వర్గం: కవితలు
-
శోకంలో… థామస్ హేస్టింగ్స్, అమెరికను సంగీతకారుడు
ఓ ప్రభూ, ఈ కన్నీటి కనుమలలో బాటసారులము,దయతో మార్గాన్ని చూపించు, నీ తీర్పు వెలువడని మా ప్రయత్నాలలో మా చివరి శ్వాస ఉన్నంతవరకూ… ఆకర్షణల బాణాలు మమ్మల్ని బాధించినపుడు మేము తప్పుడుత్రోవలలోకి మరలినప్పుడు నీ అనురాగము మాకు కరువైపోకూడదు నీదైన సన్మార్గంలో మమ్మల్ని నడిపించు. బాధల, ఆవేదనల వేళల్లో మృత్యువు సమీపిస్తున్నప్పుడు మా మనసులు ఆందోళనచెందకుండా చూడు మా ఆత్మలు భయవిహ్వలం కానీయకు; ఈ మర్త్య జన్మ ముగిసినపుడు నీ అక్కున సేదదీరగా మమ్ము ఆహ్వానించు, దేవతల…
-
ఎండవేడిమికి ఇక భయపడనవసరం లేదు… షేక్స్పియర్
(ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం) ఎండ గురించి ఇక భయపడ పనిలేదు శీతకాలపు చలిగురించి కూడా; నువ్వు ఈ జీవితపు కర్తవ్యం నిర్వహించి ఇంటికి తిరిగిపోయావు, ప్రతిఫలం అందుకుని; అందగాళ్ళైనా, అందగత్తెలైనా చిమ్నీలు తుడిచే పిల్లల్లా మట్టిపాలు కావలసిందే. గొప్పవాళ్ళ ఆగ్రహానికి భయపడ పనిలేదు, నిరంకుశుల శిక్షల పరిథి దాటిపోయావు; ఇక తిండికీ బట్టకీ చింతించే పనిలేదు; గడ్డిపరకైనా, మహావృక్షమైనా నీకు ఒక్కటే; అందరూ చివరకి మట్టిలో కలవవలసిందే. మెరుపులకి భయపడే పని లేదు,…
-
నిర్లక్ష్యం… ఆస్కార్ ఫే ఏడమ్స్, అమెరికను కవి
నిర్లక్ష్యం అంటే ఏమిటని నన్నడుగుతున్నావా? సర్లే, ఆ మాటకి నాకు అర్థం తెలుసును. నిర్లక్ష్యం అంటే ఒకప్పుడు నువ్వు చలికాచుకున్న మంటను వదిలిపెట్టి బూడిద వెతుక్కోడం; దురదృష్టవశాత్తూ స్నేహానికి తలుపుతెరిచిన తాళాన్ని పోగొట్టుకోడం; ఒకప్పుడు నీకోసం మెరిసినకళ్ళు ఇప్పుడు నువ్వు చూసినా పట్టించుకోకపోవడం; ఒకనాడు ఉన్నది ఇకమీదట ఎన్నడూ ఉండదన్న సత్యం గ్రహించడం ఇప్పుడు నువ్వు దేన్నీ నమ్మవని తెలుసుకోవడం, వయసు ఎప్పుడో తెలియకుండా జారిపోయిందని గ్రహించడం, ఆశ తిరిగి చిగురించదని అర్థం చేసుకోవడం. చివరకి ప్రేమంటే…
-
ఇచ్ఛ, శక్తి, కర్తవ్యమూ… లె నార్దో దవించి, ఇటాలియను చిత్రకారుడు
చెయ్యాలనుకుని, చెయ్యలేని వారు – చెయ్యగలిగినవి చేద్దామనుకోవాలి! మనం చెయ్యలేనివి చేద్దామనుకోవడం వృధా; అందుకనే, ఎవడైతే గురిలేకుండా ఎదో ఒకటి చేద్దామనుకోడో అలాంటి వ్యక్తిని మనం విజ్ఞుడు అని అంటాము. మన బాధల్లాగే, మన సుఖాలు కూడా ఎప్పటికీ ఇచ్చాశక్తిగూర్చిన అవగాహనమీద ఆధారపడి ఉంటాయి. అది మనకి తర్కం తన ఆధిక్యతని ప్రకటించుకున్నా, కర్తవ్యానికి తగ్గట్టు సయిష్టంగా తల ఒగ్గడం నేర్పుతుంది అయినప్పటికీ, చాలా సార్లు నువ్వు చెయ్యలేనివి చెయ్యాలనుకోవాలి, మనకోరిక కన్నీరు తెప్పించినా సంతృప్తిగా స్వీకరించాలి…
-
ప్రేమ మహా దారుణమైనది! … గ్రేస్ ఫాలో నార్టన్, అమెరికను కవయిత్రి
దిగంతాలనున్న హరిత మైదానాన్ని దర్శించేను లోతెరుగని నీడలో పరున్నాను భూదేవిని అడిగేను, “నన్ను పొదువుకో” అని రాత్రిని ప్రార్థించేను, “నన్ను ఆవరించ”మని గాలిమీద చికాకుగా అరిచేను, “నీకేం తెలీదు ఫో, నీకు ఎదురులేని స్వేచ్ఛ ఉంది,” అని. చిగురాకులనన్నిటినీ వంగి దగ్గరగా గుమిగూడి నాకొక తెరగా నిలబడమని బ్రతిమాలుకున్నాను; తర్వాత చుక్కలతో నా కథ చెప్పుకున్నాను: “అదిగో ఆ లోయలో, అదే మా ఇంటి దీపం. నేను తిరిగి వెళ్ళిపోతానని తెలుసు గాని, ముందు, ఈ కనికరంలేని అడవిలో…
