వర్గం: కవితలు
-
ఆటు… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

నీ ప్రేమ నానుండి మరలింది కనుక నాకు నా మనఃస్థితి తెలుస్తోందిలే: అదొక తీరంనుండి సముద్రంలోకి చొచ్చుకొచ్చిన బండరాయి, దానిమీద ఒక చిన్న గుంత; అందులో, ఎగసినకెరటాలనుండి జారిపోగా మిగిలిన నీటితో ఏర్పడిన చిన్న మడుగు. ఆ గోర్వెచ్చని నీరు ఎండకీ, గాలికీ మెల్లమెల్లగా హరించుకుపోతుంటుంది. . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే (22 ఫిబ్రవరి 1892 – 19 అక్టోబరు 1950) అమెరికను కవయిత్రి . Ebb . I know what my heart…
-
మండువేసవిలో ఒక సూర్యోదయం… ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి

ఓ ఆకాశమా! విపుల వైశ్వానర స్వరూపమా! విను! బ్రహ్మాండమైన సూర్యగోళపు గర్జనలు వినిపించకపోవచ్చు నేమో గానీ, అవి వినలేనంత భీకర శబ్దాలు; వెలుగునే వేడెక్కించగలవవి. ఓ మహానుభావా! సూర్యుడా! మా ఆత్మలని వెలిగించు, కోరికలు రగిలించు… మా ఆత్మలకి ప్రేరణనివ్వు! మేము ఈ చీకటిని చాలా కాలమై ప్రేమిస్తున్నాం. ఈ చీకటికి చితి రగిలించి, వెలుగుని మరింత ప్రజ్వలనం చెయ్యి. ఎంతగా అంటే ఆ వేడిలో నిస్తేజమైన ఈ రోజులు రగిలి, ఆ సెగలలో సుషుప్తిలో మునిగి…
-
చిత్రం… లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి

ఊపిరి తీయనివీ, కంటి చూపు లేనివీ, వాటికే మరణం లేకపోవడం ఏమిటి?! చైతన్యం ఎరుగని ఒక బండరాయికీ, పిసరంత నేలకీ శాశ్వతత్వం అనుగ్రహించబడటం ఏమిటి?! ఒక ధూళికణం, ఒక మట్టి బెడ్డ భగవంతుడి అపురూపమైన వరానికి నోచుకుంటాయి. దారి పక్కన పడుండే గులకరాయికి చావు లేదు. మన తాత ముత్తాతలు కోసిన గడ్డి పరకలు ఇప్పుడు వాళ్ళ సమాధులమీద మొలుస్తున్నాయి. కనీ కనిపించకుండా ప్రవహించే పిల్లకాలువలు అనవరతంగా ప్రవహిస్తూ ఎండిపోతుంటాయి. పేలవంగా, నిశ్చలంగా పడి ఉండే ఇసకరేణువులకి…
-
కేవలం ఒక సామాన్య సైనికుడు … లారెన్స్ వెయిన్ కోర్ట్, కెనేడియన్ కవి

. అతను బాన పొట్టతో, జుత్తు రాలిపోతూ త్వరగా ముసలివాడైపోయాడు అతను మందిచుట్టూ చేరి, గతాన్ని కథలు కథలుగా చెప్పేవాడు… అతను పాల్గొన్న యుద్ధాలగురించీ, అతని సాహసకృత్యాలగురించీ, సాటి సైనికులతోఆటు సాధించిన విజయాలగురించీ, అందులో అందరూ వీరులే. అప్పుడప్పుడు అతని చుట్టుప్రక్కలవాళ్ళకి అవి హాస్యాస్పదంగా కనిపించేవి కానీ అతనితో పనిచేసినవాళ్లందరూ వినేవారు అతనేం మాటాడుతున్నాడో తెలుసు గనుక ఇకనుంచి మనం అతని కథలు వినలేము, కారణం బిల్ చచ్చిపోయాడు ప్రపంచం ఒక సైనికుని మరణం వల్ల కొంత నష్టపోయింది. అతని…
-
బట్టలుతికిన రోజు …జూలియా వార్డ్ హోవ్, అమెరికను కవయిత్రి

బట్టలారవేసిన తీగ … కుటుంబంలో ప్రేమకీ, సేవకీ ఒక రుద్రాక్షమాల వంటిది; తల్లి ప్రేమించే ప్రతి చిన్న దేవదూత దుస్తులూ అక్కడ మనకి దర్శనం ఇస్తాయి. ఆమె పెరటిలో ఆలోచనలలో మునిగి దండెం మీద ఒక్కొక్కబట్టా ఆరవేస్తున్నప్పుడు ప్రతి బట్టనీ ఒక రుద్రాక్షపూసగా పరిగణిస్తుందంటే ఆశ్చర్యపోనక్కరలేదు. అపరిచితవ్యక్తినైన నేను అటువైపుగా పోతూ ఆ ఇంటికీ, దుస్తులకీ ఒక అంజలి ఘటిస్తాను ప్రేమపూర్వకమైన శ్రమకీ, ప్రార్థనకీ గల దగ్గరపోలిక మదిలో మెదలినపుడు పెదాలపై చిరునవ్వు మెరుస్తుంది. . జూలియా…
-
ఎలా? … షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి…

