వర్గం: కథలు
-
పల్లెటూరి డాక్టరు … ఫ్రాంజ్ కాఫ్కా, జర్మను రచయిత
Watch this story turned into a beautiful Japanese animation picture here నేను చాలా చిక్కులోపడ్డాను. నేను అత్యవసరంగా ఒకచోటికి వెళ్ళాల్సి ఉంది. పదిమైళ్ళదూరంలోనున్న గ్రామంలో ఒక రోగి నాకోసం నిరీక్షిస్తున్నాడు. అతనికి నాకూ మధ్యం ఒక తీవ్రమైన మంచుతుఫాను అడ్డంగా వచ్చింది. ఈ పల్లె రోడ్లమీద వెళ్ళడానికి అనువైన పెద్ద చక్రాల తేలికపాటి బండీ ఒకటి నా దగ్గరుంది. నా పరికరాలన్నీ పెట్టుకున్న బ్యాగ్ చేత్తోపట్టుకుని, ఉన్నికోటు వేసుకుని నేను సిద్ధంగా ఉన్నాను;…
-
అతిథి .. ఆల్బర్ట్ కామూ
భారతీయులందరికీ 67వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. సెరెన్ కీర్కెగార్డ్ (1813-55) అనే డేనిష్ తత్త్వవేత్త రచనలు ఆధారంగా ప్రారంభమైన ఒక తాత్త్విక సిద్ధాంతం, నేడు “అస్తిత్వవాదం”గా ప్రచారంలో ఉంది. జర్మన్ తత్త్వవేత్త ఫ్రీడ్రిక్ నీచ (‘నీచ’ సరైన ఉచ్చారణే!)(Friedrich Nietzsche), ఫ్రెంచి తత్త్వవేత్త జఁపాల్ సార్ట్రె (Jean Paul Sartre) ఈ వాదాన్ని బాగా వ్యాప్తిలోకి తీసుకువచ్చారు. కీర్కెగార్డ్ ప్రతిపాదన ప్రకారం, ఒక వ్యక్తి తనజీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చుకుని, అటువంటి జీవితాన్ని నిజాయితీగానూ, నిష్టగానూ జీవించడంలో…
-
వికలాంగసైనికుడు… ఆలివర్ గోల్డ్ స్మిత్ , ఇంగ్లీషు కవి
“ప్రపంచంలో సగంమందికి మిగతా సగంమందీ ఎలా బ్రతుకుతున్నారో తెలీదు”… అన్నంత అతి సాధారణమూ, యదార్థమైన పరిశీలన మరొకటి ఉండదేమో. గొప్పవాళ్ళ ఆపదలూ, కష్టాలూ మన ఆలోచనలను ప్రభావితం చేసేలా మనకి చెప్పబడుతుంటాయి; అవి ఉపన్యాసాలలోలా కాస్త అతిశయోక్తులతో కూడుకుని ఉంటాయికూడా; ‘అయ్యో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో(పడ్డారో) చూడం’డని ప్రపంచం దృష్టికి తీసుకెళతారు; బాధలవల్ల కలిగే ఒత్తిడిలో ఉన్న గొప్పవాళ్లకి వాళ్ళ బాధలు చూసి మిగతా వాళ్ళు జాలిపడుతున్నారు అన్న ఎరుక ఉంటూనే ఉంటుంది; వాళ్ళ ప్రవర్తన ఏకకాలంలో…
-
Some Stars and a Few Drops of Tears … Vimala. Telugu, Indian
(The agony and angst of the story can be understood better by the readers if they come to know that the poetess Vimala was once an active revolutionary spending the prime of her youth in forests, married to another revolutionary (but had very little family life with both attending to different assignments) who was later…
-
బిలియర్డ్స్ ఆట… ఆల్ఫోన్స్ డోడె , ఫ్రెంచి కథా రచయిత
