వర్గం: కవితలు
-
ల్యూసీ ప్రేమగీతం… ఛార్ల్స్ డికెన్స్, ఇంగ్లీషు నవలాకారుడు.
అనురాగం ఇలా వచ్చి అలా మాయమయే భావన కాదు; పరిమళభరితమైన మధుమాసపు తెమ్మెరలా ఒకసారి తాకితే, అది పోదు; దాన్ని వదుల్చుకో లేము; అదేదో మరిచిపోయేదీ కాదు, దాచుకో గలిగినదీ కాదు. ఆహ్! ఏమని చెప్పను నా వ్యధ, మెల్లగా ఎగబ్రాకి, చివరకి ఓక్ ని ఆవరించిన అతలా మనసు కమ్మేస్తుంది. పేరూ, ప్రతిష్ఠా, గౌరవం, సిరిసంపదలమీది వ్యామోహాల మూసకి చెందినది కాదు ఈ అనురాగం. వాటిపై వ్యామోహం నశించిన తర్వాత కూడా అంతరాంతరాల్లోని పదిలపరచుకున్న అలనాటి…
-
రాళ్ళకి అనుభూతి ఉంటుందా? మేరీ ఓలివెర్ , అమెరికను కవయిత్రి
రాళ్ళకి అనుభూతులు ఉంటాయా? తమ జీవితం వాటికి రుచిస్తుందా? లేక వాటి ఓరిమి అన్ని అనుభూతుల్నీ అధిగమిస్తుందా? నేను అలా సముద్రపొడ్డున షికారు వెళ్తున్నపుడు తెల్లవీ, నల్లవీ, రంగురంగులవీ ఏరి తెస్తుంటాను. “మరేం ఫర్వా లేదు, మిమ్మల్ని ఇక్కడికి తెస్తా,” అని వాటికి హామీ ఇచ్చి, అలాగే తీసుకువస్తాను. కొమ్మ కొమ్మనీ కవితలా విస్తరించుకుంటూ ఎదిగిపోయే చెట్టు, తన ఎదుగులకి హర్షం ప్రకటిస్తుందా? తమలోపలి నీటిభాండాల్ని ఖాళీ చేసినందుకు మొయిళ్ళు సంతసిస్తాయా? …
-
జీవనసంధ్య… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి
వయసు మీదపడి, జీవితం హాయిగా సాగుతూ, కోరికలన్నీ తీరినరోజు, జ్ఞాపకాలే నిద్రలో కూడా తోడై, ప్రశాంతతే లక్ష్యం అయినపుడు చెదరిన నా ముంగురులను, ఆల్చిప్పలా తెల్లని టోపీ క్రింద దువ్వుకుంటాను చల్లని, దుర్బలమైన నా చేతుల్ని నా ఒడిలో తేలికగా ఆన్చుకుంటాను. పూల అల్లికలున్న గౌను తొడుక్కుని దాని లేసు గొంతు దగ్గరా బిగించుకుని స్నేహాలకీ, కలయికలకీ వీడ్కోలు చెప్పి ఉల్లాసంగా నాలో నేను పాడుకుంటాను. ఏడుపు అన్నది మరిచిపోయి, హుషారుగా ఊగుతూ, నా టీ కలుపుకుంటాను.…
-
రాత్రికి వెయ్యి కళ్లు… ఫ్రాన్సిస్ విలియం బోర్డిలాన్, ఇంగ్లీషు కవి
రాత్రికి వెయ్యి కళ్లున్నాయి పగటికి ఉన్నది ఒక్కటే అయితేనేం, ధగద్ధగల ప్రపంచపు వెలుగు సూర్యాస్తమయంతో సరి. మనసుకి వెయ్యి కళ్లున్నాయి హృదయానికి ఉన్నది ఒక్కటే అయితేనేం, జీవితపు మొత్తం వెలుగు ప్రేమ నశిస్తే, నశిస్తుంది. . ఫ్రాన్సిస్ విలియం బోర్డిలాన్ మార్చి 22, 1852 -జనవరి 13, 1921) ఇంగ్లీషు కవి , అనువాదకుడు The Night Has A Thousand Eyes The night has a thousand eyes, And the day…
-
అనుకోవడం … వాల్టర్ వింటిల్
‘నేను ఓడిపోతాను ‘ అనుకుంటే, నిస్సందేహంగా మీరు ఓడిపోతారు. నేను ధైర్యం చెయ్యలేను అనుకుంటే, మీరు ఏమాత్రం సాహసించ లేరు. మీకు గెలవాలని ఉంది, కానీ ‘నేను గెలవలేను’ మీరు అనుకుంటే పందెం కాసి మరీ చెప్పగలను మీరు గెలవలేరని. గెలవలేనని మీరు అనుకున్నంత సేపూ, మీరు గెలవలేరు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడన్నా చూడండి గెలుపు, గెలవాలన్న తపనతో ముందు మొదలౌతుంది గెలుపు ఓటములు అన్నీ మనసు ఆధీనంలో ఉంటాయి. అవతలి వాడిది పై చెయ్యి అనుకుంటే,…
-
కవిత్వంతో పరిచయము, బిల్లీ కాలిన్స్, అమెరికను కవి
