వర్గం: కవితలు
-
పల్లీయుల నమ్మకం… నార్మన్ గాలె, ఇంగ్లీషు కవి
పచ్చిక పచ్చగా ఉండే ఇక్కడ, ఈ పల్లె గర్భంలో జీవితం ఎప్పటిలాగే అంత హాయిగానూ ఉంటుంది. దైవంపై నమ్మకం పచ్చిగానే ఉంది ప్రాభాత ఘంటారావాలు పాలుపోసుకుంటున్న కంకులపై అతని తలపుతో తేలియాడుతున్నాయి. భగవంతుడు వర్షమై వస్తాడు పంటలు పుష్కలంగా పండుతాయి. ఇదే పల్లియుల నమ్మకం అన్ని విశ్వాసాలనూ మించినది. . నార్మన్ గాలె (4 March 1862 – 7 October 1942 ) ఇంగ్లీషు కవి . The Country Faith Here in…
-
ప్రార్థన అంటే… జేమ్స్ మన్ గమ్ రీ, ఇంగ్లీషు కవి

పైకి పలికినా, లోపలే అనుకున్నా ప్రార్థన అంటే ఒక ఆత్మ నిర్వ్యాజమైన కోరిక, గుండె లోతుల్లో దాగి కొట్టుమిట్టాడే తేజస్సు నలుదిక్కులా ప్రసరించు సరళి ప్రార్థన ఒక నిట్టూర్పు వెనక నున్న భారం సన్నగా జాలువారే కన్నీటి బిందువు, దైవం తప్ప మరెవ్వరూ ప్రక్కన లేనిచోట కన్నులు మెల్లగా పైకి ఎత్తి చూసే తీరు. ఒక్క శిశువుల పెదాలు మాత్రమే చేయగల అతి సరళమైన సంభాషణ ప్రార్థన; మహోత్కృష్టమైన సంకీర్తనలు చేరగల అత్యున్నత పీఠం ప్రార్థన; తన…
-
నామకరణం… మేరీ లాంబ్, ఇంగ్లీషు రచయిత్రి
నాకో చెల్లెలు పుట్టింది; ఆమెను మొదటముద్దాడినవారి పక్కన నేనున్నాను. నర్సు పొత్తిళ్ళలోపెట్టి తెచ్చి నాన్నకిచ్చినపుడు, ఆ చిన్నిపాపని చూసి నాన్నకళ్ళలో ఎంతవెలుగు కనిపించిందో! దానికి త్వరలోనే పేరుపెట్టాలి. నాన్న నాకు అవకాశం ఇచ్చారు మా చెల్లికి నన్నే పేరుపెట్టమని. ఏ పేరు పెడితే తనకు నచ్చుతుంది చెప్మా! చార్లెట్, జూలియా, లేక లూయిజా? ఏన్, లెదా మేరీ? అవి అందరూ పెట్టుకునేవే. జోన్ అంటే, ఆడవాళ్ళకి మరీ సాంప్రదాయకంగా ఉంటుంది, పైగా జేన్ అంతకంటే బాగుంటుంది. కానీ…
-
మౌనప్రేమ… సర్ ఫిలిప్ సిడ్నీ, ఇంగ్లీషు కవి
నేను ఎవరుపడితే వాళ్ళదగ్గర ప్రేమ ప్రకటించను గనుక, లేదా కొన్ని ప్రత్యేకమైన దుస్తులు ధరించను గనుక, జుత్తుని కొన్ని విధాలుగా అలంకరించుకోను గనుక, ప్రతి మాటలోనూ నిట్టూర్పులు విడిచిపెట్టను గనుక … ఈ సొగసుకత్తెలు, అలవాటుగా ప్రేమనిప్రకటించేవారి పెదాలపై నిట్టూర్పులకు అలవాటు పడి “ఏమిటి? వాడా?” అంటుంటారు నా గురించి:” నేను ఒట్టేసి చెప్పగలను అతనికి ప్రేమంటే తెలీదు. లాభంలేదు. అతన్ని ఒక్కణ్ణీ ఉండనీండి.” ఇప్పటికీ అలాగే అనుకుంటారు… స్టెల్లా కి నా మనసు తెలిస్తే… నిజమే,…
-
పోర్షియా చిత్రపటం… విలియం షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం ఇది పోర్షియా సుందరి ప్రతిమా? ఏ దివ్యాంశ సంభూతుడు సృష్టికి అతిదగ్గరగా రాగలిగేడు? ఆ కళ్ళు కదుల్తున్నాయా? లేక, నా కనుగుడ్లమీద కదులుతూ అవి కదులుతున్నట్టు అనిపిస్తోందా? అవిగో విప్పారిన పెదాలు, మధురమైన శ్వాసతో దూరమయ్యాయి; ఎంత అందమైన పలువరుస అంత ప్రియమైన స్నేహితులని ఎడబాయ వలసివచ్చిందో గదా! ఇవిగో ఆమె కురులు, చిత్రకారుడు సాలీడులా ఆడుకున్నాడు; పురుషుల హృదయాలను కొల్లగొట్టడానికి పసిడివన్నె వల అల్లేడు, సాలెగూడులో…
-
స్త్రీల బృందగానం… ఏరిస్టొఫేన్స్, గ్రీకు కవి

