వర్గం: అనువాదాలు
-
The Silent Horizon… Ravi Verelly, Telugu, Indian
Even the tree that blossoms wild and loquacious Turns taciturn sometimes. Dabbing leaves with the hues of heart It drops them as epistles to the earth. Even that clamorous and eloquent chatterer with directions… The sky… suffers silently within. The few words that shuttle in the gullet, Like thunder and lighting, It writes with the…
-
Ruba… KN Malleswari, Telugu, Indian
While coming home from office I stopped at the turn of the street and looked apprehensively at the sky as a swarm of menacing black clouds from north-east started sieging it… Damn the rain! It won’t just pour down for some time and clear. It would settle into a mizzle. Nobody knows how long would…
-
జన్మ హక్కు… జేనెట్ లూయీ, వెల్ష్ కవయిత్రి
నగరాలకి దూరంగా మారే మనుషులకి దూరంగా పల్లెల్లో పుట్టిన మనలో కొందరికి ఒక జన్మ హక్కు ఉంది అదెవ్వరూ అమ్మగలిగేది కాదు అదొక రహస్య ఆనందం, అది ఎవరూ మాటల్లో చెప్పగలిగేదీ కాదు. ఎందుకంటే మనమందరం మహోన్నతమైన విషయాలకి బంధువులం: అడవి బాతుల విహారాలకీ తెల్లని గుడ్లగూబల రెక్కలకీ ; గండుమీనులకీ, సాలమన్ లకీ గిత్తలకీ, గుర్రాలకీ క్రౌంచపక్షుల అరుపులకీ సువాసనలు వెదజల్లే మూలికలకీ. చెట్ల ఔన్నత్యమూ సెలయేళ్ళ త్వరితగతీ మంచు చేసే ఇంద్రజాలం మన కలల్ని…
-
అడవిలో కాలిబాట…. రుడ్యార్డ్ కిప్లింగ్, ఇంగ్లీషు కవి
డెబ్భయి ఏళ్ళయి ఉంటుంది వానా, వాతావరణమూ మరొకసారి జతగలిసి అడవిలోని ఆ కాలిబాటని కనపడకుండా చేశాయి. వాళ్ళు చెట్లు నాటకముందు… ఒకప్పుడు అడవిలో ఆ త్రోవ ఉండేదని ఇప్పుడు ఎవరూ ఊహించలేరు. అదిగో ఆ ఆరుబయట బంజరులో పొదల క్రింద ఉమ్మెత్త చెట్లు బలిసినచోట ఆ త్రోవ ఉండేది. జాగ్రత్తగా గమనించే వాళ్ళకే కనిపిస్తుందది. పావురం ఎక్కడ పొదుగుతుందో నీటికుక్క ఎక్కడ పొర్లుతుందో అక్కడ అడవిలో ఒక కాలిబాట ఉండేదని. అయినప్పటికీ, ఒక వేసవి సాయంత్రం…
-
ఇదీ స్త్రీ ప్రపంచం… ఈవన్ బోలండ్, ఐరిష్ కవయిత్రి
మన జీవన విధానం ఏమీ మారలేదు మొదటి సారి చక్రం కత్తికి పదునుపెట్టిననాటినుండి బహుశా దీపం వత్తి ఎక్కువ ప్రజ్వలిస్తుందేమో చక్రాలు నిలకడగా ఉంటాయేమో మనం మాత్రం అలాగే ఉన్నాము. మన జీవితాలని కొలుచుకుంటాం సంఘటనల కొండగుర్తులద్వారా మరిచిపోయినవీ కళ్ళెదుట కనిపించేవీ మిగిలిపోయిన రొట్టెముక్కా, జమాఖర్చుల పద్దులూ, వాషింగ్ పౌడరికి ఎంత ఇచ్చేము వాడు ఎంత కట్టేదూ ఇంకా ఆరెయ్యాల్సిన తడిగుడ్డలెన్ని… చారిత్రక వ్యక్తుల్లా మన అసంపూర్ణ కార్యాలనుబట్టి మనల్ని అంచనా వేస్తుంటారు మనం ఎన్నడూ కాలేము:…
-
పరంపర… మార్గరెట్ వాకర్, అమెరికను కవయిత్రి
