వర్గం: కవితలు
-
కరుణారసం … విలియం షేక్స్పియర్
కరుణ రసానికి ఎన్నడూ లోటురాదు…నిరంతరం అది సన్నని తుంపరలా దివినుంది జాలువారుతూనే ఉంటుంది క్రిందనున్న ఈ భువికి; దాని అనుగ్రహం ద్విగుణం… అటు దాత, ఇటు గ్రహీత ఇద్దరూ ధన్యులౌతారు. అది బలవంతులలోకెల్ల బలమైనది; అది కిరీటంకంటే, దాన్ని ధరించిన చక్రవర్తిలా సమున్నతం; దర్పానికీ, విభ్రమానికీ చిహ్నమైన రాజ దండం కేవలం లౌకికాధికారాన్ని మాత్రమే సూచిస్తుంది; అందులోనే రాజులపట్ల భయభీతులు నిక్షిప్తమై ఉంటాయి; కానీ, కరుణ రాజ్యాధికారానికి అతీతమైనది; అది ప్రభువుల హృదయపీఠాలనధిరోహిస్తుంది, సాక్షాత్తు అది భగవంతుని…
-
రిటర్ శిఖరం అధిరోహిస్తూ జాన్ మూర్… గేరీ స్నైడర్, అమెరికను.
దాని ముఖాన్ని పదే పదే జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఎక్కడం ప్రారంభించేను , నా పట్టులు చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ. సగం దూరం ఎక్కిన తర్వాత ఒక్కసారిగా ఆగిపోవలసి వచ్చింది… రెండుచేతులూ బారజాపి, కొండముఖానికి దగ్గరగా అతుక్కుని వేలాడుతూ, చెయ్యి గాని కాలు గాని క్రిందకిగాని మీదకిగాని కదపలేక. ఇక నా పతనం నిశ్చయం అయిపోయినట్టే. ఇక పడిపోక తప్పదు. ఒక క్షణం నివ్వెరపాటు, తర్వాత, నిర్జీవంగా కొండ అంచునుంది క్రిందనున్న మంచుదిబ్బలమీదకి దొర్లుకుంటూపోవడమే. ఉక్కిరిబిక్కిరిచేస్తున్న ఆలోచనలతో…
-
నవంబరు రాత్రి … ఎడిలేడ్ క్రాప్సీ
శ్రద్ధగా విను… చాలా అస్పష్టమైన సడితో… ప్రేతాత్మల అడుగుల్లా… మంచుకి బిరుసెక్కిన ఆకులు, చెట్లనుంది విడివడి క్రిందకి రాలుతున్నాయి… . ఎడిలేడ్ క్రాప్సీ సెప్టెంబరు 9, 1878 – అక్టోబరు 8, 1914 అమెరికను కవయిత్రి. . http://en.wikipedia.org/wiki/File:A_crapsey.jpg . November Night . Listen … With faint dry sound, Like steps of passing ghosts, The leaves, frost-crisp’d, break from the trees And fall. . Adelaide Crapsey…
-
గడ్డిపరక… బ్రయన్ పాటెన్, ఇంగ్లీషు కవి
నువ్వో కవిత కావాలంటావు నీకో గడ్డిపరక అందిస్తాను. నువ్వు అదేం బాగులేదు కవితని ఇవ్వమని అడుగుతావు. ఈ గడ్డిపరక సరిపోతుందిలే, ఇది చక్కని మంచువలిపాలు చుట్టుకుంది నేను రాయబోయే ఏ ప్రతీకకన్నా ఇది చాలా సన్నిహితమూ, పరిచయమైనదీను అంటాను. “ఇది కేవలం గడ్డిపరకంటే గడ్డిపరక అసలిది కవిత్వం కానే కాదు ఇదెంతమాత్రం సరిపోదు,” అంటావు. నేను నీకు గడ్డిపరకనే ఇస్తాను. నీకు చాలా కోపం వస్తుంది. గడ్డిపరక ఇవ్వడం సులభం అంటావు. ఇది అర్థ రహితం. గడ్డిపరక…
-
నాకు ద్వేషించడానికి సమయం లేదు, ఎందుకంటే… ఎమిలీ డికిన్సన్, అమెరికను
నాకు ద్వేషించడానికి సమయం లేదు, ఎందుకంటే మధ్యలో, మృత్యువు అడ్డు వస్తుంది, జీవితం మరీ అంత నిడుపైనదేం కాదు నా శత్రువులందర్నీ మట్టుపెట్టగలగడానికి. నాకు ప్రేమించడానికీ అంత తీరికలేదు, కానీ ఏదో పరిశ్రమ చెయ్యాలి కాబట్టి; చిన్నపాటి ప్రయత్నం చాలు ప్రేమకి అనుకుంటాను, అదే నాకు అసంఖ్యం. . ఎమిలీ డికిన్సన్ డిశంబరు 10, 1830 – మే 15, 1886 అమెరికను కవయిత్రి. . http://en.wikipedia.org/wiki/File:Emily_Dickinson_daguerreotype.jpg . I had no time to hate,…
