వర్గం: అనువాదాలు
-
Tranquillity… Manasa Chamarti Telugu, Indian
O Vault of Heaven! When you sizzle all of a sudden with a streak of lightning or when I rattle feverishly to find expression to an idea What a turmoil it is! But once you melt into drops… And I flow into a poem… what a seize of tranquility! . Manasa Chamarti Telugu Poet .…
-
పురాతన చర్మపత్రం … ఆల్ఫ్రెడ్ క్రీం బోర్గ్, అమెరికను కవి
ఆకాశం ఒక అందమైన పురాతన చర్మపత్రం… దానిమీద సూర్యుడూ చంద్రుడూ ప్రతి రోజూ తమ దినచర్య నమోదుచేస్తుంటారు. దాన్ని అంతటినీ చదవాలంటే మహా జ్ఞాని కంటే కూడా ఎక్కువ భాషాపటిమ గలిగి ఉండాలి. ‘కలా’మతల్లి కంటే కూడా ఎక్కువ దివ్యదృష్టీ, భావుకతా కలిగి ఉండాలి. కానీ, దాన్ని అనుభూతి చెందడానికి మాత్రం మనిషి దానికి వినమ్రంగా అంతేవాసిత్వం నెరపాలి: ఎంత శ్రద్ధగా విడవకుండా శుశ్రూష చెయ్యాలంటే, ఒక సముద్రం లాగనో లేక, ఒక భూమిలాగనో… నిరంతరం, ఒకేఒక్క…
-
మరచిన జాతీయ చిహ్నం… వచేల్ లింజీ అమెరికను కవి
(జాన్ పి. ఆల్ట్ గెల్డ్ (30 డిశంబరు 1847- మార్చి 12 1902) స్మృతిలో) Read about John P Altgeld here మరుగుపడ్డ జాతి చిహ్నమా… ఆ రాతి క్రింద ప్రశాంతంగా నిద్రించు… కాలం ఇక తనపని చూసుకుంటుంది… మట్టి నీ సంగతి చూసుకునేట్టుగానే. “హమ్మయ్య, అతన్ని కప్పెట్టాం’ అనుకుంటున్నారు నీ శత్రువులు, లోన సంతసిస్తూనే వాళ్ళ విచాఆన్ని సమర్థవంతంగా నటించేరు, ద్వేషాన్ని ప్రకటించకుండా వాళ్ళు నీ మీద గుర్రు మన్నారు, దూషించేరు, తిట్టిదిగపోశారు…
-
కానుక… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
ప్రియతమా, చూడు! నన్ను నీకు సమర్పించుకుంటున్నాను నా మాటలు నీకు అందమైన అలంకరణ సామగ్రి వాటిని నువ్వు నీ అల్మారాలలో అందంగా అలంకరించుకుంటావు. వాటి ఆకారాలు చిత్రంగా, సమ్మోహనంగా ఉంటాయి అవి ఎన్నో వన్నెల్లో, ఎన్నో జిలుగుల్లో, ఆకర్షిస్తుంటాయి. అంతే కాదు, వాటినుండి వెలువడే సుగంధం గదిని అత్తరు, పన్నీటివాసనలతో నింపుతుంది. నేను చివరి మాట చెప్పేసరికి నువ్వు నా సర్వస్వాన్నీ పొంది ఉంటావు. కానీ, నేనే… జీవించి ఉండను. . ఏమీ లోవెల్ February 9,…
-
“అమూర్తులు”… స్యూమస్ ఓ సలివాన్, ఐరిష్ కవి
మేము మరుగుపడ్డ చోట్లనుండి ఒక రహస్యద్వారం గుండా ఇక్కడ పచ్చగా విరిసినవైపుకి వెన్నెల్లో బయటకి వస్తాము. అక్కడ రాత్రంతా మేము ఆటపాటల్లో మునిగిపోతాము ఎంతగా గంతులేస్తామంటే ఈ నేల ఎన్నడూ చూసి ఉండదు ఆడుతూ గెంతుతూ పదంలేని రాగాలు తీస్తుంటే ఆ రాగం ఎంత కమ్మగా ఉంటుందంటే పక్షులు కూడా చిన్నబోతాయి. అక్కడ ఎందరో కన్నియలుంటారు నశ్వరమైన శరీరం ధరించినవాళ్ళు తమ లేత కన్నులనిండా పుడమి గురించి ఆశలు నింపుకున్నవాళ్ళు ఈ అడవి సొగసుకి ఉబికిన సంగీతం…
-
