వర్గం: అనువాదాలు
-
నిశీధి… జేమ్స్ బీటీ, స్కాటిష్ కవి
చీకటి పడింది, ఇపుడు ప్రకృతిదృశ్యం రమణీయంగా లేదు; నేను విచారిస్తున్నాను, కానీ, ఓ వనసీమలారా మీకోసం కాదు; ఎందుకంటే పొద్దు పొడుస్తూనే మీ అందాలు మీకు తిరిగి వస్తాయి, సరికొత్త సువాసనలు అద్దుకుంటూ, మంచుతో మెరుస్తూ: నేను శీతకాలపు విధ్వంశానికీ వగవను; దయాళువైన ప్రకృతి కుసుమాంకురాల్ని పదిలపరుస్తుంది, చివికిపోతున్న ఈ అస్థికలశం మీద ఎప్పుడు వసంతం కరుణిస్తుంది! నిశీధిలో చిక్కుకున్న ఈ సమాధిపై పొద్దుపొడిచేదెపుడు? . జేమ్స్ బీటీ, (25 అక్టోబర్ 1735 – 18 ఆగష్టు…
-
శీతకాలపు స్వారీ… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
గుర్రపుస్వారీలో ఉన్న ఆనందాన్ని ఎవరు ప్రకటించగలరు? ఎగరడంలో ఉన్న ఆనందాన్ని ఎవరు విప్పి చెప్పగలరు? అకస్మాత్తుగా కనిపించిన అడవిపూల గుత్తుల్ని తప్పించుకుంటూ విశాలమైన రెక్కలతో, ఆకాశంలో ఎగురుతూ వెళుతుంటే… క్షణికమైన లోకంలో కొన్ని శాశ్వతమైన క్షణాలుంటాయి భగవద్దత్తమైనవి, లిప్తపాటైనా, చెప్పలేని ఆనందాన్నిస్తాయి సూర్యుడు హరివిల్లులు చిందించే తళతళల మంచుస్ఫటికాలతో నా ముందు పరుచుకున్న విశాలమైన తెల్లని త్రోవకూడా అలాంటిదే, నేనూ, నా బలశాలి గుర్రమూ దౌడు తీస్తుంటే తెల్లని ఈ పొలాలు, నల్లని పొడవాటి మా జాడలతో…
-
నిర్ణయం… రుడ్యార్డ్ కిప్లింగ్, ఇంగ్లీషు కవి
అమెరికను ఆత్మ పలుకుతోంది: సఫలతనందించేశక్తి ఎవని చేతిలో ఉందో తప్పొప్పులు నిర్ణయించే నిర్ణేత ఎవరో మా విశ్వాసమూ, బలిదానాలూ అతనికే మా గమ్యం, మా బలమూ అతని అనుగ్రహమే ఈ స్వేచ్చా ధరిత్రిమీద పండగ చేసుకొండి మా పూర్వపు సంకెలలు పూర్తిగా తెగిపోయాయి; మరొక్క సారి మాకు మంచికీ చెడుకీ మధ్య నిర్ణయించుకునే అపూర్వ అవకాశం దొరికింది. అయితే అది ప్రార్థనలూ, కన్నీళ్ళతో అంత చవుకగా ఏమీ దొరకలేదు, సందేహాలూ, రోగాలతో పోగొట్టుకున్న మార్గాన్ని మళ్ళీ తిరిగి సాధిస్తాం.…
-
శోకంలో… థామస్ హేస్టింగ్స్, అమెరికను సంగీతకారుడు
ఓ ప్రభూ, ఈ కన్నీటి కనుమలలో బాటసారులము,దయతో మార్గాన్ని చూపించు, నీ తీర్పు వెలువడని మా ప్రయత్నాలలో మా చివరి శ్వాస ఉన్నంతవరకూ… ఆకర్షణల బాణాలు మమ్మల్ని బాధించినపుడు మేము తప్పుడుత్రోవలలోకి మరలినప్పుడు నీ అనురాగము మాకు కరువైపోకూడదు నీదైన సన్మార్గంలో మమ్మల్ని నడిపించు. బాధల, ఆవేదనల వేళల్లో మృత్యువు సమీపిస్తున్నప్పుడు మా మనసులు ఆందోళనచెందకుండా చూడు మా ఆత్మలు భయవిహ్వలం కానీయకు; ఈ మర్త్య జన్మ ముగిసినపుడు నీ అక్కున సేదదీరగా మమ్ము ఆహ్వానించు, దేవతల…
-
ఎండవేడిమికి ఇక భయపడనవసరం లేదు… షేక్స్పియర్
(ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం) ఎండ గురించి ఇక భయపడ పనిలేదు శీతకాలపు చలిగురించి కూడా; నువ్వు ఈ జీవితపు కర్తవ్యం నిర్వహించి ఇంటికి తిరిగిపోయావు, ప్రతిఫలం అందుకుని; అందగాళ్ళైనా, అందగత్తెలైనా చిమ్నీలు తుడిచే పిల్లల్లా మట్టిపాలు కావలసిందే. గొప్పవాళ్ళ ఆగ్రహానికి భయపడ పనిలేదు, నిరంకుశుల శిక్షల పరిథి దాటిపోయావు; ఇక తిండికీ బట్టకీ చింతించే పనిలేదు; గడ్డిపరకైనా, మహావృక్షమైనా నీకు ఒక్కటే; అందరూ చివరకి మట్టిలో కలవవలసిందే. మెరుపులకి భయపడే పని లేదు,…
