వర్గం: కవితలు
-
రసగీతి… విలియం ఓల్డిస్ , ఇంగ్లండు
క్షణం తీరికలేక, కుతూహలంతో, దాహంతో తిరిగే ఓ ఈగా, నేను తాగుతున్నట్టుగానే, నెమ్మదిగా ఈ పానీయం తాగు; నా కప్పు మీదకి నిన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాను, నువ్వు దీన్ని తాగగలిగితే, సొక్కి సోలు; నీ జీవితంనుండి పొందగలిగినంత పొందు, జీవితం చాలా క్షణికం, త్వరగా కరిగిపోతుంది. నీదీ నాదీ ఒక్క తీరే, కాలం త్వరగా అస్తమదిక్కుకి పరిగెడుతుంది; నీది ఒక్క వసంతమే, నాదీ అంతకంటే ఎక్కువేం కాదు, కాకపొతే అది మూడు ఇరవైల వసంతాలు తిరుగుతుంది; ఆ…
-
ప్రకృతి… HW లాంగ్ ఫెలో, అమెరికను కవి
నిద్రపుచ్చడానికి … సగం ఇష్టంగా, సగం అయిష్టంగా నేలమీద తను ఆడుకుంటూన్న వస్తువులనన్నీ నేలమీదే వదిలేసి, అయినా తెరిచిఉన్న తలుపులోంచి వాటిని చూస్తూ, పూర్తిగా ఊరడింపూలేక, వాటికి బదులు ఇస్తానన్నవి అంతకంటే మంచివైనా సంతోషం కలిగిస్తాయన్న హామీ లేక, బాధపడే చిన్న పిల్లాడిని ఆ రోజుకి ఆటముగిసేక ప్రేమగా లాలిస్తూ చెయ్యిపట్టుకుని లాక్కువెళ్ళే పిచ్చితల్లిలా ప్రకృతికూడా మనతో సంచరిస్తుంది, మన ఆటవస్తువుల్ని ఒక్కటొక్కటిగా లాక్కుంటూ, మనల్ని చెయ్యిపట్టుకుని మన విశ్రాంతి స్థలానికి నెమ్మదిగా నడిపించి తీసుకుపోతుంది కళ్ళమొయ్యా…
-
నూత్న మహావిగ్రహం… ఎమ్మా లాజరస్, అమెరికను కవయిత్రి
అద్భుతమైన ఈ కవిత అమెరికా దేశపు నాయకత్వం 20 వశతాబ్దం మొదలు వరకూ పాటించిన ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది. చిత్రంగా అదే దేశపు నేటి నాయకుల ఆకాంక్షలూ, అభిప్రాయాలూ దానికి పూర్తిగా వ్యతిరేక దిశలో సాగుతున్నాయి. ఫ్రెంచి ప్రజల సౌహార్ద్ర సూచకంగా అమెరికనులకు బహూకరించబడిన ఈ రాగితో చేసిన విగ్రహాన్ని గుస్తావ్ ఈఫెల్ నిర్మించగా, అక్టోబరు 28, 1886 న జాతికి అంకితం చెయ్యబడింది. కవయిత్రి మరణించిన 15 సంవత్సరాలకు, 2003 లో Statue of Liberty పదపీఠాన…
-
ఈ సజీవ హస్తం… జాన్ కీట్స్, ఇంగ్లీషు కవి
ఇది చాలా చిత్రమైన కవిత. నిజానికి ఇది అసంపూర్ణ కవిత. కీట్స్ దీనిని తన అసంపూర్ణ కవితల రాతప్రతులలో రాసుకున్నాడు. ఈ కవిత కాలం సుమారుగా అక్టోబరు 1819. నిజానికి 18 అక్టోబరు 1819 న కీట్స్ కీ అతని ప్రేయసి ఫానీ బ్రౌన్ కీ నిశ్చితార్థం జరిగింది. వారిద్దరు వివాహం చేసుకునే అదృష్టానికి నోచుకోలేదు. అప్పటికే అతను క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. కీట్స్ కి తను ఎక్కువకాలం బ్రతకనని అప్పటికే తెలుసు. భయపడినట్టుగానే, రెండేళ్ళలో కీట్స్ చనిపోతాడు. అతనిమీద ఉన్న…
-
వెన్నెల… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ముదిమి పైబడిన తర్వాత నాకు బాధ అనిపించదు, చంద్రకాంతితో జ్వలిస్తూ సాగే కెరటాలు ఇకపై కోరలుసాచిన వెండి పాముల్లా నన్ను కాటెయ్యవు; రాబోయే రోజులు నిరుత్సాహపరుస్తూ విచారంగా గడుస్తాయి, అయినప్పటికీ, ముక్కలయ్యేది సంతుష్ట హృదయమే. మనసెప్పుడూ జీవితం ఇవ్వగలిగినదానికంటే ఎక్కువే ఆశిస్తుంది అది తెలుసుకోగలిగితే, సర్వమూ తెలిసుకున్నట్టే, ఒక విలువైన పాయమీద మరొకపాయగా కెరటాలు దొర్లిపడుతుంటాయి, కానీ సౌందర్యం మాత్రం స్థిరంగా నిలవక పలాయనం చిత్తగిస్తుంటుంది, అందుకే, ముదిమి పైబడినా, నాకు పెద్దగా బాధ అనిపించదు. .…
-
