వర్గం: కవితలు
-
మనిషి విశ్వంతో… స్టీఫెన్ క్రేన్, అమెరికను కవి
మనిషి విశ్వంతో అన్నాడు: “ప్రభూ! నేను ఉపస్థితుడనై ఉన్నాను.” “అంతమాత్రంచేత,” పలికింది విశ్వం సమాధానంగా “ఆ వాస్తవం, నీ అస్తిత్వాన్ని కొనసాగించడానికి నాలో ఏ విధమైన నిబద్ధతా కలిగించడంలేదు.” . స్టీఫెన్ క్రేన్ November 1, 1871 – June 5, 1900 అమెరికను కవి . . A Man Said to the Universe . A man said to the universe: “Sir I exist!” “However,” replied the universe,…
-
ఒక హిమ రాత్రి … బోరిస్ పాస్టర్ నాక్, సోవియట్ రష్యా
మంచు కురుస్తూ, కురుస్తూ ఉంది, ప్రపంచమంతటా సృష్టీ ఈ మూలనుండి ఆ మూలకి మంచుతో కప్పబడింది. మేజా మీద ఒక కొవ్వొత్తి వెలుగుతోంది; ఒక కొవ్వొత్తి మండుతోంది. వేసవిలో దీపంచుట్టూ చేరి పురుగులు తమ రెక్కలు కొట్టుకున్నట్టు ఆరుబయట సన్నని తీగసాగిన మంచు పలకలు కిటికీ అద్దానికి కొట్టుకుంటున్నాయి. మంచు తుఫాను గాజు తలుపుమీద బాణాల్లా, శంఖాల్లా అకృతులు రచిస్తోంది. మేజా మీద ఒక కొవ్వొత్తి వెలుగుతోంది; ఒక కొవ్వొత్తి మండుతోంది. వెలుగునిండిన గదిలోపల, కప్పుమీద చిత్రంగా…
-
సానెట్ 04 … ఏడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
(ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే 66వ వర్ధంతి సందర్భంగా) * నీ రూపాన్నీ, దాని గురించి నే కన్నకలలతో సహా నా జ్ఞాపకాలు పరిభ్రమించడానికి అనుమతించేది ఈ సిగరెట్టు కాల్చడం పూర్తయీదాకా మాత్రమే. నేలమీద నుసి నిశ్శబ్దంగా రాలుతుంటే నేపథ్యంలోని జాజ్ సంగీతంతో కలిసి చలిమంట వెలుగులో ముక్కలు ముక్కలుగా క్రీనీడలు గోడమీద వంకరలుపోతూ కత్తిలా పొడవుగా సాగేవరకే. ఒక లిప్త కాలం, ఆ తర్వాత అంతా ముగిసిపోతుంది. ఆ తర్వాత శలవు. వీడ్కోలు. కల కనుమరుగౌతుంది.…
-
కలలోని బాధ.. రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి
. నేను అడవిలోకి మరలిపోయాను, నా గీతం చెదరగొట్టబడిన ఆకులతోపాటు చెల్లాచెదరైపోయింది. ఆ అడవి అంచులకి ఒకసారి నువ్వు వచ్చేవు. (ఇది నా కల) వచ్చి చూసి చాలసేపు ఆలోచనలోపడ్డావు. కోరిక బలంగా ఉన్నా, లోపలికి అడుగుపెట్టలేదు. “ధైర్యం చాలడంలేదు, అతని అడుగులు చాలదూరం దారితప్పేయి… అతని తప్పు సరిచేసుకుంటె అతనే నన్ను కోరుకుంటాడు” అన్నట్టు వ్యాకులంగా ఉన్న నీ తలను అయిష్టంగా తాటించేవు. ఏంతో దూరం లేదు, చాలా దగ్గరగానే నిలబడి ఇదంతా…
-
మహానగరం… కన్స్టాంటిన్ కవాఫిజ్, గ్రీకు కవి
నువ్వు అన్నావు:”నేను వేరేదేశం వెళిపోతాను, మరో తీరానికి చేరుకుంటాను, ఈ నగరం కంటే మెరుగైనది మరొకటి వెతుక్కుంటాను. నేను ఏది ప్రయత్నించినా అది విఫలమౌతూనే ఉంది నామనసు జవజీవాలు తప్పి, సమాధిచెయ్యబడినట్టుంది. ఎన్నాళ్ళని ఇక్కడ నా మనసుని బూజుపట్టేలా ఉగ్గబట్టుకోను? నేనెటు తిరిగినా, ఏ దిక్కుచూసినా, చివికి జీర్ణమైన నా జీవితమే గోచరిస్తోంది. నేను ఇన్నాళ్ళూ ఇక్కడే గడిపి నా జీవితాన్ని వృధాచేసుకున్నాను, పూర్తిగా సర్వనాశనం చేసుకున్నాను.” నీకెన్నడూ మరొక కొత్తదేశం కనిపించదు. మరో తీరమూ అందదు.…
-