-
నిర్లక్ష్యం… ఆస్కార్ ఫే ఏడమ్స్, అమెరికను కవి
నిర్లక్ష్యం అంటే ఏమిటని నన్నడుగుతున్నావా? సర్లే, ఆ మాటకి నాకు అర్థం తెలుసును. నిర్లక్ష్యం అంటే ఒకప్పుడు నువ్వు చలికాచుకున్న మంటను వదిలిపెట్టి బూడిద వెతుక్కోడం; దురదృష్టవశాత్తూ స్నేహానికి తలుపుతెరిచిన తాళాన్ని పోగొట్టుకోడం; ఒకప్పుడు నీకోసం మెరిసినకళ్ళు ఇప్పుడు నువ్వు చూసినా పట్టించుకోకపోవడం; ఒకనాడు ఉన్నది ఇకమీదట ఎన్నడూ ఉండదన్న సత్యం గ్రహించడం ఇప్పుడు నువ్వు దేన్నీ నమ్మవని తెలుసుకోవడం, వయసు ఎప్పుడో తెలియకుండా జారిపోయిందని గ్రహించడం, ఆశ తిరిగి చిగురించదని అర్థం చేసుకోవడం. చివరకి ప్రేమంటే…
-
ఇచ్ఛ, శక్తి, కర్తవ్యమూ… లె నార్దో దవించి, ఇటాలియను చిత్రకారుడు
చెయ్యాలనుకుని, చెయ్యలేని వారు – చెయ్యగలిగినవి చేద్దామనుకోవాలి! మనం చెయ్యలేనివి చేద్దామనుకోవడం వృధా; అందుకనే, ఎవడైతే గురిలేకుండా ఎదో ఒకటి చేద్దామనుకోడో అలాంటి వ్యక్తిని మనం విజ్ఞుడు అని అంటాము. మన బాధల్లాగే, మన సుఖాలు కూడా ఎప్పటికీ ఇచ్చాశక్తిగూర్చిన అవగాహనమీద ఆధారపడి ఉంటాయి. అది మనకి తర్కం తన ఆధిక్యతని ప్రకటించుకున్నా, కర్తవ్యానికి తగ్గట్టు సయిష్టంగా తల ఒగ్గడం నేర్పుతుంది అయినప్పటికీ, చాలా సార్లు నువ్వు చెయ్యలేనివి చెయ్యాలనుకోవాలి, మనకోరిక కన్నీరు తెప్పించినా సంతృప్తిగా స్వీకరించాలి…
-
ప్రేమ మహా దారుణమైనది! … గ్రేస్ ఫాలో నార్టన్, అమెరికను కవయిత్రి
దిగంతాలనున్న హరిత మైదానాన్ని దర్శించేను లోతెరుగని నీడలో పరున్నాను భూదేవిని అడిగేను, “నన్ను పొదువుకో” అని రాత్రిని ప్రార్థించేను, “నన్ను ఆవరించ”మని గాలిమీద చికాకుగా అరిచేను, “నీకేం తెలీదు ఫో, నీకు ఎదురులేని స్వేచ్ఛ ఉంది,” అని. చిగురాకులనన్నిటినీ వంగి దగ్గరగా గుమిగూడి నాకొక తెరగా నిలబడమని బ్రతిమాలుకున్నాను; తర్వాత చుక్కలతో నా కథ చెప్పుకున్నాను: “అదిగో ఆ లోయలో, అదే మా ఇంటి దీపం. నేను తిరిగి వెళ్ళిపోతానని తెలుసు గాని, ముందు, ఈ కనికరంలేని అడవిలో…
-
తల్లిలేని పిల్లడు… విలియం థాం, స్కాటిష్ కవి
ఏ మేనత్తలో, తోబుటువులో, అమ్మమ్మలో నాయనమ్మలో మిగతా పిల్లలందర్నీ తమ ఇళ్ళల్లో హాయిగా నిద్రపుచ్చుతుంటే ఎవరూ పట్టించుకోకుండా ఒంటరిగా అన్నీ కోల్పోయినట్టుండే దెవరు? పాపం,చిన్నతనం ఇంకా వదలని వెర్రిబాగులాడు… తల్లిలేని పిల్లాడే. ఆ తల్లి లేని పిల్లవాడు తన పక్కమీదకి నడుచుకు పోతాడు వెచ్చగా వీపు కప్పేవారూ మెత్తని దిండుమీద తల ఉంచేవారూ లేరు; అతని లేత అరి పాదాలు పగిలి బీటలు బారి ఇనపముక్కల్లా ఉన్నాయి పాపం ఆ తల్లిలేని పిల్లాడు పడుకునే పక్కే చాలా…
-
నా భర్తకి… అజ్ఞాత కవయిత్రి
తప్పించుకోలేని ఈ ఐహిక బాధలనుండీ ఈ జీవితం నుండీ నేను నిష్క్రమించినపుడు నా కోసం నల్లని దుస్తులు ధరించవద్దు ప్రియతమా! నువ్వు ఉంగరాన్ని మాత్రం తియ్యకు. దయచేసి ఆ తళతళల వజ్రాన్ని నా గుర్తుగా చేతికి ఉంచుకో అది నీ కళ్ళలో మెరిసినప్పుడు అది పక్కనుండి నడుస్తున్న నా నీడగా భావించు. ఎందుకంటే, ఆ వజ్రం కన్నా, ఆ మాటకొస్తే ఏ రత్నం కన్నాకూడా ప్రకాశవంతంగా నీకు కనిపిస్తాను. అక్కడ ఏదో జరగకూడనిది జరిగినట్టు ఇంటిని నల్లని…