వర్గం: కవితలు
-
సంఘర్షణ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
(సారా టీజ్డేల్ వర్ధంతి సందర్భంగా) . నాలోని యోగీ, భోగీ రాత్రనక పగలనక కొట్టుకుంటూ ఉంటారు; సమౌజ్జీలేమో, అలుపులేక, శక్తి సన్నగిల్లుతున్నా ఒకర్ని ఇంకొకరు తిట్టుకుంటూ, నా చల్లారిన రక్తం చెమటపడుతుంది, వాళ్ళు అలా సూర్యోదయం నుండి అస్తమయందాకా కొట్టుకుంటుంటే. మళ్ళీ రాత్రయినదగ్గరనుండీ యుద్ధం కొనసాగుతుంది వేకువవేళకి నేను వణుకుతూ వాళ్ళ పోరాటం వింటుంటాను; ఈ సారి మాత్రం వాళ్ళు చావో రేవో తేల్చుకునేలా పోరాడుతుంటారు, అయితే, ఎవరు చస్తే నాకేం అని నేను పట్టించుకోను. ఎందుకంటే, …
-
విలంబనము… ఎలిజబెత్ జెన్నింగ్స్, బ్రిటిషు కవయిత్రి
ఈ క్షణం నా మీద ప్రసరిస్తున్న నక్షత్ర కాంతి ఎన్నో ఏళ్ళక్రిందట మెరిసినది. ఇప్పుడు అక్కడ మిలమిలలాడుతున్న కాంతిని నా కనులు బహుశా చూడలేకపోవచ్చు, ఈ కాల విలంబనము ఎలాగా అని నన్ను ఊరిస్తూంటుంది. ఇపుడు నన్ను ప్రేమిస్తున్న ప్రేమ నాదగ్గరకు చేరకపోవచ్చు దాని తొలి లాలసలు తీరేదాకా. కళ్ళు చూచి అందంగా ఉందని గుర్తించేదాకా, ఆ తారకావేశం నిరీక్షించాల్సిందే మనల్ని చేరుకున్న ప్రేమ, మనం ఇంకెక్కడో ఉండగా చేరొచ్చు. . ఎలిజబెత్ జెన్నింగ్స్ బ్రిటిషు కవయిత్రి.…
-
Revision 2… Nanda Kishore, Telugu, Indian
Some acquaintances are such! Furnishing wings you did not fancy in your wildest dreams they bid you up suddenly pitting against gushing winds. . If you could somehow manage to drop down safely, fine! You can still breathe life even if your body is battered. . But if you continue your assay for fun or…
-
అర్థరాత్రి నిద్రలో… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను
1 అర్థ రాత్రి నిద్రలో, వ్యధాభరితమైన అనేక ముఖాలు, చూడటానికి ప్రాణాంతకంగా గాయపడ్డ చూపులు — వర్ణించనలవిగాని ఆ చూపులు; వెల్లకిలాపడిన నిహతులు, చేతులు బార్లా జాపుకుని, కలగంటి, కలగంటి, కలగంటి. 2 ప్రకృతి దృశ్యాలు, పంటచేలు, మహానగాలు, తుఫానువెలిసిన తర్వాతి అందమైన ఆకాశాలు… రాత్రిపూట అద్భుతంగా ప్రకాశిస్తూ చందమామ తళతళా మెరుస్తూ, క్రింద మేము కందకాలు తవ్వుతూ మట్టి పోకలుపోస్తున్న చోట కాంతి ప్రసరిస్తూ, కలగంటి కలగంటి కలగంటి 3 అవన్నీ గతించిపోయి ఎన్నేళ్ళో…
-
తమార్ కి ఊరడింఫు … స్టాలింగ్స్, అమెరికను కవయిత్రి
(ఒక పురాతన భాండాన్ని పగులగొట్టిన సందర్భంగా) . తమార్! నేనేమీ పురాతత్వవేత్తని కానని నీకు తెలుసు, నాకు ఆ మట్టయినా, ఈ మట్టయినా ఒకలాగే ఉంటాయి. అయినప్పటికీ, ఇన్ని వందల ఏళ్ళు భూకంపాలూ, వరదలూ, యుద్ధాలూ, వాతావరణం తట్టుకోగలిగిందంటే మాటలుకాదు చివరకి నీ చేతిలో పగిలిపోయింది. గురుత్వాకర్షణ వల్లో, లేక అలా రాసిపెట్టి ఉందో— అలా యుగాలతరబడి ఎక్కడో సొరుగుల్లో, దూర దేశాల్లో ఎలా పగలకుండా ఉండగలిగిందా అని ఆశ్చర్యపోతున్నాను నీ చేతివేళ్ళ మృదుస్పర్శలో ఎక్కడో ఉడుకు రక్తపు…
-