కవిత్వస్పృహ… పాబ్లో నెరూడా, చిలియన్ కవి
సరిగ్గా ఆ వయసులో కవితాస్పృహ నాలో ప్రవేశించింది… నన్ను వెతుక్కుంటూ. నాకు తెలీదు. అదెక్కడనుండి వచ్చిందో మంచులోంచి వచ్చిందా, ప్రవాహంలోంచి వచ్చిందా తెలీదు. అదెలా వచ్చిందో ఎప్పుడొచ్చిందోకూడా తెలీదు. నిజం. అవి గొంతులు కావు, అవి మాటలు కావు, నిశ్శబ్దమూ కాదు, నడుస్తున్న నన్ను రమ్మని ఆజ్ఞాపించింది చీకటికొమ్మలమాటునుండీ, అకస్మాత్తుగా అన్నిచోటులనుండీ వీశృంఖలమైన అగ్నికీలలలోంచో ఒంటరిగా తిరిగి వస్తున్నపుడో, ఏ ముఖమూలేక పడున్న నన్ను ఒక్కసారిగా తాకింది. నాకేం చెప్పాలో తెల్లీలేదు నోటమాటలు రాలేదు ఎలా పలకరించాలో…
-
పళ్ళు కొయ్యవద్దు… ఏడ్నా సెంట్ విన్సెంట్ మిలే
ఎన్నడూ, ఎన్నడూ కొమ్మనుండి పళ్ళు కొయ్యవద్దు కోసి తట్టల్లోకి ఏరుకో వద్దు. ప్రేమతో తినేవాడు పండు ఎక్కడ వేలాడితే అక్కడే తినాలి, కొమ్మలు రెల్లు పోచల్లా అలవోకగా వంగితే వంగనీ పండు గడ్డిలో మెరుస్తూనో, చెట్టుకి వాడిపోతూనో కనిపించనీ, ప్రేమతో తినాలనుకున్నవాడు తీసుకోగలిగింది తనపొట్ట ఎంత పడితే అంత మాత్రమే. జేబుల్లో ఏదీ దాచుకోకూడదు పైమీద కండువాల్లోనూ పట్టుకోకూడదు ఎన్నడూ పళ్ళు చెట్టునుండి కోసి తట్టల్లోకీ తొట్టెల్లోకీ ఏరుకోకూడదు. ప్రేమ లేని ఋతువు తెగులు పట్టిన తోటలో…
-
ఒడంబడిక … ఏజ్రా పౌండ్, అమెరికను కవి
వాల్ట్ వ్హిట్మన్! నేను నీతో ఒడంబడిక చేసుకుంటున్నాను — నిన్ను చాలా కాలం అసహ్యించుకున్నాను. నేను నీ దగ్గరకి ఒక వయసొచ్చిన కొడుకు మూర్ఖుడైన తండ్రిదగ్గరకి వచ్చినట్టు వచ్చేను ఇపుడునాకు నీతో స్నేహం చెయ్యగల విజ్ఞత వచ్చింది కొత్త చెట్లను నరికింది నువ్వు; వాటిని వస్తువులుగా మలచవలసిన సమయం ఆసన్నమయింది. మనదగ్గిర ఒక చేవగల కర్ర, వేర్లూ ఉన్నాయి మనిద్దరం ఒక అంగీకారానికి వద్దాం. . ఎజ్రా పౌండ్ (30 October 1885 – 1 November…
-
స్మృతిగీతం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
చారెడేసి ఉన్న నీ కనులని నేలలో భద్రంగా ఎక్కడో రహస్యంగా దాచనీ. సన్నని నీ వేళ్ళు, మెత్తనైన అందమైన వింతవన్నెల నీ కురులూ… ఇవన్నీ ఏదో విధంగా తప్పకుండా నేలలోని రహస్యమాళిగగుండా పైకి లేస్తాయి; కానీ, అందుకుకాదు గుండెపగిలి సర్వమూ శూన్యమై కళ్ళప్పగించి చూస్తూ నేనిక్కడ కూచున్నది; అందంగా అలంకరించినట్టు నీ చిన్ని ఎముకలను కప్పిన నీ నునులేత చర్మం వాతావరణంలోకి పువ్వులా విచ్చుకుంటుందని. కానీ, నీ గొంతు… నేలపొరల్లో మంద్రంగా పరిగెత్తే నీటి ఊటలు గాని,…
-
చరమ శ్లోకం… కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి
నిలు బాటసారీ, క్రైస్తవుడా! నిలు, దేవుని బిడ్డా సున్నితహృదయుడవై చదువు. ఈ మట్టిక్రింద ఒక కవి పరుకున్నాడు, కాదు, ఒకప్పుడు అలా కనిపించేవాడు ఓహ్! ఒక్కసారి S T C కోసం ప్రార్థన చెయ్యి: అతను అనేక సంవత్సరాలు కష్టపడి కష్టపడి బ్రతుకులో చావు ఉచూసేదు; చావులో బ్రతుకుచూడనీ అని. ప్రశంసకి కరుణనీ, కీర్తికి క్షమాపణనీ క్రీస్తుద్వారా అర్థించాడు. నువ్వూ అదే ప్రార్థించు. . శామ్యూల్ టేలర్ కోలరిడ్జ్ 21 October 1772 – 25 July…