వర్గం: కవితలు
-
కామన… పూష్కిన్, రష్యను కవి
రోజులు సాగుతూ ఉంటాయి; ప్రతిక్షణమూ విఫలప్రేమ వల్ల గాయపడ్డ నా మనసులోని బాధనీ దుఃఖాన్ని ఇనుమడింపజేస్తూ చీకటి మిగిల్చి నిద్ర పోనీని కలలకీ, వెంటాడే కోరికలకీ దారితీస్తుంది; అయినా, నేను ఫిర్యాదు చెయ్యను; బదులుగా, శోకిస్తాను; కన్నీళ్ళు నాకు మనశ్శాంతి నిస్తాయి, ఇచ్చి శలవుతీసుకుంటాయి. గాఢమైన దుఃఖానికి బందీ అయిన నా మనసుకి, నా మాటనమ్మండి, చెప్పలేని ఆనందం కలుగుతుంది. జీవితమా! సాగిపో! రిక్తాత్మా! రా, ముందుకి ఎగిరిపో, నిశ్శబ్ద తమోశూన్యంలోకి అంతర్థానమైపో! నా ప్రేమ గురించి…
-
స్తుతి గీతం 14… ఎలిజబెత్ మహారాణి 1, ఇంగ్లండు
నిజమైన నమ్మకం ఎన్నడూ లేని వాళ్ళు వాళ్ల మనసుల్లో దేముడు లేడంటారు. వాళ్ళ నడవడి అంతా రోతగా ఉంటుంది అందులో ఒక్కడికీ దైవత్వం అంటే తెలీదు. స్వర్గంనుండి దేముడు వాళ్లని గమనించేడు వాళ్ల నడవడి ఎలా ఉంటుందో చూద్దామని. ఎందులోనూ నిశ్చయం లేక, పక్కతోవలు పట్టి ఏ ఒక్కడూ కూడా ఋజుమార్గంలో పోయినవాడు లేడు. వాళ్ల మనసుల్లో, మాటల్లో అంతా కపటమే. పెదవి విప్పితే విషపూరితమైన లాలూచీ మాటలు వాళ్ళ మనసులు చెడిపోయాయి; నోర్లు తాటిపట్టెలు, వాళ్ళు…
-
నీ ఉనికికి దోహదం చేసే వాళ్ళతో తిరుగు … రూమీ, పెర్షియను కవి
నీ అస్తిత్వానికి దోహదం చేసే వాళ్లతో తిరుగు అంటీ ముట్టనట్టు ఉండేవాళ్లతో వొద్దు; వాళ్ల ఊర్పులు నోటంట నీరసంగా వస్తాయి; ఈ దృశ్య ప్రపంచంతో కాదు, నీ బాధ్యత చాలా గంభీరమైనది. గాలిలోకి ఎగరేసిన మట్టి ముక్కలై రాలిపోతుంది. నువ్వు ఎగరడానికి ప్రయత్నించకపోతే, ఎగిరి నిన్ను అలా ఖండ్ఖండాలుగా చేసుకోకపోతే, మృత్యువే నిన్ను ముక్కలుముక్కలు చేస్తుంది, అప్పుడు నువ్వు ఏదవుదామనుకున్నా సమయం మించిపోతుంది. ఆకులు పండిపోతాయి. చెట్టు కొత్త వేరులు తొడుగుతుంది ఆకుల్ని పచ్చగా మార్చుకుంటుంది. నీకింకా…
-
తొలిసంజ… షెల్లీ, ఇంగ్లీషు కవి
తొలిసంజ మేల్కొలపగలిగిన అన్నిటినీ మేల్కొలిపింది స్వేచ్ఛగా తిరిగే పిచుకల్నీ, పిట్టల్నీ, కోయిలలనీ, గొల్ల వనిత పాటల్నీ, తోటమాలి దోకుడుకత్తి చప్పుడునీ, ప్రభాత ప్రార్థన ఘంటనీ, గండు తుమ్మెదలనీ: మంచోడుతున్న మొక్కజోన్నకంకులపై మిణుగురులు సేదదీరుతున్నై, విద్యార్థి సరిచెయ్యడం మరచిన లాంతరు వత్తుల్లా, నదీ తీరాన్న అవి కొడిగడుతున్నాయి. కందిరీగ తన ఝంకారం మరిచిపోయింది కొండమీదా, మైదానం మీదా కీచురాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నాయి, రైతు తుపాకికి చప్పుడుకి దౌడుతీస్తున్న ఏనుగుల మందలా రాత్రి భయాలూ, పీడకలలూ, ప్రతి ఒక్కటీ తొలికిరణానికి…
-
నీ కోసం నేను వదులుకున్నవి… రఫేల్ ఆల్బెర్టి, స్పానిష్ కవి
నీ కోసం నా తోటా, నా ఉద్యానమూ, నిద్రపోక ఎదురు చూసే పెంపుడు కుక్కలూ, నా జీవితాన్ని ముందే హేమంతంలోకి నెట్టిన నా వసంతంలాంటి వయసూ… ఒక భయాన్నీ, ఒక అదురుపాటునీ, ఆరని మంటలాంటి ప్రతిభనీ, నిస్సహాయంగా వీడ్కోలుపలికే రక్తపుజీరల కన్నులలో నా ప్రతిబింబాన్నీ వదిలిపెట్టేను. నది ఒడ్డున విషణ్ణలైన పావురాయిల్నీ, మైదానంలో గుర్రాలనీ, నిన్ను చూడడానికి కమ్మని సముద్రపు సుగంధాన్ని వదిలిపెట్టేను. నీ కోసం నాదనుకున్న ప్రతీదీ విడిచిపెట్టేను. ఓ రోము మహానగరమా! నా బాధలకీ,…