ఒకరోజు ఆమె పేరు ఇసుకలో రాసాను సముద్రతీరాన … ఎడ్మండ్ స్పెన్సర్ , ఇంగ్లీషు కవి
ఒకరోజు ఆమె పేరు ఇసుకలో రాసాను సముద్రతీరాన, కాని అలలు వచ్చి దాన్ని ఊడ్చుకుపోయాయి, మళ్ళీ మరో సారి చేత్తో రాసేను మళ్ళీ కెరటం వచ్చి నా శ్రమని హరించింది. “ప్రయోజనం లేదు, ప్రియా” అంది ఆమె, “నువ్వు అనవసరంగా శ్రమపడుతున్నావు, నశ్వరమైన దాన్ని శాశ్వతం చెయ్యడానికి నా మట్టుకు నాకు ఇలాగే నశించిపోవడం ఇష్టం. దానితో పాటే, నా పేరూ అలాగే చెరిగిపోవాలి. “వీల్లేదు,” అన్నాను నేను, “విలువలేనివి మట్టిలో కలిసేమార్గాలు ఎన్నుకోనీ, నీ కీర్తి…
-
ఎదురు జవాబు… సారా టీజ్డేల్, అమెరికను
నేను మట్టిలో తిరిగి కలిసిపోయేక సంతోషంతో అతిశయించిన ఈ శరీరం ఒకప్పుడు తను విర్రవీగిన ఎర్ర, తెల్లకణాలను వదుల్చుకున్నాక… నా మీద నుండి పురుషులు నడిచిపోతూ తెచ్చిపెట్టుకున్న లేశమాత్రపు జాలితో మాటాడితే నా మట్టి తిరిగి గొంతు తెచ్చుకుని వాళ్ళకి గట్టిగా ఇలా ఎదురుచెబుతుంది: “చాలు, ఆపండి! నేను సంతృప్తిగా ఉన్నాను. మీ జాలి నాకక్కరలేదు! వెనక్కి తీసుకొండి. సంతోషమన్నది నాలో ఒక జ్వాల ఎంత నిలకడ అంటే అంత సులువుగా ఆరదు; సులువుగా ఒదిగే రెల్లు…
-
పీసా గీతం LXXXI … ఎజ్రా పౌండ్ , అమెరికను
నువ్వు ప్రేమించిందే శాశ్వతం, మిగతాదంతా పనికిమాలినదే నువ్వు ప్రేమించించింది నీనుండి వేరుచెయ్యబడలేదు నువ్వు ప్రేమించేదే నీ అసలైన వారసత్వం, ఈ సృష్టి ఎవరిది, నాదా, నీదా, లేక ఎవరికీ చెందదా? ముందుగా గ్రహించేది దృశ్యమానం, తర్వాతే స్థూలప్రపంచం స్వర్గం… అది నరకలోకలోకపు చావడులలో ఉన్నా నువ్వు ప్రేమించేదే నీ అసలైన వారసత్వం నువ్వు ప్రేమించేది నీ నుండి లాక్కోబడలేదు. . ఎజ్రా పౌండ్ 30 October 1885 – 1 November 1972 అమెరికను . .…
-
ఆఖరి సుమం… అలెగ్జాండర్ పుష్కిన్. రష్యను కవి
కొత్తగా కుసుమించిన పుష్పపు సొబగులు దివ్యంగా ఉండొచ్చు; నాకు మాత్రం చివరి సుమమే ఇష్టం. నా కలలూ. ఆశలూ, కోరికలన్నిటిలోనూ ఎప్పుడూ నా మనసుకి పునస్సమాగమమే బాగుంటుంది మేమిద్దరం కలిసి గడిపిన క్షణాలకంటే, వీడ్కోలుపలుకుతూ గడిపిన ఘడియలే స్ఫూర్తినిస్తాయి. . అలెగ్జాండర్ పుష్కిన్ 6 జూన్ 1799 – 10 ఫిబ్రవరి 1837 రష్యను మహాకవి . Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:A.S.Pushkin.jpg . The Last Flower . Rich the first flower’s graces be,…
-
రోజులు… ఫిలిప్ లార్కిన్, ఇంగ్లీషు కవి.
రోజులెందుకున్నాయి? మనం బ్రతికేది వాటిలోనే. అవివస్తుంటాయి, పదేపదిసార్లు మేల్కొలుపుతూ ఉంటాయి. మనం సుఖంగా బ్రతకవలసింది అందులోనే. వాటిలో తప్ప ఇంకెక్కడ మనం బ్రతకగలం? ఆహ్! ఈ సమస్యకి సమాధానం కనుక్కోడమే తడవు వైద్యుడూ, పురోహితుడూ వాళ్ళ వాళ్ళ పొడవాటి దుస్తుల్లో పొలాలంబడి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. . ఫిలిప్ లార్కిన్ 9 ఆగష్టు 1922 – 2 డిశంబరు 1985 ఇంగ్లీషు కవీ, నవలాకారుడూ, గ్రంధాలయాధికారి. ఈ కవితలో చివరి పాదాల్లో చూపించిన చమత్కారంతో దీని సౌందర్యం ఒక్కసారిగా…