151. Friendship cannot live with ceremony. Nor without civility.
పదవి వల్ల స్నేహం నిలబడదు. మర్యాద లేకుండా అసలు నిలబడదు.
152. Friendship increases by visiting friends but visiting seldom.
రాకపోకలు సాగిస్తూంటేనే ఏ స్నేహమైనా నిలబడుతుంది. కానీ, అవి అరుదుగా జరుగుతుండాలి.
153. Full of courtesy, full of craft.
అతి మర్యాద, అతి కాపట్యం.
154. Generous minds are all of kin.
ఉదారులందరూ ఓ తల్లి బిడ్డలే.
155. Genius without education is like silver in the mine.
విద్యలేని మేధస్సు గనిలోని వెండి వంటిది.
156. Gifts burst rocks.
బహుమతులు, రాతి (హృదయాల) ని సైతం పగలగొట్ట గలవు
157. Gifts much expected, are paid, not given.
అతిగా ఆశించే బహుమతులు చెల్లించ బడతాయి గానీ ఇవ్వ బడవు.
158. Give me yesterday’s bread, today’s flesh, and last year’s cyder.
నిన్నటి రొట్టెనీ, నేటి మాంసాన్నీ, ఏడాది కిందటి సారాయినీ నాకు ఇవ్వు.
159. Glass, China and reputation are easily cracked, and never well mended.
గాజు, పింగాణీ, కీర్తీ సులువుగా బీటలు వేస్తాయి. ఎన్నడూ సరిగ్గా అతుక్కోవు.
160. God gives all things to industry.
దేముడు అన్నీ ‘పరిశ్రమ’కే ఇస్తాడు.
వ్యాఖ్యానించండి