వర్గం: కవితలు
-
సానెట్ 25… షేక్స్పియర్
గ్రహాలు అనుకూలంగా ఉన్న అదృష్టవంతుల్ని వాళ్ళు పొందే సమ్మానాలకీ, బిరుదులకీ గర్వపడనీ, అటువంటి అదృష్టానికి నోచుకోని నాలాంటి వాడు అటువంటి వాటి సత్కారాలలో ఆనందాన్ని వెతుక్కోలేడు. రాకుమారుల అనుగ్రహానికి పాత్రులైనవారు సూర్యముఖిలా తమ సర్వశక్తులూ వాళ్లకే అంకితం చేసి బ్రతుకుతారు; దానితోపాటే వాళ్ల అహంకూడా సమాధిచేసుకుంటారు, వాళ్ళు కన్నెర్ర చేస్తే తమ గొప్పదనం మటుమాయం కదా మరి. పాపం ఎన్ని వేలసార్లు విజయాన్ని సమకూర్చిపెట్టినా పరాక్రమవంతుడైన గొప్ప యోధుడు ఒక్కసారి ఓటమిపాలైతే సమున్నత గౌరవ పీఠం నుండి…
-
సానెట్ 24 … షేక్స్పియర్
నా నేత్రాలు చిత్రకారుడి పాత్ర ధరించి నీరూపు రేఖవిలాసాన్ని నా గుండేలోకి దోచుకున్నాయి; ఈ శరీరపు చట్రంలో దానిని బిగించాయి. చిత్రకారుడి ఆలోకనంలో అది కళాత్మక సృష్టి. నీ నిజమైన చిత్రం ఎక్కడ ఉందో నువ్వు చూడాలని చిత్రకారుడు అభిలషిస్తునప్పటికీ; నా మనో మందిరంలో ఇప్పటికీ వేలాడుతున్న చిత్రానికి తలుపులు తెరిచేవి నీ మెరిసే కళ్ళే. ఇప్పుడు చూడు కళ్ళు కళ్లకి ఏమి ఉపకారం చేశాయో: నా కళ్ళు నీ చిత్రాన్ని గీసాయి; నీ కళ్ళు నాకు…
-
సానెట్ 23… షేక్స్పియర్
రంగస్థలి మీద నిపుణతలేని నటుడు భయంతో తన సంభాషణలు మరిచిపోయినట్టు; ఒక ముక్కోపికి పట్టరాని కోపం వచ్చి అతని బలమే, బలహీనతై కూలబడినట్టు; నేను, నా మాటలు నమ్మరేమోనన్న భయంతో ప్రేమ సంసర్గాన్ని తగురీతిలో స్తుతించలేకున్నాను అతిశయించిన ప్రేమ బరువుతో నలిగిన నా మనసు తనకున్న సహజమైన బలాన్ని కోల్పోతోంది. ప్రేమని సమర్థిస్తూ, ప్రతిఫలాన్ని అన్వేషిస్తూ ఈ నాలుక ఇంతవరకు పలికిన పలుకులన్నిటికంటే ఇకపై, నా కవితలే తమ పద విస్తృతితో ఈ మనసు చెప్పదలుచుకున్నదంతా మౌనంగా…
-
సానెట్ 21… షేక్స్పియర్ ఇంగ్లీషు కవి

కవితా కన్యలాగే నేనూను అందమైన బొమ్మని చూడగానే కవిత్వం అల్లలేను; నిన్ను ప్రకృతే ఒక అలంకారంగా సింగారించుకుంటోంది. ప్రతి అందమూ నీ అందంతో సరిపోల్చుకుంటున్నాయి గర్వంగా చెప్పుకునే అందాల జంటలు ఏర్పడుతున్నై, సూర్యుడూ-చంద్రుడూ, ఈ భూమీ-రత్నగర్భయైన సముద్రం, వసంతంలో చిగిర్చే తొలిపూలవంటి అపురూపమైన వస్తువులతో మేదినీవలయ పరివేష్టితమైన ఈ రోదసి నిండి ఉంది. నా ప్రేమ ఎంత సత్యమో అంత సత్యంగా రాస్తాను నా మాట నమ్ము, ఏ తల్లి కన్న బిడ్డైనా అందంగా ఉన్నట్టు నా…
-
సానెట్ 19 … షేక్స్పియర్
సర్వభక్షకీ కాలమా! సింహపు గోరుసైతం మొండిచెయ్యగలవు, భూమి తను సృష్టించిన అందాల్ని హరించేలా చెయ్యగలవు బాగా కోపించి ఉన్న పులినోట్లోంచి కోర పెకలించగలవు చిరంజీవి ఫీనిక్స్ నిసైతం దాని రక్తంలోనే ఆహుతిచెయ్యగలవు; ని రాకపోకలతో ఋతువులానంద దుఃఖ హేతువులు చెయ్యగలవు వడి అడుగుల కాలమా! నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో మిగతా ప్రపంచాన్నీ అక్కడి అశాశ్వతమైన సొగసుల్నీ. కానీ, నువ్వొక్కటి మాత్రం చెయ్యకుండా నిన్ను శాసిస్తున్నాను: నా ప్రియతమ అందమైన కనుబొమలు నీ చేతులతో సరిదిద్దకు నీ…
