వర్గం: ప్రముఖుల ఉత్తరాలు
-
స్థితప్రజ్ఞుడు డేవిడ్ హ్యూం… ఏడం స్మిత్, ప్రఖ్యాత ఆర్థికశాస్త్రవేత్త, స్కాట్లండు
ఉపోద్ఘాతం: 18వ శతాబ్దంలో స్కాట్లండులో తాత్త్విక చింతన, శాస్త్రీయ ఆవిష్కారాలతో ఒక కొత్తశకానికి తెరలేచింది. గ్లాస్గో, ఎడింబరో, ఏబర్డీన్ వంటి ప్రాచీనమైన విశ్వవిద్యాలయాలలోనూ పదిమంది కలుసుకునే కూడళ్ళలోనూ, ఎక్కడపడితే అక్కడ మేధోపరమైన చర్చలు జరుగుతుండేవి. అదే కాలంలో యూరోపులో ప్రచారంలో ఉన్న మానవతావాదం, హేతువాదాలతో ఆలోచనలను పంచుకుంటూ, స్కాట్లండుకు చెందిన మేధావులు మానవ వివేచనాశక్తికి అధిక ప్రాధాన్యతనిస్తూనే, తర్కానికి నిలబడని ఏ ప్రాచీన సంప్రదాయాన్నైనా నిర్దాక్షిణ్యంగా త్రోసిపుచ్చేరు. ఇతర యూరోపియన్ దేశాలవారికి భిన్నంగా కేవలం వివేకము ద్వారానే…