-
అమరత్వం… ఫ్లారెన్స్ రాండల్ లివ్ సే, కెనేడియన్ కవయిత్రి
(యుద్ధరంగంలో క్షణక్షణం మృత్యువును తప్పించుకుంటూ బ్రతికే సైనికుల జీవితాన్ని చక్కగా చెప్పిన కవిత) . నేనొకసారి మరణించేను, కానీ కత్తితో పొడుస్తున్న బాధతో మళ్ళీ ప్రాణం తిరిగొచ్చింది. మరోసారీ ప్రాణంపోయిందనే అనుకుని భయపడ్డాను; కానీ ఫిరంగి చాలా దూరంగా పడింది. తూటా గాలిని చీల్చుకుంటూ రంయిమని వచ్చింది, చిన్నప్పటి ప్రార్థన ఒకసారి చదువుకున్నాను. నాకు తెలివొచ్చేలోగా మరణం సంభవిస్తే నేను దైవాన్ని కోరుకుంటాను నా ఆత్మని తీసుకుపొమ్మని నేను మేల్కొనే లోగా… . ఫ్లారెన్స్ రాండల్ లివ్…
-
ఘంటానాదము… ఏలిస్ మేనెల్, ఇంగ్లీషు కవయిత్రి
నడుస్తున్న కాలంతో పాటు, వణుకుతున్న స్థంబం నుండి, పరిగెడుతున్న ఆ రాత్రి వేళ క్షణమాత్రం ఒక ఘంటల సవ్వడి గాలిలోకి ఎగసింది. సుడిగాలిలోచిక్కుకున్న గూడొదిలినపక్షుల్లా అకస్మాత్తుగా… ఓహ్, శ్రద్ధగా వినండి. ఘంటికా నౌకా సమూహం తెరచాపలెత్తి చీకటి సముద్రం మీద ప్రయాణం చేస్తోంది. ఉన్నట్టుండి చల్లని గాలి వీస్తుంది, గట్టిగా, ఒంటరిగా. ‘గంటల ‘ పద్యాలు రెక్కతొడిగి మేఘాలతో పాటు ప్రయాణిస్తుంది. . ఏలిస్ మేనెల్ల్ (సెప్టెంబరు 22, 1847 – 27 నవంబరు 1922) ఇంగ్లీషు…
-
మొక్కలాటి మౌనం… జిష్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి
కవిత్వంతో ఏడడుగులు 80 . మొక్కల మౌనం . మీకూ నాకూ మధ్య ఏకపక్ష అనుబంధం బలపడుతోంది. నాకు ఆకు అన్నా, రేకు అన్నా, పప్పు అన్నా, కొన అన్నా, కాండం అన్నా తెలుసు ఏప్రిల్, డిశెంబరు లలో నీకు ఏమవుతుందో కూడా నాకు తెలుసు. నే చూపినంత కుతూహలం తిరిగి నామీద చూపించకపోయినా మీలో కొందరంటే నేను పాదాక్రాంతమౌతాను, మరికొందరంటే, మెడ రిక్కిస్తాను. . మీకు నేను చాలా పేర్లు పెట్టాను: గంగరేగుచెట్టనీ, ఉమ్మెత్త…
-
అజ్ఞాత వ్యక్తికి… హెలెన్ డడ్లీ, అమెరికను కవయిత్రి
(అప్రాప్త మనోహరికి … అని భావకవులు రాసిన అలనాటి కవితలకి దీనికి చాలా పోలికలున్నాయి ) రోదసిలో నిరంతరం అటూ ఇటూ గర్వంగా తిరిగే ఎన్నో తారలను చూసేను, చివరికి సూర్య చంద్రుల్ని కూడా కాని, చూడనిది నీ ముఖమే. . వాయులీనాన్ని విన్నాను, పైరగాలులూ, ఉత్తుంగ తరంగాలూ ఆనందంతో ఆలపించే అవధిలేని గీతాల్ని విన్నాను ఇంతవరకు విననిది నీ గొంతుకే. . ఇక్కడి మేటి శ్వేత కుసుమం పారిజాతాన్ని పట్టుకున్నాను పగడాన్ని, రత్నభోగినీ తాకేను. తాకనిది…
-
కుర్రతనమే గాని సహజమే… కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి
(ఈ కవిత చదివేక నాకు “ప్రణయలేఖలు” అన్న ఖండికలో పింగళి కాటూరి కవుల పద్యం: “ఎగిరి నీ పాదములచెంత కెట్లొ వచ్చి వ్రాలుదునొయన్న ఉత్సుకత్వమ్ము గలదు; సాధ్య సాధనమైన పక్షముల జంట హృదయమునకుండి లేదు శరీరమునకు” గుర్తుకు వచ్చింది ) *** నాకే గాని రెండు చిన్న రెక్కలుంటే నేనే గాని ఒక చిన్న పక్షినయి ఉంటే ప్రియతమా! నేను నీ దగ్గరకి ఎగిరివచ్చేవాడిని! కానీ ఇలాంటి ఆలోచనలన్నీ ఊసుపోకకి. నేను ఇక్కడ ఉన్నచోటే ఉన్నాను .…