వర్గం: అనువాదాలు
-
ఆకాశంలో పరుగులాడి… జేమ్స్ ఓపెన్ హీం, అమెరికను కవి
నక్షత్రాల పయ్యెద రెపరెపలాడుతూ… సూర్యుడూ, భూమీ ఆమె హృదయ కుసుమం మీద భ్రమరాల్లా తారాడుతూ… గహన రోదసి కుహరాల్లో వీచే గాలులపై పాదాలు తేలియాడుతూ… ఎవ్వరామె అలా ఆకాశంలో పరుగిడుతున్నది? ఆమె కన్నులు నీహారికలవలె అస్పష్టముగా ఉన్నవి. చీకటిలో దూరాననున్న తన ప్రియునకై ఆత్రపడుతున్నది కాబోలు. . జేమ్స్ ఓపెన్ హీం 1882–1932 అమెరికను కవి Runner in the Skies . Who is the runner in the skies, With her blowing…
-
పునరుద్ధరణ… హొరేస్ హోలీ, అమెరికను కవి
మరొకసారి, సంతోషం నిండిన కవులనోటంట మాటలు పదునుగా వెలువడతాయి. నవయువప్రేమికుడిలా ఒక తెలియని శక్తి వాళ్ళని ఆవహించి, చిన్నాభిన్నం చేస్తుంది… దానితో వాళ్ళు భావగర్భితులౌతారు. వాళ్ళ మాటలు ఇప్పుడు తుఫాను హోరులా ఉంటాయి; వాటి భావాలు మనసులోకి సూటిగా దిగబడతాయి నర్తకి తన జుబ్బాలోంచి తీసి ఝళిపించిన చురకత్తిలా. మరొక సారి కరుకైన, భీకరమైన పదాలు అనంత నిశ్శబ్దపు లోతులలోంచి బయటకు వస్తాయి. వాళ్ళ వెనక నూత్న దైవాలూ, విజేతలైన జాతులూ ఆనందంగా వంతపాడుకుంటూ నడుస్తాయి. .…
-
ఇంకా నేర్చుకుంటున్నా… జూడిత్ వయొరిస్ట్ అమెరికను కవయిత్రి
నేను కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నేర్చుకుంటున్నా నేను ఎలా అభ్యర్థించాలో నేర్చుకుంటున్నా నాకుతుమ్మొచ్చినపుడు నా స్వెట్టరుకు బదులు క్లీనెక్స్ ఉపయోగించడం నేర్చుకుంటున్నా వస్తువులు క్రిందపడేకుండా ఉండడం నేర్చుకుంటున్నా తింటున్నా, తాగుతున్నా చప్పుడుచెయ్యకుండా ఉండడం నేర్చుకుంటున్నా దానివల్ల నాకు అప్పుడప్పుడు బాధకలిగినా త్రేణ్చకుండా ఉండడం నేర్చుకుంటున్నా నేను మెత్తగా నమలడం నేర్చుకుంటున్నా మొక్కజొన్నకండెమీద గింజలు తింటున్నప్పుడు. అన్నిటికన్నా బద్ధకస్తుడుగా ఉండడం చాలా సుళువని తెలుసుకుంటున్నా . . Learning I’m learning to say thank you. And…
-
కొరదా సూచనలు… ఎజ్రా పౌండ్, అమెరికను కవి
ఓ నా కవితలారా! రండి, మనిషి బలహీనతలు బయటపెడదాం భవిషత్తు గురించి చింతలేని, స్థిరమైన ఉద్యోగం ఉన్న మనిషంటే మనకున్న అసూయ వెళ్ళగక్కుదాం. నా కవితలారా! మీకు చాలా బద్ధకస్తులు. ఇలా అయితే మీ జీవితం దారుణంగా ముగుస్తుంది. మీరు రోడ్లంబట తిరుగుతారు, సందుమలుపుల్లోనూ, బస్సు స్టాపుల్లోనూ పచార్లు చేస్తారు, మీరు ఊరికే పనీపాటా లేకుండా ఉన్నారు. కనీసం మీరు మనిషి అంతరాంతరాలలోని ఉదాత్తతనైనా బయటపెట్టరు. మీకు చివరి రోజులు మరీ దుర్భరంగా గడవడం ఖాయం. నా…
-
కెసాండ్రా… ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్, అమెరికను కవి
ప్రాచీన గ్రీకు ఇతిహాసం ప్రకారం కెసాండ్రా(అలెగ్జాండ్రా) ప్రయం, హెకూబాల కుమార్తె పేరు. ఆమె భవిష్యత్తు ఎంత ఖచ్చితంగా చెప్పగలిగినా అవి ప్రజలు నమ్మకుండుదురుగాక అని అపోలో ఆమెను శపించాడని ప్రతీతి. ఇది చాలా గొప్ప కవిత. దేశభక్తి అంటే జెండాలు ఎగరెయ్యడం, నినాదాలివ్వడం ఒక్కటే కాదు. మనం చేస్తున్న తప్పులు గ్రహించి సరిదిద్దుకుని, జనబాహుళ్యానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ లాభించే పనులు చెయ్యాలి. మనబాగు కోసం పదిమందిని చంపుకుంటూ పోతుంటే, మనకి పాలించడానికి మిగిలేవి శ్మశానాలే అన్నసత్యం మరిచిపోకూడదు.…
-
Captive … Usha Rani, Telugu, Indian
In the relentless rain of moonlight The stars occasionally seem balls of hail … I run after falling meteors With the swiftness of childhood … I have already melted enough hails And cooled off comets and meteorites! A rainbow opens up on the sky, but Within, a firmament snuggles smugly Some more colourful dreams try…
-
మా కృతజ్ఞతలు … కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను కవి .