-
తల్లిలేని పిల్లడు… విలియం థాం, స్కాటిష్ కవి
ఏ మేనత్తలో, తోబుటువులో, అమ్మమ్మలో నాయనమ్మలో మిగతా పిల్లలందర్నీ తమ ఇళ్ళల్లో హాయిగా నిద్రపుచ్చుతుంటే ఎవరూ పట్టించుకోకుండా ఒంటరిగా అన్నీ కోల్పోయినట్టుండే దెవరు? పాపం,చిన్నతనం ఇంకా వదలని వెర్రిబాగులాడు… తల్లిలేని పిల్లాడే. ఆ తల్లి లేని పిల్లవాడు తన పక్కమీదకి నడుచుకు పోతాడు వెచ్చగా వీపు కప్పేవారూ మెత్తని దిండుమీద తల ఉంచేవారూ లేరు; అతని లేత అరి పాదాలు పగిలి బీటలు బారి ఇనపముక్కల్లా ఉన్నాయి పాపం ఆ తల్లిలేని పిల్లాడు పడుకునే పక్కే చాలా…
-
నా భర్తకి… అజ్ఞాత కవయిత్రి
తప్పించుకోలేని ఈ ఐహిక బాధలనుండీ ఈ జీవితం నుండీ నేను నిష్క్రమించినపుడు నా కోసం నల్లని దుస్తులు ధరించవద్దు ప్రియతమా! నువ్వు ఉంగరాన్ని మాత్రం తియ్యకు. దయచేసి ఆ తళతళల వజ్రాన్ని నా గుర్తుగా చేతికి ఉంచుకో అది నీ కళ్ళలో మెరిసినప్పుడు అది పక్కనుండి నడుస్తున్న నా నీడగా భావించు. ఎందుకంటే, ఆ వజ్రం కన్నా, ఆ మాటకొస్తే ఏ రత్నం కన్నాకూడా ప్రకాశవంతంగా నీకు కనిపిస్తాను. అక్కడ ఏదో జరగకూడనిది జరిగినట్టు ఇంటిని నల్లని…
-
దేవదూతలు… ఎడ్మండ్ స్పెన్సర్, ఇంగ్లీషు కవి
భగవంతుడు నిజంగా పట్టించుకుంటాడా? ఇంత హీనమైన మనుషులనీ, వాళ్ళ దుర్మార్గాలనీ క్షమించి ఉపకారం చెయ్యడానికి ఇంకా ప్రేమ మిగిలి ఉంటుందా? ఉంది. లేకుంటే, మనుషులు మృగాలకంటే కనికిష్టంగా తయారై ఉండేవారు. ఆహ్! ఏమని చెప్పాలి తన సృష్టిని ప్రేమించే మహోన్నతుడైన ఆ దేవుని కరుణ గురించి! అతని అనుగ్రహాలన్నీ దయారసపూరితాలై ఉంటాయి. అందుకే తనదూతలని అన్నిచోట్లకీ సేవచెయ్యడానికి పంపిస్తాడు: క్రూరమైన మనిషినీ… అంతే క్రూరమైన అతని శత్రువునీ. మనలో సహాయంకోసం అర్రులుచాచేవారికి బాసటగా ఎన్నిసార్లు వారు తమ…
-
మృగరాజు అస్థిపంజరం… ఛార్లెస్ టెన్నిసన్ టర్నర్, ఇంగ్లీషు కవి
ఓ మృగరాజా! ఎన్నాళ్లయింది నువ్విలా రక్తమాంసాలు లేకపడి ఉండి? నీ భీకరమైన ఆకలి చూపులను ఆక్సర్షిస్తున్నదేది? మొదట రాబందులు వాలేయి; తర్వాత క్రిములూ, వేడీ, గాలీ, వర్షమూ అనుసరించేయి; వాటితోబాటే ఉష్ణమండలపు తీవ్రతలూనూ… అవి నిన్ను విడిచిపెట్టేయేమో నాకు తెలీదు; ఎన్నాళ్ళు నీ భారీ శరీరం కుళ్ళిపోయి పడి ఉందో, చివరకి ముక్కముక్కలై నాలుగుచెరగులా వెదజల్లబడిందో, లేక, తుఫానులై ఎగసిన ఇసుక వాటిని తిరిగి భూమిలోకి నెట్టేసిందో, కాని, ఒకప్పుడు తీవ్రమైన ఆగ్రహం ప్రదర్శించిన నీ విశాలమైన…
-
సానెట్… మార్క్ అలెగ్జాండర్ బైర్డ్, స్కాటిష్ కవి
చెట్టునుండి జారుతున్న ఎండుటాకులాగా గాలికి ఎగరగొట్టబడ్డ గడ్డిపరకలాగా ఒడ్డునుండి ఒడ్డుకీ, కోననుండి కోనకీ పరిగెడుతూ నా హీన స్వరంతో ఆమెను గెలవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇద్దరు దేవతలు నన్ను నడిపిస్తున్నారు; ఒకరు కబోది, అహంకారంతో పెంచబడిన బిడ్డ; రెండోది సముద్రపు నురుగుకి పుట్టిన పడుచు, దాని రెక్కలతో డాల్ఫిన్ కన్నా తేలికగా ఎగురుతుంది. ఇసకను దున్ని గాలిలో విత్తనం జల్లే మనిషికి ఎప్పుడూ సుఖం ఉండదు; పిల్లవాడి ఉపదేశమూ,అంధుడి మార్గదర్శనంలా మనసులో ఒక వెర్రి కోరిక ఉంచుకుని నిప్పులోకూడా ఆడదాని…