మా అవ్వలూ అమ్మమ్మలూ బలమైనవాళ్ళు వాళ్లు నాగలివెంట నడిచి, ఒళ్ళు వంచిపనిచేసేవారు వాళ్లు విత్తనాలు నాటుతూ పొలమంతా తిరిగే వాళ్ళు వాళ్ళు నేలపని చేసి, పంటపండించేవారు. వాళ్ళు దృఢంగా,ఎప్పుడూ ఏవో పాటలు పాడుకుంటూఉండేవారు మా అవ్వలూ అమ్మమ్మలూ బలమైన వాళ్ళు మా అవ్వలకీ మామ్మలకీ ఎన్నో జ్ఞాపకం ఉండేవి కుంకుడుకాయ, ఉల్లిపాయ, తడిమట్టి వాసన వేసేవాళ్ళు వాళ్ళ చురుకైన చేతులమీద నరాలు ఉబ్బి వంపులుతిరిగేవి వాళ్లు ఎప్పుడూ ఏదో మంచిమాట చెబుతూనే ఉండేవారు మా అవ్వలూ అమ్మమ్మలూ…
-
యువతికి ఒక సలహా … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
కోపంలో ఉన్న ఓ చిన్నదానా ఇది మనసులో పెట్టుకో: పొంద యోగ్యుడైనవాడిని నువ్వెన్నడూ పొందలేవు! ఈ విలువైన కఠోర సత్యాన్ని, చురుకుతున్న నీ బుగ్గన పెట్టుకో అది నీ కన్నీటిని దాచనీ. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని మంచులా ఘనీభవించిన మాయా స్ఫటికం లోలోతులకు చూడు చాలాసేపు దాన్ని పరీక్షించు, నీకు మనశ్శాంతి లభిస్తుంది. పొందడానికి యోగ్యుడైన వాడిని నువ్వెన్నడూ పొందలేవు. . సారా టీజ్డేల్ August 8, 1884 – January 29, 1933 అమెరికను…
-
ఏని షోర్ , జానీ డూన్… పాట్రిక్ ఓర్, అమెరికను కవి
(బహుశా ఇది ఒక యదార్థ సంఘటన ఆధారంగా వ్రాసిన కవిత అయి ఉండ వచ్చు. దురదృష్టవశాత్తూ నాకు ఈ కవి గురించిగాని, ఈ సంఘటనగురించిగాని సమాచారం దొరకలేదు. ఈ కవితలో నాకు కనిపించిన విషయం ఏమిటంటే, పెద్దపెద్ద నేరాలు చేసే వాళ్లు తప్పించుకుంటూ, అమాయకుల్ని బలిపశువులను చేస్తుంటారు. వాళ్లు అమాయకులచుట్టూ పన్నే ఉచ్చు ఎంత పకడ్బందీగా ఉంటుందంటే, న్యాయస్థానాలు (నిజమైన న్యాయస్థానాలు) కూడా ఎదురుగా ఉన్న ఋజువులను దాటి తీర్పు ఇవ్వలేవు. అమాయకంగా ఒక జీవితకాలం జైళ్ళలో…
-
శోక గీతి… రుత్ గత్రీ హార్డింగ్, అమెరికను కవయిత్రి
పచ్చిక బాగా మొలిచిన త్రోవ ఒకటి వాలుగా, వంపులు తిరుగుతూ లోయలోనుండి కొండ శిఖరానికి చేరుకుంటోంది అక్కడ నీ ప్రియతముడు నిద్రిస్తున్నాడు… కానీ నా వాడు, ఎక్కడున్నాడో దేముని కెరుక, వంద నిలువులలోతులో పడి ఉన్నాడు. ఒక సమాధి ఎలా ఉండాలో అలా … శోకసంద్రమైన కడలికి దూరంగా తారకల లే వెలుగులు కప్పిన సమాధి చెంత నువ్వు మోకరిల్లడం చూశాను! కానీ నా కలల్లోనూ, తారల వెలుగుల్లోనూ ఎగసిపడె కెరటాలు నన్ను పిలుస్తుంటాయి. పాపం! నీ మౌనశోకానికి…
-
మృత్యువుతో ధైర్యంగా… హెన్రీ కైలర్ బన్నర్, అమెరికను కవి
ఓ మృత్యువా, ఆమె ఇపుడున్న చీకటిలోంచి నువ్వు నా దగ్గరకి వచ్చేటపుడు నువ్వు సమాధి వాసన వేస్తూ రాకు తలపై వాడిన గులాబులు ధరించకు. ఓ మృత్యువా, శూన్య నిస్వనముతో రాకు అడుగులు సడిచేయకుండా, మురికిచేతులతో రాకు. చూడు! నీ నిర్మానుష్య, అగోచరమైన ఆవాసముకంటే ఇప్పుడు నేనేం తక్కువ ఒంటరితనం అనుభవించడం లేదు. కానీ, ఆమెని తాకిన ప్రతి వస్తువుకీ అంటుకునే సుగంధం లాంటి సుగంధం, పరీవ్యాప్తమైన ఆమె సహజ పరిమళంతో రా ఆమె మృదు,శీఘ్రతర కరస్పర్శ…