-
కిటికీలోంచి చూస్తున్న బాలుడు … రిచర్డ్ విల్బర్, అమెరికను కవి
మంచుమనిషి ఒక్కడూ అలా పొద్దుపోయి రాత్రల్లా చలిలో నిలబడ్డం ఆ బాలుడు భరించలేకపోయాడు పళ్ళు పటపట మనిపించేలా గాలి ఊళలేస్తూండడం విని ఆ కుర్రాడు ఏడవ సాగేడు. నీళ్ళు నిండిన అతని కళ్ళు, పాలిపోయి తారునలుపుకళ్ళ మంచుమనిషినీ, స్వర్గంనుండి బహిష్కరించినపుడు “ఏడం” దీనంగా చూసిన చూపులాంటి అతని చూపుల్నీ చూడలేకపోతున్నాడు. అయినా, మంచుమనిషి హాయిగానే ఉన్నాడు లోపలికిపోయి చావాలన్నకోరిక ఏమాత్రం లేదు. కాకపోతే, ఆ అబ్బాయి ఏడవడం అతన్ని కదిలించింది. గడ్డకట్టిన నీరే అతని స్వభావం అయినప్పటికీ అతని మెత్తనికళ్ళలోంచి…
-
అస్పష్ట సంగీతం… వాల్టర్ డి లా మేర్, ఆంగ్ల కవి
రాలుతున్న ఉల్క నిశ్శబ్ద మార్గం, చప్పుడు చెయ్యని వాన; నిశ్చలమైన అగడ్తనీటితో పొగమంచు మౌన భాషణ, నిద్ర మరచిన పూవు విడిచే నిట్టూరుపూ, ఆ గంట మోగించని స్వరమూ … నిద్రమత్తు వదిలి అంతరాంతరాల్లోని మనిషి తిరగబడతాడు, గర్భంలో రహస్యంగా రూపుదిద్దుకుంటుంది స్వచ్ఛమైన ప్రేమ ప్రమాణం పలకకపోయినా అంత విశ్వాసంగానూ కొట్టుకుంటున్న గుండె… అన్ని శబ్దాలూ కడకు నిశ్శబ్దం దగ్గరకి రావలసిందే! . వాల్టర్ డి లా మేర్ 25 April 1873 – 22 June…
-
నిపుణహస్తస్పర్శ… మైరా బ్రూక్స్ వెల్ష్, అమెరికను
See a Lovely Video Of this poem here అది బాగా దెబ్బతింది, మచ్చలుపడింది, ఆ వేలంపాటగాడు ఆ తుక్కు వాయులీనం మీద తన విలువైనకాలం అట్టే వృధాచెయ్యదలుచుకోలేదు అయినా నవ్వుముఖంతో దాన్ని పైకెత్తి అరిచేడు: “మహాజనులారా! దీన్ని ఎంతకు కొంటారు,” అని ప్రారంభించేడు “ఎవరు ముందుగా పాటప్రారంభిస్తారు? ఒక డాలరా? ఒకటీ. రెండు డాలర్లు? రెండూ! దీన్ని మూడు డాలర్లిచ్చి ఎవరు తీసుకుంటారు?” మూడు డాలర్లు … ఒకటోసారి; మూడు డాలర్లు… రెండోసారి; అయిపోతోంది,…
-
పొగ మంచు … సారా టీజ్డేల్ , అమెరికను కవయిత్రి
(పొగ మంచు ప్రవాహంలో మునిగిన అమెరికను వాసులకి) ఆకసం మీద దండెత్తే మహానగాలు విశాలమైన పొగమంచుతెరల ప్రవాహంలో మునిగిపోయాయి నా గుమ్మం ముందర అల్లుకున్న ఫ్లాక్స్ తీవె గరుడపచ్చ బిందువులు దండలా రాలుస్తోంది . పదే పదడుగుల దూరంలో ధృఢమైన నేల కరుగుతున్న మేఘంగా మారిపోతోంది వేదన, ఉల్లాసముల మేళవింపులో నిశ్శబ్దం ఎల్లెడా పరుచుకుంది ఒక్క పిట్టకి కూడా గట్టిగా కూయడానికి మనసొప్పడం లేదు. . భూమీ, ఆకాసమూ, సముద్రమూ పోల్చుకోలేని ఈ ప్రపంచంలో ఏ మార్పూ…
-
Timeless Journey …. Katta Srinivas, Telugu, Indian
World won’t end if all material things cease, But when thinking ceases, No matter how much matter is left, The world ends! Time shall not stop Just because you throw away all clocks. The day when motion stops It ends abruptly on its own!! Just for the absence of greetings Friendships won’t taper. They come…