వర్గం: కవితలు
-
నిన్నే తలుచుకున్నా … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి.
. నిన్నే తలుచుకున్నా, నువ్వీ అందాన్ని ఎలా ఆశ్వాదిస్తావోనని ఆలోచిస్తూ… ఈ సుదీర్ఘమైన బీచిలో ఒక్కర్తినీ ఒంటరిగా నడుస్తూ, భంగపడుతున్న కెరటాలు ఒక క్రమంలో చేసే ఘోష వింటున్నా… నీకూ నాకూ విసుగ్గొచ్చేది ఈ ఏకశృతి వినలేక ఒకప్పుడు. . ఇపుడు నన్నావరించి ఉన్నవి… ప్రతిధ్వనించు సైకతశ్రోణులూ, దిశాభ్యంతరములునిండిన రాగరహిత విపులార్ణవ రజతశోభా. మళ్ళీ నువ్వు నాతోకలిసి ఈ తరంగధ్వని వినే సమయానికి మనిద్దరం మృత్యువులోంచి పయనిస్తాం, యుగాలు దొర్లి పోతాయి. . సారా టీజ్డేల్ (August…
-
ఒంటరి రైతు … ఆర్. ఎస్. థామస్. వేల్సు కవి.
పాపం ఒక గిరిజన రైతు అడవిలో దారి తప్పాడు ఎక్కడో కదిలిన చప్పుడు, తలెత్తి మీదికి చూసాడు. పిల్లగాలి తుర్రున పరిగెత్తడం కనిపించింది. . ఎక్కడినించో మాటలు గాలిలోంచి తేలివస్తున్నాయి. ఎక్కడ? ఎక్కడ? అని పరికించాడు. సెలయేరు తనలోతాను మాట్లాడుకుంటూ పోతోంది. అంతే! . వసంతంలో ఒకసారి తను బాటలో నడుస్తుండగా ఆకులసందునుండి వినవచ్చిన కీరవం అతన్ని వంచించింది. ఒక్క నిముషం … ఒక్క నిముషం … నాలుగు స్వరాలు… వెనుదిరిగేడు… వేరెవరూ కాదు… ముళ్ళపొదల్లో ఓ…
-
A Ditty at Dawn … K. Godavari Sarma.
. I don’t think it’s an intelligent bargain To trade-off Larynx for silence. The moment my ears are awake to the Summer’s day The sweet tweeting birds Encourage me to become a poet. Kindling the fire in my gullet And shutting my mouth I continue to recline idling on the bed. Words would be cooking…
-
కవులు … జాయిస్ కిల్మర్, అమెరికను కవి
. జేగంటలు విస్మృతిలోపడ్డపుడు, అవి శిధిల దివ్య స్థలాలపై పారాడిన చిరుగాలి మోసుకొచ్చినా, నిష్ప్రయోజనమే. . అంతరాంతరాల్లో అమృతాశనముపై కాంక్షలేని వాని ప్రవచనం అంతకంటే నిష్ఫలం. . భగవదేచ్ఛకులోబడని మన లొల్లాయిపదాలు, ఊపిరితోపాటు పెదాలు దాటి వచ్చిన తక్షణమే లయిస్తాయి. . మరణాన్ని చవిచూడనివారు జీవితాన్ని చవిచూడలేరు. . విధివ్రాతకు కట్టుబడగలిగినవారుమాత్రమే, సంకీర్తనను చెయ్యగలరు. . జాయిస్ కిల్మర్ (December 6, 1886 – July 30, 1918) ప్రముఖ అమెరికను కవి, సాహిత్య విమర్శకుడు, విలేఖరి,…
-
ఒక కళ … ఎలిజబెత్ బిషప్
. పోగొట్టుకోడం ఒక కళ. దానిలో ప్రావీణ్యం సంపాదించడం పెద్ద కష్టమేం కాదు; చాలా వస్తువులు అసలు పోగొట్టుకోడానికే ఉన్నాయేమోన్నట్టుంటాయి. కనుక, అవి పోగొట్టుకోవడం వల్ల పెద్ద ప్రమాదమేం జరిగిపోదు. . రోజూ ఏదో ఒకటి పోగొట్టుకుంటూ ఉండు. ఇంటితాళాలు పోగొట్టుకుని తర్వాత ఒక గంటసేపు గాభరాపడడానికి అలవాటుపడిపో, పోగొట్టుకునే కళలో ప్రావీణ్యం సంపాదించడమంత కష్టమేం కాదు. . తర్వాత అంతకంటే విలువైనవి పోగొట్టుకోడం, తొందరగా పోగొట్టుకోడం సాధన చెయ్యి; నువ్వెళ్ళవలసిన ప్రదేశాలూ, వూరు పేరూ, మరిచిపోతుండు.…