భగవంతుని వైభవం… గెరార్డ్ మేన్లీ హాప్కిన్స్, ఇంగ్లీషు కవి
ఈ సృష్టి అంతా భగవంతుని వైభవంతో నిండి ఉంది… కంపించే బంగారు రేకునుండి వెలువడే కాంతిపుంజంలా; అది గానుగలోంచి ఊరే నూనెలా కొద్దికొద్దిగా వస్తూనే అఖండమౌతుంది. మరి మనుషులెందుకు అతని అధికారాన్ని లెక్కపెట్టరు? తరాలు నడచి పోయాయి, నడుచుకుని పోయాయి, నడుచుకుంటూపోయాయి అందరూ తమ పనుల్లో, శ్రమలో, వేదనల్లో మునిగి తేలేరు; మనుషులుగా తమ ముద్ర వేసుకున్నారు, కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు: ఇప్పుడామట్టి అంతా ఖాళీ; పాదరక్షలుండడంతో కాళ్ళు తగిలినా పోల్చుకోలేవు. అయినప్పటికీ, ప్రకృతికిలో “నిండుకుంది” అన్న…
-
నిరాకరణ… జార్జి హెర్బర్ట్, వెల్ష్ కవి
ప్రశాంతంగా ఉన్న నీ చెవులలోకి నా ప్రార్థనలు చొరబడలేనపుడు; నా కవితలాగే, నా హృదయమూ ముక్కలై, నా గుండెనిండా భయాలు నిండి అంతా అస్తవ్యస్తమైపోయింది. వక్రించిన నా ఆలోచనలు, శీర్ణధనువులా, రెండుగా చీలిపోయాయి; వేటిత్రోవన అవిపోయాయి; కొన్ని సుఖాలవేటలో పోతే కొన్ని పోరాటాలకీ, ప్రమాదకరమైన ప్రయత్నాలవైపు మరలాయి. ఎక్కడికెళితేనేమిటి, అని అవి అంటుండేవి, రేయింబవళ్ళు చేసే వాడికోళ్లకు హృదయమూ, కాళ్ళూ చచ్చుబడిన తర్వాత? ఓ ప్రభూ! కనికరించి కనిపించు, కనిపించు, అయినా నువ్వు కనిపించవు. చిత్రమేమిటంటే, నువ్వు…
-
ప్రతి ఉదయం నవోదయం… సూసన్ కూలిడ్జ్ , అమెరికను కవయిత్రి
ఓ మనసా! పదే పదే పునరావృతమయే పల్లవిని విను! ప్రతిరోజూ ఒక నవోదయం! బాధలు ఎప్పటిలాగే ఉండనీ, చేసిన పాపాలే చెయ్యనీ, భవిష్యత్తులో కొత్త కష్టాలు రాబోనీ, బహుశా సరికొత్త వేదనలూ కలగనీ… కానీ రోజుని ప్రేరణ తెచ్చుకో, జీవితాన్ని కొత్తగా ప్రారంభించు. . సూసన్ కూలిడ్జ్ (January 29, 1835 – April 9, 1905) అమెరికను కవయిత్రి . . New Every Morning . Every day is a fresh beginning,…
-
నీకు వయసు పైబడిన తర్వాత… విలియమ్ బట్లర్ యేట్స్, ఇంగ్లీషు కవి
నీకు వయసు పైబడి, జుత్తు నెరిసి, నిద్రాళువువై, పొయ్యిదగ్గర చలికాచుకుంటూ తలూపేవేళ, ఈ పుస్తకం చేతిలోకి తీసుకుని తీరికగా చదువుకుంటూ, యవ్వనంలో నీ కనులెంత కోమలంగా, వాటి ఛాయలు ఎంత గంభీరంగా ఉండేవో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో. నువ్వు ఆనందంతోమురిసి మిసమిసలాడినపుడు నిన్నెందరు ప్రేమించేరో లెక్కలేదు నీ సౌందర్యాన్ని స్వచ్ఛమైన ప్రేమతోనూ, కపటంతోనూ ఆరాధించినవారున్నారు. కాని ఒక్కవ్యక్తి మాత్రం “దేహసంచారియైన నీ ఆత్మని” మనసారా ప్రేమించాడు ఆమ్రేడితమవుతున్న దుఃఖాలకి మారుతున్న నీ ముఖకవళికల్నీ ప్రేమించాడు. జ్వలిస్తున్న ఆ…
-
దాయాదుల పోరు… ఎలినార్ వైలీ, అమెరికను కవయిత్రి
ఒకసారి, మా ఆయన చిన్నతనంలో, వాళ్ళ నాన్నగారికి చుట్టాన్ననుకుంటూ ఒకాయన ఇంటికి భోజనానికి వచ్చేడు, అతను తొడుక్కున్న బట్ట వెలిసిపోయి, అతనికంటే పాలిపోయి ఉంది. అతను చూడడానికి గంభీరంగా ఉన్నా, దయాళువుగానే కనిపించాడు; గాయకుడు సెన్ లాక్ పేరుగలిగిన అతని నవ్వూ, అచ్చం అతనిలానే ఉంది. అతను బాగా మొగమాటపడుతూ, మర్యాదగా, నవ్వుతూ మాటాడేడు; “హేమంతం అడుగుపెట్టినదగ్గరనుండీ నేను ఆ అడవిలోనే ఉంటున్నాను, నాలుగునెలలై ఉంటుంది; మీరన్నది నిజం, చాలారోజులయింది.” గతంలో అతని దాయాదుల్ని ఇరవైమంది దాకా హతమార్చేడు,…