నిన్న రాత్రి, అలా ఆలోచిస్తూ విశ్రమిస్తుంటే, కొన్ని ‘ఎలా?” అన్న భయాలు నా చెవిలో దూరి రాత్రల్లా గెంతులేస్తూ, పండగ చేసుకుంటూ వాటి పాత పల్లవి “ఎలా? ఎలా?” ని అందుకున్నాయి: స్కూలో నేను సరిగా మాటాడలేకపోతే ఎలా? వాళ్ళు ఈత కొలను మూసెస్తే ఎలా? ఒకవేళ ఎవరైనా నన్ను చితక్కొట్టెస్తే ఎలా? నా కప్పులో ఎవరైనా విషం కలిపితే ఎలా? ఒకవేళ నేను ఏడవడం మొదలెడితే ఎలా? ఒకవేళ నాకు రోగం వచ్చి చచ్చిపోతే ఎలా?…
-
కాలం… హెన్రీ వాన్ డైక్, అమెరికను

కాలం ఎదురుచూసే వారికి బహునెమ్మదిగా గడుస్తుంది భయపడే వారికి మరీ తొందరగా గడిచిపోతుంది శోకించేవారికి ఎంతకీ తరగదు ఆనందంతో గంతులేసేవాళ్లకి ఇట్టే పరిగెడుతుంది కానీ ప్రేమికులకి అసలు దాని ఉనికే తెలీదు. . హెన్రీ వాన్ డైక్ Jr. (November 10, 1852 – April 10, 1933) అమెరికను కవి Henry Van Dyke Jr. Time is… . Time is Too slow for those who wait, Too Swift…
-
నాకు నక్షత్రగతులు తెలుసు, కానీ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

నాకు పేరు పేరునా నక్షత్రాలు తెలుసు ఆల్డెబరాన్ (రోహిణి), ఆల్టేర్ (శ్రవణం) … విశాలమైన నీలాకాశపు నెచ్చెన అవి ఎలా ఎక్కుతాయో కూడా తెలుసును. వాళ్ళు చూసే చూపులనుబట్టి మగవాళ్ళ రహస్యాలు పసిగట్టగలను వారి వింత వింత, చీకటి ఆలోచనలు బాధకలిగించడంతో పాటు జాగ్రత్తనీ బోధించాయి. కానీ నీ కళ్ళే నా ఊహకి అందటం లేదు, అవి పదే పదే పిలుస్తున్నట్టు అనిపిస్తున్నా… నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో తెలీదు అలాగని, అసలు ప్రేమించటం లేదనీ చెప్పలేను.…
-
తన దృష్టిలోపం మీద… జార్జ్ లూయీ బోర్హెస్, అర్జెంటీనా కవి

నా ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా, అవిచ్ఛిన్నమైన వెలుగుపుంజమొకటి కాలక్రమంలోనన్నావహించింది, అది సమస్త వస్తువుల్నీ విశ్లేషించి విశ్లేషించి కడకు, నా ముందు వర్ణ,రూపరహితమైన వస్తువుగా నిలబెట్టేది,కేవల భావనగా. జనప్రవాహంతో పొరలిప్రవహించే మౌలికమైన దివారాత్రాలు కూడా ప్రాభాతసమయాన అరుణోదయానికి ఎదురుచూస్తూ చిక్కగా, స్థిరంగా, నిలకడగా కనిపించే ఉషః కాంతిలా మారిపోయేవి. నాకు ఒక్కటంటే ఒక్కటైనా మనిషిముఖం చూడగలిగితేబాగుణ్ణనిపించేది. నాకు తెలియకుండానే, చేత్తోపట్టుకోడం తప్ప మరేమీచెయ్యలేని ఆ మూసిన విజ్ఞానసర్వస్వ సంపుటాలలోంచి చిన్నచిన్న పక్షులూ, వెన్నెల చందమామలూ ఎగిరిపోయేవి. మంచికో చెడుకో,…
-
వలస పిచ్చుక… ఛార్లెట్ స్మిత్ ఇంగ్లీషు కవయిత్రి

Image Courtesy: https://www.birdlife.org/worldwide/news/spring-alive-swallows-spring . పోడుమీద ముళ్ళచెట్టు పచ్చగా పూసింది గట్లమీద వెరోనికలు నీలంగా నవ్వుతున్నాయి ఓక్ చెట్లు పూతకొచ్చాయి, వాటిక్రింద త్వరలో తెల్లని హాదార్న్ ఘుమఘుమలాడుతూ మే నెలలకి రజతహారాన్ని వేయబోతోంది. మధుమాసం కుదురుకున్నాక వచ్చే అతిథి స్వాలో (వలస పిచ్చుక*) కూడా చివరకి విచ్చేసింది. సరిగ్గా సూర్యుడు గ్రుంకే వేళ, పికాలు రాగాలందుకునే వేళ, తుర్రుమనుకుంటూ శరవేగంతో రెక్కలార్చుకుని నాముందునుండి పరిగెడితే ఒకసారి పలకరించేను. ఓ వేసవి అతిథీ! నీకు స్వాగతం! రా, నా రెల్లుపాక…