-
సానెట్ 17… షేక్స్పియర్
రానున్న కాలాల్లో నా కవితలెవడు నమ్ముతాడు వాటి నిండా నీ అందంగురించిన విశేషాలే ఉంటే? ఒక్క దైవానికి తెలుసు; నీ శరీరాన్ని భద్రపరిచిన ఆ సమాధి నీ అందంలో సగాన్నికూడా ప్రకటించలేదు. నేను నీ కన్నుల అందాన్ని గురించి వ్రాయగలిగితే, ఒక్కొక్క కవితలో చెప్పలేనన్ని నీ సొగసులూ వర్ణిస్తే, రాబోయే రోజుల్లో ప్రజలు అంటారు,”ఈ కవి అబద్ధాలకోరు. అటువంటి అందాలు ఈ భూమి మీద ఇంతవరకు పుట్టలేదు.” అని. కాలంతో పాటు రంగు వెలిసిన నా కాగితాలని…
-
సానెట్-16 … షేక్స్పియర్
కాబట్టి, నిరంకుశమైన కాలం మీద బలహీనమైన నా కవితలకంటే, మిక్కిలి బలంగా నువ్వే ఎందుకు ఎదురు దాడి చెయ్యకూడదు? నీ జవసత్త్వాలుడిగినా బలంగా నిలవకూడదు? అనువైన ఈ క్షణాలని మహదానందంగా గడుపు; ఎవరికీ మనసు అర్పించని ఎన్నో యువతీ మనోద్యానాలున్నాయి పవిత్రమైన కోరిక కోరినపుడు, ప్రాణప్రదమైన పూలందించగలవు నీ పోలికలున్న చిత్తరువులకంటే ఎక్కువపోలికలతో. జీవితం, వయసుతెచ్చే ముడుతల్ని సరిదిద్దవలసి వచ్చినపుడు అటు కాలలేఖిని గాని, ఇటు “అ-ఆ”లు దిద్దుతున్న నా కలానికిగాని తరతరాల దృష్టిలో నిన్ను శాశ్వతంగా…
-
సానెట్ -15 షేక్స్పియర్
పుట్టి, పెరిగి, సంపూర్ణత సాధించే ప్రతిదానికీ దాని పరిపక్వత క్షణికమే అన్న ఆలోచన వచ్చినపుడు; ఈ ప్రపంచం కేవలమొక నాటకరంగమనీ, దానిపై నక్షత్రాలు తమ రహస్య ప్రభావాన్ని చూపిస్తాయనీ అనుకుని, అవే నక్షత్రాలను అద్దుకున్న ఆకాశపు మంచిచెడుల ప్రభావంతో మనుషులందరూ మొక్కలెదిగినట్టు ఎదగడం చూసినపుడు, వాళ్ళ యవ్వనపు పసరు వయసు వాటాడువరకు చాటుతూ అతికష్టంగా వాళ్ళ జ్ఞాపకాల్లోంచి తప్పించడం గమనించినపుడు; భూమిమీద మనుగడ క్షణికమన్న భావన తళుక్కుమనగానే నీ యవ్వన శోభ నా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది.…
-
సానెట్- 14 … షేక్స్పియర్
అక్కడికి నేనేదో నక్షత్రాలను చూసి చెబుతానని కాదు అయినప్పటికీ, నాకు కొంత ఖగోళజ్ఞానం ఉంది, కానీ అది మంచి జరుగుతుందా, చెడుజరుగుతుందా, ఏ అంటురోగాలతో ఎంతమంది చస్తారు, ఈ ఏడు ఎలా ఉంటుంది చెప్పలేను; నిముషాలతో సహా భవిష్యత్తు చెప్పలేను; ఎవరి మట్టుకు వాళ్ళకి రాబోయే విపత్తులూ, మంచీ చెడూ లేదా రాచబిడ్డలకి అంతా సజావుగా వెళ్తుందా లేదా చెప్పలేను ఆకాశంలో గ్రహాల గమనాన్ని పడికట్టు వేసి. కానీ, నాకు తెలిసినదంతా నీ నుండే గ్రహిస్తాను అక్కడి…
-
సానెట్ -13…. షేక్స్పియర్
ఓహ్, నీకు నువ్వే యజమానినంటావా! కానీ, మిత్రమా, ఇక్కడ జీవించినంత కాలమూ నువ్వు స్వతంత్రుడివి కావు. రాబోయే చరమాంకానికి నువ్వు సిద్ధపడాల్సిందే అందమైన నీ రూపాన్ని మరొకరికి అప్పగించి. నువ్వు తాత్కాలికంగా విహించిన ఈ సౌందర్యం ముగిసిపోదు; తర్వాత నువ్వు గతించినా, నీ కడుపున పుట్టిన బిడ్డ నీ రూపాన్ని పుణికిపుచ్చుకున్నప్పుడు నువ్వు నువ్వుగా మళ్ళీ పునర్జీవిస్తావు. అయినా, అంత అందమైన ఇంటిని ఎవరు మట్టుకు పాడుపెడతారు? పెనుతుఫాను గాలుల భీభత్సం నుండీ శాశ్వతమైన మృత్యుశీతలం నుండీ…