వర్గం: కవితలు
-
ఓ రాత్రి ఆరుబయట… దూ ఫూ, చీనీ కవి
తీరాన దట్టంగా పెరిగిన గడ్డిలో పిల్లగాలి అలలు రేపుతోంది, రాత్రల్లా, చలనంలేని ఈ వాడ కొయ్యమీదకి అవధిలేని రోదసిలోంచి చుక్కలు వాలసాగేయి. చందమామ నీటికెదురీదుతూ పైకి రా సాగేడు. నా కళ నాకు పేరుతెచ్చి, ఈ ముదిమి వయసులో ఉద్యోగావసరం నుండి తప్పించగలిగితేనా! … నిలకడలేని ఈ పరుగేమిటి నాకు… ఈ సువిశాలమైన జగతిలో గూడులేక అల్లల్లాడే పక్షిలా. . దూ ఫూ (712 – 770 AD) చీనీ కవి . A Night Abroad…
-
మరబొమ్మ… డాలియా రవికోవిచ్, ఇజ్రేలీ కవయిత్రి
ఆ రాత్రి నేను మర బొమ్మనే అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాను, నేను పడిపోయి ముక్కముక్కలైపోయాను నా రూపం, నేర్పూలూ వాళ్ళు అతికి పునరుద్ధరించేరు. మళ్ళీ నేను పూర్వపు బొమ్మలా తయారయ్యేను, నా నడవడి ఎప్పటిలాగే అణకువగానే ఉంది; అయినప్పటికీ, నేను కొత్తబొమ్మనే విరిగిన కొమ్మని నులితీవలు దగ్గరా చుట్టి ఉంచినట్టు. నాన్ను మళ్ళీ నాట్యం చెయ్యమన్నప్పుడు నా అడుగులు లయబద్ధంగా పడుతున్నప్పటికీ నాకు జంటగా ఇచ్చినది పిల్లినీ, కుక్కనీ. నా జుత్తు పసిడి రంగు, కళ్ళు…
-
Just let this night pass… Ramineni Mohanatulasi, Telugu, Indian
Just let this night pass… Spring shall dawn with the daybreak! Look over there, The last tree on the turn, shall start budding And the Cuckoo shall coo through the morning window; Shedding its inhibitions The Mango shall bloom all over its dense foliage; To the Sun climbing over the orient Roof top shall…
-
మూడురోజులు … జేమ్స్ రాబర్ట్స్ గిల్మోర్, అమెరికను కవి
చెయ్యవలసినదనంతం; చేసింది స్వల్పం! నిన్న రాత్రి సూర్యుణ్ని చూశాను ఏ వెలుగులూ లేకుండా చీకటిగుహలోకి క్రుంగిపోతూ… నిన్న…ఆహ్! ఒక భయంకరమైన ప్రేతం. చెయ్యవలసినదనంతం; చేసింది స్వల్పం! ప్రతిరోజూ ఏదో ఒక కొత్త సంఘర్షణతో తెల్లారుతుంది; అయినా సరే, ధైర్యంగా, ఉత్సాహంతో, రంగంలోకి దిగుతాను, ఈ రోజు… యుద్ధంలో పాలుపంచుకుంటాను. చెయ్యవలసినదనంతం; చేసింది స్వల్పం! కానీ అంతా అయిపోయేక, గెలుపు సాధించినట్టే. ఓహ్! నా మనసా! ఈ కష్టాలూ, ఈ దుఃఖమూ రేపు… తో … హాయిగా అన్నీ…
-
The Liberated Nymph… Manasa Chamarti, Telugu, Indian
Oh, Me! How tender you look! The flower blushed as tenderly. You must forever remain like this for my sake! Pulchritude fluttered in delight. Can you sing any lays? Music turned its voice Won’t you bless me with a kiss? Love embraced in consummating angst. House should be kept spick…
