వర్గం: కవితలు
-
With the Yoke You Left Half-way… Vanaja Tatineni, Telugu Poetess
That the necessities were welling up each year like water in a spring, and the loans were growing wild with interest like reed unattended, you took to liquor once to drown the grief; But today you took this “peasanti-cide” and dropped down dead like a pest. . Ever since you merged into the elements leaving…
-
అద్దం… సిల్వియా ప్లాత్, అమెరికను కవయిత్రి.
. నేను వేలెత్తి లోపం చూపలేని తళతళలాడే ఉపరితలాన్ని నాకు ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలు లేవు. నేను దేన్ని చూస్తే దాన్ని తక్షణం స్వీకరిస్తాను, యథాతథంగా. ద్వేషాభిమానాల పొరలు నన్ను కమ్ముకోవు. నాకు క్రూరత్వం లేదు, కేవలం నిజాయితీగా ఉంటాను పాపాయి కనుపాపలా, నాలుగు మూలలతో. ఎక్కువసమయం ఎదుటిగోడమీదే ధ్యానమగ్నమై ఉంటాను. అది గులాబిరంగులో ఉంటుంది… అక్కడక్కడ మచ్చలుంటాయి దాన్ని ఎంతగాపరిశీలించేనంటే అది నా గుండెలో ఒకభాగమైపోయింది. పదే పదే మమ్మల్ని ముఖాలూ, చీకట్లూ వేరుచేస్తుంటాయి .…
-
A Film of Fog … Vamshidhar, Indian Poet
“Oh, you are an MA? Even those MSc’s and M. Com’s are lurching in the dark. Want to become a teacher? Who cares for your Telugu? The medium of instruction is only English here. What? You want to be a government teacher? Even the CM is ignorant when the DSC shall meet. Till then how…
-
మనసుకో విన్నపం … రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి
నేనో చిన్నపాటి పాపం కూడా చెయ్యకూడదా? ఎందుకు నువ్వు వెంటనే చిత్రగుప్తుడిలా చిఠా రాస్తావు? ఒక చిన్న తియ్యని పాపం చేస్తాను నువ్వు చూసీచూడనట్టు ఊరుకోవా? నే చెయ్యబోయే సున్నితమైన అపరాథం ఎవరికీ అనుమానం రాకుండా కప్పిపుచ్చుతాను ఎంత చీకటి తెర వేస్తానంటే, నే చేసే పాపం నరమానవుడి కంటికి కనిపించదు. వివేకవంతుల కళ్ళు బహుమతులతో మూసుకుంటాయి, లంచంతో ఇతర సాక్షుల్ని తూర్పారబట్టవచ్చు, ఓ నోరులేని నిశిరాత్రి, విశృంఖలంగా తిరగడానికి నీ పెన్నూ, ఇంకూ పక్కనబెట్టి ఏమీ రాయకుండా…
-
వెస్ట్ మిన్ స్టర్ చర్చి సమాధులు… ఫ్రాన్సిస్ బ్యూమాంట్, ఆంగ్ల కవి
ఓ మరణమా! ఇటుచూడు. భయమేస్తుంది! శరీరాలెంత దారుణంగా మారిపోయాయో! ఒక సారి ఊహించుకో! ఈ రాళ్ళ గుట్టలక్రింద రాజ్యాలేలిన ఎన్ని అస్థికలు నిద్రిస్తున్నాయో; ఇక్కడ పరున్నవారి కొకప్పుడు సామ్రాజ్యాలూ, సార్వభౌమత్వాలూ ఉండేవి. పాపం! వాళ్లకిపుడు చేతులుకదపగలిగే శక్తి కూడా లేదు. మట్టితో మూసిన వాళ్ళ ప్రసంగ వేదికలనుండి ఇలా ప్రకటిస్తున్నారు: “గొప్పదనానికి హామీ లేదు” . ఇక్కడ ఒక ఎకరం జాగాలో, పాపంచేసి మరణించిన తొలి మానవుడినుండీ నేటివరకూ భూమిపై మరణించిన గొప్పగొప్ప రాజులలో ఘనతవహించిన అధికసంఖ్యాకులిక్కడనే…
-
