వర్గం: కవితలు
-
ఒక పురాతన అభినయం … Edna St. Vincent Millay
[గమనిక: ఈ కవితని బాగా అర్థం చేసుకోవాలంటే ఇందులో ప్రతీకలుగా ప్రస్తావించిన రెండు పాత్రలగురించి కొంత తెలియాలి. పెనిలోప్, యులిస్సిస్ … ఈ ఇద్దరూ హోమరు మహాకవి వ్రాసిన గ్రీకు మహాకావ్యంలోని రెండు పాత్రలు. ట్రోజను యుధ్ధంలో నిమగ్నమైన భర్త యులిస్సిస్ గురించి భార్య పెనిలోప్ కి 20సంవత్సరాలపాటు ఏ సమాచారమూ ఉండదు. అసలు బ్రతికిఉన్నాడో లేదో కూడా తెలియదు. కాని ఆమె భర్త వస్తాడని అలా సముద్రం వైపు నిరీక్షిస్తూ చూస్తుంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ…
-
నీతో ఒక గంట చాలు… సర్ వాల్టర్ స్కాట్.
. నీతో ఒక గంట చాలు! ప్రాభాతసంధ్య తూరుపు నీలితెరలపై బంగారు వన్నెలు అద్దుతున్నప్పుడు నీతో ఒక్క గంట చాలు! ఇక రోజులో రాబోయే కష్టాలనీ, కన్నీళ్ళనీ శ్రమనీ, సంక్షోభాల్నీ బాధలూ, వాటి జ్ఞాపకాలనీ మరిచిపోకుండా నన్నేదీ కట్టిపడెయ్యలేదు! నీతో ఒక గంట చాలు! మండువేసవి మధ్యాహ్న సూర్యుడు ప్రచండంగా ప్రకాశిస్తున్నప్పుడు చల్లని చెట్టునీడకంటే, సేదదీర్చే కొండవాలు కంటే పొలంలో నమ్మకంగా పాటుపడుతున్న రైతుకి శ్రమకుతగ్గ ప్రతిఫలం ముట్టజెప్పగలిగిన దెవ్వరు? నీతో ఒక్క గంట చాలు! ఆహ్!…
-
ఏకాంత స్తుతి … అలెగ్జాండర్ పోప్
. వంశపారంపర్యంగా వచ్చే ఆ నాలుగుమూరల నేలకే తన కోరికలూ, కష్టమూ పరిమితమై, తను పుట్టిన నేలమీది గాలి పీలుస్తూ, ఏవడు సంతృప్తిచెందుతాడో, ఎవని పసులు పాలతో సమృధ్ధిగా, ఎవని పొలాలు పంటలతో సుభిక్షంగా, ఎవని “జీవాలు” ఉన్నితో పుష్కలంగా ఉంటాయో; ఎవని వృక్షాలు వేసవిలో నీడనూ, చలికాలంలో చితుకుల్నీ నిరాటంకంగా అందిస్తాయో, వాడే సుఖజీవి. ఎవనికి, వాని ఎరుకలేకనే గంటలూ, రోజులూ, వత్సరాలూ దొర్లిపోతుంటాయో; ప్రశాంత చిత్తమూ, ఆరోగ్యవంతమైన శరీరమూ, చీకూ చింతాలేని ఉదయాలూ, కలతనిదురలేని రాత్రులూ ఉంటాయో;…
-
మృత్యుల్లేఖము … వాల్టర్ డి ల మేర్
. ఆర్య నిదురించునిచట సౌందర్య రాశి లలితపద, నిరతహృదయోల్లాసి యామె, “మాపు సీమ”ను లావణ్య రూపు రేఖ కీరుగలవారు లేరు నా ఎరుక మేర. . వాయు సొబగులు, రూపలావణ్య మడగు యెంత అపురూప మెంత దురంతమైన కాలగతియంతె! ఎవరు వాక్కొనగ గలరు మిత్తి ఎంతటిపోడుముల్ మట్టిగలుపు! . వాల్టర్ డి ల మేర్ (25 April 1873 – 22 June 1956) ఇంగ్లీషు కవీ, నాటకకర్తా, కథా రచయితా అయిన వాల్టర్ డి ల మేర్ తన…
-
నేనంటే అంత ఇష్టమా? … వాల్ట్ విట్మన్
. నేనంటే అంత ఇష్టపడుతున్నది నువ్వేనా? అయితే ముందుగా నా హెచ్చరిక: నేను నువ్వూహిస్తున్నదాని కంటే భిన్నంగా ఉంటాను. ఏమాత్రం సందేహం లేదు. నాలో నువ్వు ఆశించిన వ్యక్తి లభిస్తాడనుకుంటున్నావా? నువ్వు నన్ను ప్రేమించినంత మాత్రాన్న, నేను నీ ప్రేమికుడిగా మారడం అంత సులభమనుకుంటున్నావా? నా స్నేహం నిష్కల్మషమైనదనీ, సంతృప్తినిస్తుందనీ అనుకుంటున్నావా? నేను నమ్మదగినవ్యక్తిగా, విశ్వాసపాత్రుడిగా అగుపిస్తున్నానా? నా ఈ మృదు స్వభావమూ ఒర్పూ వంటి ప్రచ్ఛన్న వేషాలు దాటి నా నిజస్వభావాన్ని ఊహించలేకపోతున్నావా? నువ్వు ఆవేశంతోగాక,…
