరూ కష్టించి ఎదురుచూసే… ఉద్యానం ప్రతి హృదయమూ కోరుకునే ప్రశాంత…
-
ఇమడలేనితనం… చెస్లా మీవోష్, పోలిష్ కవి
. నేను స్వర్గంలో తప్ప ఇంకెక్కడా బ్రతకలేను. అది కేవలం నా జన్యువుల్లో ఉన్న బలహీనత. అంతే! ఈ భూమ్మీద గులాబిముల్లు గుచ్చుకున్న ప్రతిసారీ పుండయింది. సూర్యుడిని మేఘాలుకమ్ముకున్నప్పుడల్లా, నేను బాధపడ్డాను. ఉదయంనుండి సాయంత్రం దాకా మిగతావాళ్ళలా పనిచేస్తున్నట్టు నటిస్తాను కాని అగోచరమైన దేశాలకి అంకితమై, నా మనసు ఇక్కడ ఉండదు. మనః శాంతికి ఊర్లోని ఉద్యానాలకి పోతాను అక్కడున్న చెట్లూ పూలూ ఉన్నవి ఉన్నట్టు పరిశీలిద్దామని, కానీ, అవి నా చెయ్యి తగలగానే, నందనోద్యానాలైపోతాయి. నా…
-
57 వ కవిత, తావొ తే చింగ్ నుండి… చీనీ కవిత
నువ్వు గొప్ప నాయకుడివి కాదలచుకుంటే, తావోని చదివి అనుసరించక తప్పదు. నియంత్రించడానికిచేసే ప్రయత్నాలన్ని ఆపు. స్థిరపడిపోయిన ప్రణాళికలూ, ఆలోచనలూ వదిలెయ్ ప్రపంచం దాన్ని అదే నడిపించుకుంటుంది. నువ్వు నిషేధాలు పెంచుతున్న కొద్దీ ప్రజల నైతికతకూడా తగ్గుతుంది. నీకు ఆయుధాలు ఎక్కువయినకొద్దీ నీ ప్రజలకు అంత తక్కువ భద్రత ఉంటుంది. నువ్వు రాయితీలు ఇస్తున్నకొద్దీ ప్రజలు అంత స్వయం సమృద్ధిలేనివాళ్ళవుతారు. అందుకనే గురువు ఇలా సెలవిస్తున్నాడు: చట్టాన్ని పక్కకి తప్పించాను, ప్రజలు నిజాయితీపరులయ్యారు. ఆర్థిక సూత్రాల్ని పక్కనబెట్టాను, ప్రజలు…
-
గుడ్ నైట్, గుడ్ నైట్… జొవానా బెయిలీ, స్కాటిష్ కవయిత్రి
సూర్యుడస్తమించాడు, చీకటిపడింది, ఆకాశంలో చుక్కలు మిణుకుమంటున్నాయి దీపమైనా, దివిటీ అయినా ఎక్కువసేపు ఉల్లాసమైన రోజుని ఇక పొడిగించలేవు; ఝాములు దొంగలా తెలీకుండా జారుకున్నాయి మనం సెలవుపుచ్చుకోక తప్పదు, గుడ్ నైట్, గుడ్ నైట్ పెళ్ళికూతురు పొదరింటిలోకి పంపబడింది, ఆటలూ, ఆకతాయిపాటలూ ముగిసిపోయాయి; ప్రేమికుల మాటలు పలచనై, కొందరు అయిష్టంగా ప్రేయసికి వీడ్కోలు చెబుతున్నారు. నాట్య రంగం ఇప్పుడు మూగబోయింది, అక్కడ ఏ పాదమూ నర్తించడం లేదు, గుడ్ నైట్, గుడ్ నైట్! అలరుబోడి తన ఆచ్ఛాదిత శయ్య…