చిత్రమైన సంఘటన … విష్ణుప్రసాద్ , మలయాళీ కవి
. దృశ్యం 1 లేదా మిలిండా కురియన్ అనే సేల్స్ గర్ల్ వస్త్ర దుకాణంలో ఎలా ఒంటరిగా మిగిలింది? లాఠీలుపట్టుకున్న పోలీసులనే చెత్తబుట్టలోకి ఎవరు ఊరు ఊరంతటినీ ఒంపీసింది? లేదా అకస్మాత్తుగా దుకాణాలు మూసెయ్యమని ఆజ్ఞాపించింది? ఇక్కడ ఊరంతా ఎలా నిర్మానుష్యం ఐందన్నది ప్రాథమికం మేధావులు ఎప్పటినుండో అంటూనే ఉన్నారు ఇక్కడ ప్రతీదీ కుట్రే అని. ఏది ఎమైనా, ఎలా జరిగినా మిలిండా కురియన్ మాత్రం Merriment Textiles లో అకస్మాత్తుగా ఒంటరిగా మిగిలిపోయింది.…
-
విషమ పరిస్థితి… ఓరిక్ గ్లెండే జాన్స్, అమెరికను కవి
కళ్ళు మిరిమిట్లు గొలిపేలా చంద్రుడు ఆకాశంలో మెరిస్తే నేమిటి ఆ చిట్టడవి చివర చెట్లగుబురులతో చుక్కలు దోబూచులాడితే నేమిటి? . తుప్పలునరికి,చదునుచేసీ కలుపుతీసీ మనిషి విత్తు నాటవలసిందే, దానికి రక్షణగా దడికట్టినపుడు హెచ్చరికగా తెల్లగీత గీయవలసిందే. . అందమైన వయిలెట్ పువ్వులగురించీ మనుషులు చేసే పనులు చెప్పడానికీ వానలా పెద్దచప్పుడు చేసుకుంటూ దేముడు వస్తేనేమిటి? . నా మెదడుకి పదునుపెడుతూ నా పాట్లు నే పడవలసిందే నాకు తెలిసిన అన్న మాటల్లోంచి ఒక సత్యాన్ని ఆవిష్కరించవలసిందే. .…
-
ఒక స్మృతి… ఏన్ బ్రాంటె, ఇంగ్లీషు కవయిత్రి
. నువ్వు వెళ్ళిపోయేవన్నది నిజం. మరెన్నడూ నీ తళుకునవ్వులు నా మనసు మురిపించవన్నదీ నిజం. నేను మాత్రం ఆ ప్రాచీన చర్చిద్వారం దాటి వెళ్ళొచ్చు నిన్ను మూసిన నేలమీదే అడుగులు వెయ్యొచ్చు. . ఆ చల్లని చలువరాతి పలకపై నిలుచుని… నాకు తెలిసిన మిక్కిలి హుషారైన వ్యక్తీ ఇకముందెన్నడూ చూడలేని దయార్ద్రహృదయమూ, క్రింద గడ్డకట్టుకుని ఉన్నాయే అని తలుచుకోవచ్చు. . నిన్నిక ఎన్నడూ కళ్ళతో చూడలేకపోయినా నిన్ను గతంలో చూడగలిగేనన్నది ఎంతో సంతృప్తి; నీ అనిత్యమైన జీవితం…
-
దేశ సంచారి … జో ఏకిన్స్, అమెరికను కవయిత్రి
ఓడలు రేవులో లంగరేసి ఉన్నాయి. సీగల్స్ వాటి స్థంబాలచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. నా ఆత్మ వాటిలాగే అశాంతిగా ఎద్రుచూస్తోంది ఎప్పుడెప్పుడు నక్షత్రసీమల్ని చేరుకుంటానా అని. . నాకు దేశాలు తిరగాలంటే ఎంత సరదానో! సముద్రమన్నా, నీలాకాశమన్నా చెప్పలేనంత ఇష్టం. కానీ, ఒక చిన్న సమాధిలో ఇలా కదలకుండా పడుక్కోడం ఎంత దయనీయమైన పరిస్థితి? . జో ఏకిన్స్ (30 October 1886 – 29 October 1958) అమెరికను కవయిత్రి. ఏ కవితకైనా మొదటి పాదాలూ, చివరి…
-
మధ్యంతరం … స్కడర్ మిడిల్టన్, అమెరికను కవి
నాకు అంత పెద్ద వయసు లేకపోయినా, నువ్వు చిన్నదానివని తెలుసుకోగలను. నన్ను చిగురాకు అని పిలుస్తారు నువ్వు ఇప్పుడే విరిసిన మొగ్గవి. . అదిగో కొమ్మ మీద ఆ రాక్షసి ఉందే, గొంగళి, అది నాపై ఒక పొర అల్లేలోగా నేను నీతో పాటే కొంతకాలం ఎదుగుతాను భ్రమర నాదం విని, మబ్బుల్ని తిలకిస్తాను. . స్కడర్ మిడిల్టన్ (Sept 9. 1888 – 1959) అమెరికను కవి. “Life is an interlude between two vast…