జీవితమా! నే నేవర్ని?… జాన్ మేస్ ఫీల్డ్, ఇంగ్లీషు కవి
జీవితమా! నే నేవర్ని? అవిశ్రాంతంగా తిరిగే జీవకణాలు పదిలంగా పొదువుకున్న నీటి తిత్తినా? అ వెందుకు పనిచేస్తున్నాయో వాటికే తెలియదు, ఒక క్షణం ఆగవు, వాటి యజమాని ఎక్కడ ఉన్నాడో నాకు అంతుపట్టదు వాటిని పనిచెయ్యమని అడగను, అయినా అవి కష్టపడి పనిచేస్తాయి, అవొక ప్రపంచాన్ని అల్లుతాయి ఒకరినొకరు వాడుకునేలా; ఏ లక్ష్యం సాధించడానికో నాకు తెలీదు, ఎప్పుడు మొదలో తెలీదు ఎవర్ని పొగడాలో, ఎవర్ని తెగడాలో, ఎవర్ని ముద్దుచెయ్యాలో తెలియదు. ఒక అద్భుతంలో మరొక అద్భుతం…
-
మాక్స్ మైకేల్సన్, అమెరికను కవి
ఓ తుఫానా! నన్ను నీ చక్రవ్యూహాల్లోకి తీసుకుపో తలతిరిగేలా నీతో దొర్లనీ తుపాకి గుండులా నీతోపాటు దుముకుతూ ఎగరనీ. నేను నిన్ను “ఆగు. చాలు” అనాలి నీవన్నీ బెదిరింపులని తెలుసు; నువ్వు విశృంఖలంగా ఉంటావనీ తెలుసు; నువ్వు చెప్పాపెట్టకుండా వస్తావనీ తెలుసు! . మేక్స్ 1880-1953 అమెరికను కవి Storm . Storm, Wild one, Take me in your whirl, In your giddy reel, In your shot-like leaps and flights.…
-
అడవి పాట… హారియట్ మన్రో, అమెరికను కవయిత్రి
నా తల వాల్చడానికి చోటు లేదు నా గుండెలమీద ఏ శిశువూ పడుక్కోదు నా కోసం ఏ పెళ్ళి విందూ ఇవ్వబడదు నేనీ నింగి కింద ఒంటరిగా నడవాల్సిందే. నా అధికారం డబ్బూ త్యజించాను కొండంత ఎత్తు బరువు దించుకుని తేలికపడ్డాను! పగలంతా ఈ రాళ్ళగుట్టలమీద నడిచి చీకటివేళకి పొయ్యి వెలిగించుకుంటాను. వడగళ్ళకి కొండంతా విరగబూస్తుంది శీతగాలి నా కన్నీరు తుడుస్తుంది నేను బలహీనను, అయినా, మృగశిర నాభయాలు పోగొట్టినపుడు, నేను బలం పుంజుకుంటాను. వేకువ దుప్పటి…
-
నేను ప్రపంచాన్ని పరిత్యజించాను… యోనిజీరో నొగూచి, జపనీస్ కవి
నేను ప్రపంచాన్ని పరిత్యజించేను నన్నేదీ తాకదని అనుకున్నాను. అయినా, మంచు కురిసిన రోజు చలేస్తూనే ఉంది పూలు విరిసిన రోజు ఆనందం కలుగుతూనే ఉంది . యోనిజీరో నొగూచి December 8, 1875 – July 13, 1947 జపనీస్ కవి. . I Have Cast the World I have cast the world, and think me as nothing. Yet I feel cold on snow-filling day, And…
-
నా కృతజ్ఞతలు … గ్రేస్ ఫాలో నార్టన్, అమెరికను కవయిత్రి
నేను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి ఉండేవాడు తర్వాత నేను మామూలు మనిషిని కాలేకపోయాను. నన్ను అంతలా మార్చిన ఆ చెలిమికి కృతజ్ఞతలు. అతని పేరు నేను చెప్పను. అతనిప్పుడు నాకొక ప్రతీక పువ్వులనాలన్నా, రువ్వలనాలన్నా. సంగీతానికీ అతను ఒక ప్రతీక భగ్నవీణ కీ అతనే. అతన్ని ఒక పుస్తకంద్వారా తెలుసుకున్నాను ఎన్నడూ చెయ్యీ చెయ్యీ కలిపింది లేదు. అతనిప్పుడు లేడు…అతని కోసం ఏ పచ్చని చేలల్లోనూ వెతకక్కరలేదు. స్వర్గం ఉండకపోవచ్చు. నాకు నమ్మకం లేదు, కానీ నాకో…