వర్గం: కవితలు
-
మనిద్దరిలో ఒకరు ముందు పోవలసినపుడు… రాబర్ట్ బ్రిడ్జెస్, ఇంగ్లీషు కవి
మనిద్దరిలో ఒకరు ముందు పోవలసినపుడు అది నేనే కావాలని కోరుకుంటున్నాను, ఎప్పటిలా ఇంటిలో హాయిగా ఉండు అలా అయితేనే నే కోరుకున్నది జరుగుతుంది. నా మనసుకూడా నీది చేసుకుని నీ మోకాళ్ళమీద బిడ్డకి పాటపాడు, లేదా, ఒంటరిగా నీలో నువ్వు నీ కోసం రాసిన పాటలు చదువుకో. . రాబర్ట్ బ్రిడ్జెస్ 23 October 1844 – 21 April 1930 ఇంగ్లీషు కవి . Robert Bridges . When Death to…
-
కాలానిది చక్రగతి… రాబర్ట్ సౌత్ వెల్… ఇంగ్లీషు కవి
ఒకసారి నరికినచెట్టు, కొన్నాళ్ళకి మళ్ళీ చిగురించవచ్చు పూర్తిగా బోడులైన మొక్కలు మళ్ళీ పూలూ కాయలూ కాయవచ్చు అలవిమాలిన కష్టాలుపడే అభాగ్యుడికిసైతం ఉపశమనం లభిసుంది ఎండిపోయిన నేల సైతం వర్షపు చినుకును పీల్చుకోగలుగుతుంది కాలం చక్రంలా దొర్లుతుంది, భాగ్యాభాగ్యాలు దారి మళ్ళుతుంటాయి: కష్టం నుండి సుఖానికీ, సుఖం నుండి కష్టానికీ అదృష్టాంబోనిధి నిరంతరం పోటులోనే ఉండదు అది తన అలలను విలైనంత వెనక్కి తీసుకుంటుంటుంది; అవి ముందుకీ వెనక్కి ఒక క్రమంలో వచ్చిపోతుంటాయి ఆ మగ్గము ముతకబట్టనీ, నూరోనంబరూనీ…
-
మన జీవితం ఏమిటి? … సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి
మన జీవితం ఏమిటి? కేవలం మన ఆవేశాల ప్రదర్శన మరి సంతోషం సంగతి? ఆగి ఆగి వినిపించే సంగీతం మన మాతృగర్భాలు “గ్రీన్ రూం”ల వంటివి ఈ లఘు జీవిత హాస్యనాటికకి వేషధారణ చేసుకుందికి. ఈ ప్రపంచం ఒక రంగస్థలం; విధి ప్రేక్షకుడు కూచుని చూస్తూ ఎవడు తప్పు చేస్తున్నాడా అని గమనిస్తుంది; మలమల మాడ్చే ఎండనుండి నీడనిచ్చే సమాధులు నాటకం అయిపోయిన తర్వాత వాలిపోయే తెరల్లాటివి; అలా ఈ గుర్రపు పందేల ఆట ఆడుతూ తాత్కాలికంగా…
-
ప్రతి రాత్రీ అవి బోధించేది… విలియం హాబింగ్టన్, ఇంగ్లీషు కవి
అమూల్యమైన మణులు వేలాడుతున్న ఆ తేజోవంతమైన ఖగోళాన్ని రాత్రి దర్శించినపుడు, అది నాకు ఇథియోపియన్ పెళ్లికూతురులా కనిపిస్తుంది. నా మనసు రెక్కలు విప్పుకుని ఒక్కసారి ఆకాశంలోకి ఎగురుతుంది దిశాంతాలకు వ్యాపించిన రోదసి ఖండాల్లో సృష్టికర్త అద్భుత ఆవిష్కరణలు చూడ్డానికి. ఆంత ప్రకాశమానమైన ఆకాశమూ ఏ మంటలూ విరజిమ్మదు; నిశ్శబ్దంగానైనా, అతివిపులంగా భగవంతుని ఉనికిని ప్రదర్శిస్తుంది కనిపించే ఏ చిన్న నక్షత్రమూ మానవుని దృష్టికి దూరంగా కనిపించనంత చిన్నగా తన వెలుగులు ఉపసంహరించుకోదు. కానీ మనం ఓపికగా గమనించినట్టయితే…
-
సానెట్ -30… షేక్స్పియర్
(This is Shakespeare’s 400th Death Anniversary Year) నేను పదే పదే మౌనంగా మధురమైన ఊహలలోతేలుతూ జరిగిపోయిన సంఘటనలు గుర్తుచేసుకుంటున్నప్పుడు నేను కోరుకున్న చాలా వస్తుచులు దక్కనందుకు చింతిస్తాను ఆ పాత బాధలతోపాటు, జీవితం వృధా అయ్యిందని కూడా. మృత్యువు కౌగిలిలో తెలవారని రేయి గడుపుతున్న ఆప్తమిత్రులకు ముందెన్నడూ లేనంతగా శోకిస్తూ కన్నీరు కారుస్తాను ఎప్పుడో మరిచిపోయిన భగ్నప్రేమకై రోదిస్తూ కనుమరుగైన ఎన్నో సుందరదృశ్యాలకై వగస్తాను. ఒక బాధ తర్వాత మరొక బాధ వల్లెవేసుకుంటూ నేను…
-
ఒక ముసలి తల్లి బతుకుపాట… WB యేట్స్, ఐరిష్ కవి
