Poor Richard’s Almanac 56… Benjamin Franklin

 551  Those who are feared are hated.

 

           ఎవరికి భయపడతారో, వాళ్ళని ద్వేషిస్తారు.

 

   552 Those who in quarrels interpose, must often wipe a bloody nose.

 

            పరుల తగవులలో తలదూర్చే వాళ్ళు, తరచు రక్తమోడే ముక్కు తుడుచుకో వలసి వస్తుంది.

 

     553 Though the mastiff is gentle, yet not bite him by the lip.

 

            పెంపుడు కుక్క మెత్తగా ఉందని మూతి మీద కరవొద్దు.

 

     554 Though canst not joke an enemy into a friend, but thou mayest a friend into an enemy.

 

           హాస్యమాడి శత్రువుని మిత్రుడిగా చేసుకో లేకపోవచ్చు గానీ, హాస్యమాడి మిత్రుణ్ణి శత్రువుగా చేసుకోవచ్చు.

 

    555 Three good meals a day is bad living.

 

           మూడు పూటలా సుష్టుగా భోజనం, చెరుపు చేస్తుంది.

 

    556 Three may keep a secret if two are dead.

 

          ఇద్దరు మరణిస్తే, ముగ్గురి మధ్య రహస్యం గోప్యంగా ఉంటుంది.

 

     557 Three things are men most likely cheated in, a horse, a wig, and a wife.

 

         మూడు విషయాల్లో తరచు మనుషులు మోసానికి గురవుతుంటారు: గుర్రమూ, విగ్గూ, భార్య.

 

   558 Tim and his handsaw are good in their place, though not fit for preaching, or shaving a face.

 

         ఉపదేశానికీ, గడ్డం గీయడానికీ పనికిరాకపోయినా, టిమ్, అతని చేతి రంపమూ ఉన్నచోట ఉండడమే మంచిది.

 

    559 Time enough always proves not enough.

 

           ‘చాలినంత సమయం’ ఎన్నడూ చాలినంత ఉండదు. 

 

    560 Time is a herb that cures all diseases.

 

          కాలం అన్ని రోగాల్ని మాన్చగల మూలిక.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.