ప్రభూ! సాయంవేళ నదీతీరాన కలుపుమొక్కలమీదకూడా సూర్యుడు మెరుస్తూ కలిగిస్తున్న ఇక్కడి ఆహ్లాదానికి నీకు మా కృతజ్ఞతలు . ప్రభూ! వేసవిలో బోసికాళ్ళతో, బోసితలల్తో గడ్డిలోకి గుమికే పిల్లల కేరింతలకి కృతజ్ఞతలు. ప్రభూ, సూర్యాస్తమయానికీ, తారల వెలుగులకీ, మమ్మల్ని పొదువుకునే స్త్రీలకూ, వాళ్ళ తెల్లని చేతులకూ నీకు మా కృతజ్ఞతలు. ప్రభూ! నీకు చెముడూ, అంధత్వమూ వచ్చి మా కృతజ్ఞతలు నీకు అందకపోతే, ఊరి చివర శ్మశానాల్లో మృతులు తమ శవపేటికల్లోనూ, లేదా, యుద్ధంలో చనిపోయినవారు అజ్ఞాతంగా ఏ…
-
ప్రార్థన… క్లారా షెన్ ఫెల్ట్, అమెరికను కవయిత్రి
గాజువస్తువులు తయారు చేసే కాలమా! నీ కొలిమిలోని గాజుతో అన్ని ఆకారాలూ తయారు చేసేశావా? నీ దగ్గరం ఇంకా అందమైన గంట మరొకటి లేదా? ఇంకా స్పష్టమైన గాజు బుడగ లేదా ఆనందమంత నిష్కల్మషమైనది?… ఉంటే ఊది నన్ను తయారుచెయ్యి చుక్కలు వెలుగులు చిమ్మడం నేర్చిన నాటినుండీ చంద్రుడు వెన్నెలతో రేయిని మొదట బాధించిననాటినుండీ ఇప్పటి వరకూ ఏ ద్రాక్షతీగనుండీ రాని మధురమైన మదిరని నిక్షిప్తం చేయడానికి యోగ్యత ఉండేలా. . క్లారా షెన్ ఫెల్ట్ అమెరికను…
-
పూర్ణ జీవనం… కేథరీన్ డేవిస్ చాప్మన్ (టిల్మన్), అమెరికను కవయిత్రి
జీవితం పరిపూర్ణంగా జీవించడమంటే మానసికంగా ఎంతో బలం కలిగి ఉండి ఉదాత్తమైన విషయాలను గ్రహించగల నేర్పు కలిగి అందుకోవాలన్న ఆకాంక్ష, శ్రమ, కృషి, ప్రయత్నం చెయ్యడం. లౌల్యాలనుండి మచ్చలేకుండా బయటపడడం. భూనభోంతరాళంలో దైవం రచించిన మంచి గుర్తించి మన పాత్రని … ఎంతచిన్నదైనా … సవ్యంగా నిర్వర్తించి ఆ తర్వాత హాయిగా నిష్క్రమించడం. ఆ మరణం ఎలాంటిదంటే హేమంతపు చలికి, కురిసిన మంచుకి నిర్జీవంగా పడున్న భూమి అనంతామృతధారలు వర్షించే విధి వసంత సృజనకి మునపటికంటే అందంగా…
-
ఒక బిడ్డ వెతుకులాట… ఫ్రాన్సిస్ (వెల్స్) షా, అమెరికను కవయిత్రి
మా అమ్మ నాకు అప్పుడే మంచుతో తడిసిన గులాబులతో మాలకట్టేది చాలా సార్లు ఆ తోట ఎక్కెడ ఉందా ఎక్కడ ఉందా అని ఎంతో వెతికేను ఏ చెట్టుకి మా ఆమ్మ కోసిన ఆ పువ్వులు పూచేయో ఎంతప్రయత్నించినా కనుక్కోలేకపోయాను. ఓ పిల్లా! కనుక్కోవాలని ప్రయత్నించకు మీ అమ్మ పూలుకోసే పూలచెట్టు ఆచూకీ. మా అమ్మ నాకు ఎప్పుడు ఉదాత్తమైన కథలు చెప్పేది; ఎవరూ గమనించనపుడు ఆ పుస్తకం చూడాలనిపించేది; కానీ, ఏం లాభం ఏ పేజీనుండి…