వాళ్ళకి మనం పీడలమని మగవాళ్ళెప్పుడూ మనని నిందిస్తుంటారు: వాళ్ళ దుఃఖాలన్నిటికీ మూలకారణం మనమేనని పదే పదే చెబుతుంటారు; యుద్ధానికీ, కలహాలకీ, రక్తపాతానికీ, అన్ని తుంటరి పనులకీ, ఒకటేమిటి, కారణం మనమే! వాళ్ళకి మనం అంత పీడలమైనపుడు, మనని పెళ్ళెందుకు చేసుకుంటారు చెప్పు? మనల్ని ఇళ్ళలో భద్రంగా దాచుకుని మనగురించి అంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటారు? మనం పొరపాటున బయటకి వెళ్ళవలసి వస్తే ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఎందుకుండలేరు? హమ్మయ్య పీడ విరగడయ్యిందని దేముడికి ధన్యవాదాలు చెప్పకుండా,…
-
ప్రతి అందమైన వస్తువూ… మైకేలేంజెలో, ఇటాలియన్ కవి

ఏ అందమైన వస్తువైనా మనుషుల్లో నిష్కల్మషమూ, యోగ్యమూ ఐన కోర్కెలు రగులుస్తందంటే, అందానికి ఆటపట్టైన ఈ భూమ్యాకాశాల మధ్య, అది నా ప్రేయసి వంటిదై ఉండాలని నమ్ముతాను; ఎందుకంటే అంత అందమైన ఆమెలో, (ఆమె సమక్షంలో సర్వం మరిచిపోతాను), నాకు భగవంతుని అద్భుతమైన సృష్టినైపుణ్యం కనిపిస్తుంది, నాకు ఏ ఇతర వస్తువులగురించీ ధ్యాసే ఉండదు ఆమె ప్రేమలో మగ్నమై ఉన్నంతవరకు. అందులో వింతేమీ లేదు, ఎందుకంటే ఆ ప్రభావం తప్పించుకోడం నా వశంలో లేదు, ఆమె కనులు…
-
శిసుస్తవం… విలియం కాంటన్, ఇంగ్లీషు కవి
శిశుస్తవంగా నే చెప్పదలుచుకున్నదేమంటే దేముడు ముందు మనిషిని సృష్టించాడు, రెండోసారి అంతకంటే మెరుగుగా స్త్రీనీ, మూడోసారి అత్యుత్తమైనదీ సృష్టించేడు. అతని సృష్టిలో అన్నిటిలోకీ అందమైనవీ దివ్యత్వం తొణికిసలాడేదీ శిశువులే. ఇక్కడి ఏ వస్తువూ అంతకంటే ప్రియమైనదీ,సుందరమైనదీ కాదు. భగవంతుడు తన సృష్టి అంతా సంతృప్తిగా చూసినా శైశవాన్ని మించిన గులాబి పువ్వు మరొకటి లేదు. తర్వాత రోజుల్లో పిల్లలగురించి ఇలా చెప్పబడింది: వాళ్ళవంటివారికి తప్ప స్వర్గంలో ప్రవేశం లేదు. ఓ చిన్ని పాపాయీ! ముళ్ళు వికసించడం చూస్తున్న…
-
భావనా పటిమ… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరం ఒక పిచ్చివాడు, ఒక ప్రేమికుడు, ఒక కవీ ముగ్గురూ గాఢంగా, నిగూఢంగా ఆలోచించగలరు; నరకం పట్టగలిగినదానికంటే కూడా భూతాల్ని పిచ్చివాడు చూస్తే, ఒక ప్రేమికుడు అంత మైమరపుతోనూ ఒక ఈజిప్టు భామ కనుబొమల్లో హెలెన్ సౌందర్యాన్ని చూడగలడు; ఇక కవి కన్నులు, ఒక పూనకం వచ్చినట్టు ఆవేశంలో ఊగిపోతూ భూమ్యాకాశాలని అట్నించి ఇటూ ఇట్నించి అటూ పరీక్షిస్తూ గమనిస్తే, తనకి తెలియని ఆకారాలకి కవి కలం ఒక రూపాన్నిచ్చి,…
-
నా మనసు ఎగిరి గెంతులేస్తుంది… విలియం వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి
ఆకాశంలో హరివిల్లు చూడగానే నా మనసు ఎగిరి గెంతులేస్తుంది; నేను పుట్టినపుడూ అలాగే ఉంది, నేను పెద్దవాణ్ణి అయేకా అదే తీరు, నేను ముసలివాణ్ణి అయినా అంతే, నేను చనిపోయిన తర్వాత కూడా! పసితనమే పెద్దరికాన్ని తీర్చిదిద్దుతుంది; రాబొయే రోజులు ఒకదాని వెంట ఒకటి అతి సహజంగా గడిచిపోవాలని భావిస్తున్నాను. . విలియం వర్డ్స్ వర్త్ (7 April 1770 – 23 April 1850) ఇంగ్లీషు కవి “My heart leaps up” . My…