-
Melancholy Strain… Kopparthy
. Night has progressed long, and Sleep flowed out of the eyelids. It’s vaguely aching. A streak of pain, A strand-like pain, As though a metallic armour is pricking somewhere within… . It is aching… Neither there’s any good reason, nor anybody responsible; Just that… a freaky irrational pain, Not a whit less Not a…
-
స్వేఛ్ఛాగానం … ఏలిస్ మిలిగన్, ఐరిష్ కవయిత్రి
. సరోవరాలకు నిలయమైన ఉదయపూర్ లో నే నోరోజు గాలి తోడుగా వ్యాహ్యాళికి బయలుదేరాను. అంతలో ఎవరో చెవిలో ఊదినట్టు ఒక పాట నా మదిలో మెదిలింది. కాని ఆ స్వరం ఇక్కడ నే చూసిన ఏ మానవమాత్రుడిదీ కాదు, గాలిలాగే, మనిషికూడా అగోచరం. . కొండలకు నెలవైన తిరుపతిలో, పర్వతారోహణ చేస్తూ శిఖరాగ్రం చేరుకునేటప్పటికి దుముకుతూ గెంతివస్తున్న సెలయేరొకటి కనిపించింది సంతోషం పట్టలేక ఆనందంతో కేకలేస్తూ. నేను శిఖరం నుండి క్రిందికి మైదానం వంకా, నీటిపాయల…
-
ప్రత్యుపకారం … ఏడిలేడ్ ఏన్ ప్రాక్టర్, ఇంగ్లీషు కవయిత్రి
. తుఫాను భీకరంగా గర్జిస్తోంది. తెలిమంచు కురవడం అప్పుడే మొదలయ్యింది. అలసిన పాదాలతో ఒక చిన్ని దేవదూత రెక్కలల్లార్చుకుంటూ వీధిలో నడుస్తోంది. . చంద్రుడు దాగున్నాడు. ఏ తారకా కాంతివంతముగా లేదు. కనుక ఆ రాత్రికి తను స్వర్గం చేరలేనట్లే. ఎందుకంటే కిరణాలే దేవదూతలకు స్వర్గానికి నిచ్చెనలు. . ప్రతి కిటికీ దగ్గరా తనకింత ఆశ్రయమిమ్మని అర్థించింది. కానీ, ప్రయోజనం లేకపోయింది… “చూడు చూడు, వర్షం ఎంత దబదబా కురుస్తోందో” అన్నాయవి. . తను వెక్కి వెక్కి…
-
అసూయ … Adelaide Anne Procter
. అతనెప్పుడూ ముందే; అదృష్టం అతని ముఖంలో తొణికిసలాడేది. నేను సంవత్సరాలతరబడి కష్టపడితే, అతను అవలీలగా విజయం సాధించగలిగే వాడు. మేం పరుగు పందెం వేసుకునే వాళ్ళం; నాకాళ్ళు రక్తాలోడేవి, అతను పందెం గెలిచేవాడు. . అతను ఎన్ని విజయాలు సాధించినా అతన్ని ఒక్కలాగే ఆదరించేరు; నా పేలవమైన ఒకే ఒక్క విజయానికి నాకెదురైనవి పరిహాసమూ, నిందా. మేం ఇద్దరం తప్పుచేస్తే, అతని మీద జాలిపడేవారు, నాకు మాత్రం అవమానమే. . నేను ఇంకా చీకటిలోనే కొట్టుమిట్టాడుతున్నాను,…
-
మృత్యువా, గర్వపడకు! … జాన్ డన్.
(This translation is dedicated to Sri Ghantasala Venkateswara Rao, the IMMORTAL Singer, on his 89th Birth Anniversary) . ఓ మృత్యువా, గర్వపడకు! ఎవరో కొందరు నిన్ను మహాశక్తిశాలివనీ, భయంకరమైన దానివనీ అన్నారని. నీ కంత శక్తులేం లేవు. . నువ్వెవర్నో కొందర్ని గెలిచేనని ఊహించేసుకుంటున్నావుగానీ, వాళ్ళేం మరణించలేదు. ఓసి పిచ్చి దానా! అంతెందుకు, నువ్వు నన్నే గెలవలేవు! . విశ్రాంతిలోనూ, నిద్రలోనూ కూడా మనుషులు మరణించినట్టే ఉంటారు. కనుక, వాటితర్వాత…