(విలియం బట్లర్ యేట్స్ 150 వ జన్మదిన సందర్భంగా) నేను పొద్దు పొడుస్తూనే లేస్తాను, మోకాళ్లమీద ఆనుకుని నిప్పురవ్వ నిలిచి బాగా వెలిగేదాకా పొయ్యి ఊదుతాను; తర్వాత ఇల్లు ఊడ్చి, అంట్లుతోమి,వంటవండుతాను చీకటిపడి చుక్కలు తొంగిచూసి మిణుకుమనేదాకా; పిల్లలు పొద్దెక్కేదాకా పడుక్కుని కలలు కంటుంటారు జుత్తుకీ, జాకెట్టుకీ ఏ రిబ్బన్లు జోడీ కుదురుతాయా అని, వాళ్ళకి రోజంతా పూచికపుల్ల పనిలేకుండా గడిచిపోతుంది జుత్తు గాలికి చెదిరితే చాలు, వాళ్ళు నిట్టూర్పులు విడుస్తారు నేను ముసలిదాన్ని కదా అని…
-
కాకతాళీయం… ఎఫ్. టి. కూపర్, అమెరికను
నానమ్మ పాత చేతికుర్చీలో కూచుని నిర్లిప్తంగా సమయం తెలీకుండా అల్లుకుంటోంది; శాంతంగా, అయినా గంభీరంగానే, ముగ్గుబుట్టతలతో గతకాలపు బాదరబందీలు నెమరువేసుకుంటోంది. మనవరాలు మోకాళ్ళమీద హాయిగా కూచుని నానమ్మ ముణుకుమీద మోచేయి ఆనించి ఏదో ముఖ్యమైన విషయాన్ని ఎలా చెప్పాలా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు ఇట్టే తెలిసిపోతోంది. అల్లికసూదులు టకటకమని కదిలిపోతున్నాయి నాజూకైన రెండు చేతులు కళ్ళని మూసీదాకా, సిగ్గుపడుతూ, మురిపెంగా ఆ అమ్మాయి అడిగింది “తాతయ్య పెళ్లిచేసుకోమని నిన్నెలా అడిగేరో చెప్పవా?” అని. ఒక్కసారి అల్లుతున్నదీ, గిరగిర…
-
రైతుని గమనించండి… అలెగ్జాండర్ పుష్కిన్, రష్యను కవి
ఇసక పర్రలలో స్వేచ్ఛాబీజాలు జల్లుతుంటే చుక్క పొడవకముందే నేను నడుస్తున్నాను; పాపం బానిస నాగళ్ళు విడిచిన చాళ్లలోకి స్వచ్చమైన, నిష్కల్మషమైన వేళ్ళు విత్తులు జల్లుతున్నాయి ఫలప్రదమైనది ఈ విత్తనము, తరాలను సృష్టిస్తుంది; కానీ, ఈ పంట నొర్లుకునేవాడు, వట్టి అహంకారపు జులాయి ఇప్పుడు నాకు అర్థం అయింది ‘వృధాశ్రమ’ అంటే ఏమిటో. ఓ శాంతియుత దేశాల్లారా, మీకు కావలసినంత మెయ్యండి మీ రెన్నడూ అన్నార్తుల ఆక్రందనలకి బదులు పలకలేదు ! స్వాతంత్ర పోరాటాల పిలుపులకి గొర్రెలా బదులు పలికేది?…
-
భవిష్య వాణి… వాల్టర్ వాన్ దెర్ వొగెల్వైడ్, జర్మను కవి
సందేహాలు చుట్టుముట్టి, సతమతమౌతూ, నేను ఒక్కడినే చాలాసేపు ప్రశాంతంగా కూచుని ఆలోచించేను ఆమె ఆలోచనలనుండి ఎలా విముక్తి పొందాలా అని చివరికి ఒక ఆలోచన సాంత్వననిచ్చేదాకా. నిజానికి దీన్ని పూర్తిగా సాంత్వన అని అనలేము, చిన్నపిల్లలు కూడా దీనికి శాంతించరేమో, అంత చిన్నది; అదేమిటో మీకు చెబితే, నన్ను మీరు వెక్కిరిస్తారు: అయినా ఏ కారణం లేకుండా ఎవ్వరూ సుఖంగా ఉండలేరు కద! ఇవాళ ఒక పూరిపుడక నాకు ఆనందాన్నిచ్చింది; అలాంటి ఆనందాన్ని నేనింతవరకు ఎరగను ఆటలో…
-
నేలపుత్రుని సమాధి… జార్జి మౌంటెన్, కెనేడియన్
ఆకాశం ప్రకాశంగా ఉంది, సన్నని ఈ అఖాతం ప్రశాంతంగా ఉంది; ఈ రక్షితప్రదేశం లో ఏ చప్పుడూ వినిపించడం లేదు,అప్పుడప్పుడు దేవదారు వృక్షాలలో గాలి గుసగుసలు తప్ప… విశ్రాంతి ఎరుగని ఈ మనిషిని చూడనూ లేదు, అతని పనితనం లేశమైనా ఎరుగను. నే నలా పొదల్లో తిరుగుతూ దారితప్పి వచ్చేను ఈ చిన్ని చోటుకి, ఎవరూ చూసిఉండని ఈ చోటుని చెల్లాచెదరైన గూటికొమ్మలు బహిర్గతం చేసేయి ఇక అంతా విశ్రాంతే! అదిగో, అదే … ఈ నేలపుత్రుని సమాధి…