-
కవిత్వంతో పరిచయం … బిల్లీ కాలిన్స్, అమెరికను కవి
వాళ్ళని ఒక కవిత తీసుకుని రంగు గాజుపలకని దీపానికి అడ్డంగాపెట్టి పరీక్షించినట్టు చూడమన్నాను, లేదా దాని గూటికి చెవిగట్టిగా ఆనించి వినమన్నాను. కవితలోకి ఒక ఎలుకని విడిచిపెట్టి అది బయటకివెళ్ళే దారి ఎలాకనుక్కుంటుందో గమనించమన్నాను, లేదా కవితలోకి నడుచుకుంటూ వెళ్ళి దాని గోడల్ని తడుముతూ స్విచ్ ఎక్కడుందో వెదకమన్నాను. వాళ్ళని నీటిమీద స్కీయింగ్ చేస్తున్నట్టు పద్యం ఉపరితలం మీద తేలియాడమన్నాను ఒడ్డున ఉన్న కవి పేరువైపు చెయ్యి ఊపుతూ. కాని వాళ్ళు చేద్దామనుకుంటున్నదల్లా పద్యాన్ని ఒక కుర్చీకి…
-
నిజమైన ఎరుక … ఆస్కార్ వైల్డ్, ఐరిష్ కవి
నీకన్నీ తెలుసు; నేను వృధాగా ఆశిస్తున్నాను ఏ పొలం దున్నాలా, ఏ విత్తు నాటాలా అని… నేలంతా ముళ్ళకంపలతో, కలుపుతో నల్లబారింది ఇక వానకురిసినా, కన్నీరు కురిసినా దానికి ఒకటే. నీకన్నీ తెలుసు; నేను అలా ఊరికే కూచుని నిరీక్షిస్తాను చేవతప్పిన చేతులతో, చూడలేని కళ్లతో, కడపటి ముసుగు తొలగించేదాకా, తొలిసారి ద్వారాలు తెరుచుకునేదాకా నీ కన్నీ తెలుసు; నాకు చూపులేదు. నా జీవితం వృధా పోదని నాకు నమ్మకం ఏ శాశ్వత దివ్యలోకాలలోనో మనం తప్పక…
-
వర్షాగమనం… థామస్ బెయిలీ ఏల్డ్రిచ్, అమెరికను కవి
వర్షం పడుతుందని మాకు తెలుసు, ఎందుకంటే పొద్దుటినుంచీ, సన్నని మంచుబిందుల తాళ్ళపై ఊగుతూ వర్షాధిదేవత తన బంగారు నీటి బొక్కెనలను దించుతోంది ఎండి, శుష్కించి, ధూళి ఎగజిమ్మే పగుళ్ళుబారిన పర్రలుగా మారిన చవిటి, బాడవ పొలాలమీదకి. పువ్వులలో దాగున్న తుహినబిందువులని పైకివిరజిమ్ముతూ సముద్రంలోంచి మణుల్ని వెలికితీసి నేలమీద రత్నాల రాశులుగా విరజిమ్మడానికి. మాకు తెలుసు వర్షం వొస్తుందని, ఎందుకంటే, చెట్లు వాటి ఆకుల అడుగుభాగాల్ని చూపిస్తున్నాయి, పలకబారి జేగురులోకిమారిన పండ్లు గాలికి దాక్కున్నాయి, మెరుపులిపుడు చంచలమైన వర్షధారల…
-
Edna St. Vincent Millay
Image Courtesy: http://upload.wikimedia.org అతని దగ్గర ఏవి ఉండేవో, ఏవి కోల్పోయేడో ఇక్కడ ఒక చిట్టా రాసేడు. ఆ తర్వాత అతనికి రావలసిన బకాయిలు ఒక చిట్టా, దాని వెనక అతనిదగ్గర ఇప్పుడు ఏమి ఉన్నాయో, ఇంకా ఏమి కావాలో; ఆ లెక్కలన్నీ పూర్తయేక అతని తాహతుకి ఏవి ఉండాలో వ్రాసి మిగతావాటితో జత చేశాడు. తర్వాత అతనికి హక్కుగా రావలసినవీ, అతను సాధించలేకపోయినవీ, అతన్ని మోసగించి తీసుకోబడినవీ, చివరగా, అతనిదగ్గర దొంగిలించబడినవీ చిట్టాలు తయారయ్యేయి. ఈ…