. రెండురోజులబట్టీ పోరాడుతున్నారేమో, సైనికులు పూర్తిగా అలసిపోయి ఉన్నారు. వర్షం పడుతూ, క్రిందనుండి నీళ్ళు ప్రవహిస్తున్నా లెక్కచెయ్యకుండా వాళ్ళు వీపులకి తగిలించిఉన్న సంచీలతోనే నిద్రపోతున్నారు. ఆయుధాలు పక్కనబెట్టి, చెరువులయిపోతున్న రాజమార్గం మీదా, నీరు ఊరుతున్న బురద పొలాలల్లోనూ ప్రాణాలు ఉగ్గబట్టుకుని అలాగే మూడు గంటలపాటు అలా నిరీక్షించవలసి వచ్చింది. అలసటవల్ల, నిద్రలేమివల్ల, యూనిఫారంలతో నిలువునా తడిసిముద్దయిపోవడం వల్లా శరీరం కొంకర్లుపోయి వెచ్చగా ఉండడానికి ఒకరికొకరు దగ్గరగా ఆనుకుని పడుకున్నారు; కొందరయితే ఒకరి భుజానికున్న సంచికి మరొకరు చేరబడి నిలబడే…
-
A Pan of Musk… Munipalle Raju, Indian
Rammurty was getting accustomed to fasting these days. On the first few days he said to his wife, “Rama, I am not feeling hungry, don’t cook food for me.” Later he started inventing one reason or the other saying, “It is Ekadasi today, I fast in the day; It is Saturday today, I don’t take…
-
సహచరి … వాషింగ్టన్ ఇర్వింగ్
. ఒక స్త్రీ ప్రేమబంధంలో చిక్కుకున్నవ్యక్తి అనుభవించే కనిపించని సౌఖ్యాలతో సరిపోల్చినపుడు సముద్రంలో దొరికే నిధులు ఏమంత విలువైనవి కావు. నేను ఇంటిని సమీపిస్తుంటే చాలు, నా అదృష్టపు సుగంధాలు నన్ను తాకుతుంటాయి. ఆహ్! వివాహం ఎంత కమనీయమైన శ్వాసలనందిస్తుంది! దానిముందు ఏ తోటసువాసనలైనా దిగదిడుపే….. థామస్ మిడిల్టన్. ఆంగ్ల నాటక కర్త (1570 – 1627) * . జీవితంలో అకస్మాత్తుగా ఎదురయ్యే తీవ్రమైన కష్టనష్టాలని స్త్రీలు ఎంత ధైర్యంగా ఎదుర్కోగలరో ప్రస్తావించవలసిన సందర్భాలు…
-
A Surrealistic Painting… Aripirala Satya Prasad,Telugu, Indian
I sat up. I was still feeling drowsy. I rubbed my eyes to clear my vision and looked at the floor. There was a painting under my feet… On Cross… charcoal on tar road. It was just like the picture I drew some twenty years back. That it remained intact on the road was all…
-
Damayanti’s Daughter … P. Satyavathi, Telugu, Indian
I usually pull the window blinds down on Sundays to keep the Sun away. But my roommate Sneha, who gets up at six no matter whether it is Sunday or working day, and with old Hindi songs in the background cherishes reading every damn Telugu and English daily with its supplement leisurely sipping her coffee,…
-
సింహం పంజా క్రింద … హామ్లిన్ గార్లాండ్, అమెరికను కథా రచయిత
అది శరత్కాలపు ఆఖరిరోజు, హేమంతపు మొదటి రోజు కలిసిపోయిన రోజు. రోజల్లా రైతులందరూ విశాలంగా సమతలంగాఉన్న తమ ప్రెయిరీ క్షేత్రాల్లో పైనుంచి మంచు కురుస్తూ, పడుతూనే కరిగి ఒళ్ళంతా తడిసిముద్దవుతున్నా పనిచేస్తూనే ఉన్నారు; ఉండీ ఉండీ ఈదురుగాలులతో తెరలుతెరలుగా వచ్చి మంచు వర్షించిపోయే మేఘాల సంగతి చెప్పనక్కర లేదు… క్రింద నాగేటి చాళ్ళలోని మట్టి నల్లగా తారుముద్దలా బురద బురద అవుతోంది. కాడికి కట్టిన గుర్రాలు నీళ్ళోడుతూ తడుస్తున్నా తమ సహజమైన శాంతస్వభావంతో ఏమాత్రం అసంతృప్తి లేకుండా…