-
పాటా – బాణమూ … HW లాంగ్ ఫెలో. అమెరికను కవి
. నేను గాలిలోకి ఒక బాణం విసిరా అదెక్కడో పడిపోయుంటుంది; తెలీదు ఎందుకంటే, అదెంత జోరుగా దూసుకెళ్ళిందంటే దాని వేగాన్ని నా కళ్ళు అనుసరించలేక పోయాయి నేను గాలిలోకి ఒక పాట ఆలపించేను. అదికూడా ఎక్కడో పడిపోయింది; తెలీదు. అంత చురుకైన కళ్ళెవడికున్నాయి గనక పాట వేగంతో దృష్టి మరలించడానికి? చాలా చాలా కాలం తర్వాత, విరిగిపోకుండా సింధూరవృక్షానికి గుచ్చుకుని ఆ బాణం దొరికింది. మొదటినుండి చివరిదాకా పొల్లుపోకుండా ఆ పాట నా మిత్రుడి గళంలో మారుమ్రోగడం విన్నాను. .…
-
వాలిన పిట్ట … ఎమిలీ డికిన్సన్
. నే నడిచే దారిలోకి ఒక పిట్ట వచ్చి వాలింది దాన్ని నే చూసేనని గమనించలేదది వానపాముని పట్టి, రెండుముక్కలుచేసి, దాన్ని అలాగే ఆరగించింది పచ్చిగా . ఒక గడ్డిపరక అంచునుండి జారబోతున్న మంచుబిందువులు తాగింది పేడపురుగును చూసి, దారి ఇస్తూ, పక్కకి గెంతుకుంటూ తప్పుకుంది. . గబగబా నాలుగుదిక్కులూ చూస్తున్న భీతిచెందిన దాని కళ్ళు భయపడి చెదిరిన పూసల్లా ఉన్నాయి. దాని మొఖ్మలు తలను ఒకసారి విదిలించింది . భయంగా అప్రమత్తంగా ఉన్నదానికి నేనో రొట్టెముక్క…
-
శరద్గీతి … సరోజినీ నాయుడు
బాధాతప్త హృదిపై నవనీతపులేపనం లా, నల్లమబ్బు అంచున, గుంకుతోంది పొద్దు. అటు బంగారువన్నె వరికంకుల రెపరెపలు ఇటు కొమ్మలలో పడుచు, పండుటాకుల గలగలలు ఎక్కడో, మబ్బుతెరలలో వెర్రిగాలి అలజడులు . అదిగో విననీండి! గాలిలో నా పేరు తేలి వస్తోంది. చిలిపిగాలి ఎవరిగొంతునూ అనుకరించటం లేదు గద? అలసిపోయిన నా మనసు ఒంటరిగ దిగులుతో నిండి ఉంది. అది కన్న కలలు ఎండుటాకుల్లా ఎగిరిపోయాయి నేను మాత్రం మిగిలి చేసేదేముంది? . సరోజినీ నాయుడు (13 ఫిబ్రవరి 1879…
-
ఒక వింత సత్యం… మాయా ఏంజెలో
. సాహసానికి సగమెరుకై, సంతోషానికి బహిష్కృతులమై ఏకాంతపునత్తగుల్లలోకి ముడుచుకుపోయే మనల్ని “ప్రేమ” తన పవిత్రమైన గర్భగుడి వీడి ఈ సంకెలలనుండి విముక్తుల్ని చేసి జీవితాన్ని అనుగ్రహించేదాకా అలాగే ఉంటాం. . మనకే గనక ధైర్యం ఉంటే,ప్రేమ ఈ పిరికిదనపు సంకెలలని అవలీలగా త్రెంపేస్తుంది. . మన సర్వస్వాన్నీ, మనం కాగల (మార్పుచెందగల) సకలాన్నీ దానికి మూల్యంగా చెల్లించుకోవాలి. ఆశ్చర్యకరమూ, సాహసోపేతమైన సత్యం ఏమిటంటే మనల్ని విముక్తుల్ని చెయ్యగలిగినది… అదొక్కటే! . ఇటువంటి ఆశ్చర్యకరమూ, సాహసోపేతమైన అయిన సత్యాన్ని…
-
మబ్బులూ, సముద్రకెరటాలూ … రవీంద్రనాథ్ టాగోర్
. అమ్మా! మబ్బుల్లో దాగున్న పిల్లలు నన్ను పిలుస్తారే “ఉదయం అయింది మొదలు చీకటిపడేదాకా ఆడుకుందాం. బంగారురంగు సూర్యోదయం తోటీ, వెండిబిళ్లలాంటి చంద్రుడుతోటీ ఆడుకుందాం” అంటారే. అప్పుడు నే నడుగుతాను, “మరలాగయితే, అక్కడికి చేరుకునేదెలా?” అని. వాళ్లంటారు గదా, “ఏముందీ, భూమిఅంచుకి వచ్చి, రెండుచేతులూ ఆకసం వైపు చేతులు జాచితే నువ్వలా మబ్బుల్లోకి తేలిపోతావు.” అని. “మా అమ్మ నాకోసం ఇంటిదగ్గర ఎదురుచూస్తుంటుంది. అమ్మని ఇంటిదగ్గర వొదిలేసి ఎలా రావడం?” అంటానే. అప్పుడు వాళ్లు నవ్వుకుంటూ, తేలిపోతూ…