ఒక కవితను తీసుకుని దాన్ని దీపానికి ఎదురుగా రంగు గాజు పలకలా పరీక్షించమంటాను లేదా దాని గూటికి చెవి ఆనించి వినమంటాను లేదా ఆ కవిత గదిలోకి అడుగుపెట్టి దాని లైటు మీట ఎక్కడుందో తణవమంటాను. వాళ్ళు పద్యం తలం మీద తీరాన్నున్న రచయితపేరుకి చేతులూపుతూ కెరటాలమీద తేలుతూ ఆడాలని నా కోరిక. కానీ వాళ్లు చేస్తున్నదల్లా కవితని కుర్చీకి తాడేసి కట్టేసి చేసినతప్పు ఒప్పుకునేట్టు చేస్తున్నారు. దాన్ని రూళకర్రతో కొడుతూ ఆంతర్యాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.…
-
ఈ రోజు నిన్నకై వృథా చెయ్యకు… రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, అమెరికను కవి
నీ గుండెలో వ్రాసుకో: ఏడాదిలో ప్రతి రోజూ అత్యుత్తమమైనదని. ఆ రోజును స్వంతం చేసుకోగలిగిన వాడే సంపన్నుడు; ఆండోళనలూ, చిరాకులూ రోజును ముంచెత్తనిచ్చేవాడు ఎన్నడూ రోజును స్వంతం చేసుకోలేడు. ఆ రోజును పూర్తిచేశాక దాని సంగతి మరిచిపో. నువ్వు చెయ్యగలిగినదంతా చేశావు! కొన్ని తప్పిదాలూ, పొరపాట్లూ నిస్సందేహంగా దొర్లి ఉంటాయి. వాటిని ఎంత త్వరగా మరిచిపో గలిగితే అంత మంచిది. రేపు మరొక కొత్త రోజు. దాన్ని ప్రశాంతంగా, చక్కగా ప్రారంభించు. కొత్త ఉత్సాహంతో. దాన్ని…
-
ప్రయత్నం మానొద్దు… జాన్ గ్రీన్ లీఫ్ విటియర్, అమెరికను కవి
మనం అనుకున్నట్టు జరగనపుడు (ఒకోసారి అలా జరుగుతుంది) నువ్వు నడుస్తున్న త్రోవ ఎగుడుగా శ్రమతో కూడుకున్నప్పుడు, రాబడి పరిమితమై అప్పులు పేరుకుంటున్నప్పుడు, నవ్వాల్సిన సమయంలో నిట్టూర్పులు విడవ వలసి వచ్చినపుడు, బాధ్యతల బరువు నిన్ను క్రుంగదీస్తున్నప్పుడు కావలస్తే విశ్రాంతి తీసుకో, కానీ నీ ప్రయత్నం విడిచిపెట్టకు. జీవితం దాని ఒడిదుడుకులతో చిత్రమైనది ఎప్పుడో ఒకనాడు అందరికీ అనుభవంలోకి వస్తుంది: మరికొంచెం ఓపిక పట్టి ప్రయత్నించి ఉంటే విజయం వరించవలసిన చోట అపజయాలు ఎదురవడం, కోరినంత వేగంగా పనులు…
-
వేదాంతి … డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి
నేను యవ్వనంలో బలంగా, ధైర్యంగా ఉండే రోజుల్లో, ఆహ్! ఎంతబాగుండేది! తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. నా తురాయి ఎగురుతూ, నా బావుటా ఎగరేస్తూ, ప్రపంచాన్ని బాగుచెయ్యడానికి సాహసంగా బయలుదేరాను. “ఒరేయ్ కుక్కల్లారా! దమ్ముంటే యుద్ధానికి రండి!” అని సవాలు చేసేవాడిని. అయ్యో ఒక్కసారే కదా మరణించే అవకాశం అని ఎంత ఏడ్చానో! వయసు పైబడింది; మంచీ చెడూ పడుగూ పేకలా జీవితంలో గజిబిజిగా అల్లుకుపోయాయి. ఇప్పుడు తాపీగా కూర్చుని,”ప్రపంచం తీరు అంతే, దాన్ని అలా…
-
సార్ధకత… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
ఒక గుండెకోతని అరికట్ట గలిగినా నా జీవితం వ్యర్థం కానట్టే ఒక జీవన వేదనని నివారించ గలిగినా ఒక బాధని ఉపశమింప గలిగినా స్పృహతప్పిన ఒక రాబిన్ ని దాని గూటికి చేర్చగలిగినా నా జీవితం వృథాపోనట్టే. . ఎమిలీ డికిన్సన్ అమెరికను కవయిత్రి If I can stop one heart From breaking, I shall not live in vain; If I can ease…