| A pair of good ears will drain dry an hundred tongues. శ్రద్ధగా విను రెండు చెవులు, వంద నాలికలనైనా పొడిబారనివ్వ గలవు. |
| A ploughman on his legs is higher than a gentleman on his knees. మోకాళ్ళమీది పెద్దమనిషికంటే, కాళ్ళమీది రైతు మెరుగు. (ప్రార్ధన కంటే శ్రమ మెరుగు) |
| Approve not him that commends all you say. నువ్వు చెప్పిన”వన్నీ” బాగున్నాయనే వాడిని నమ్మకు. |
| A quarrelsome man has no good neighbors. తగవులమారికి, మంచి పొరుగు అంటూ ఉండరు. |
| A quiet conscience sleeps in thunder. ప్రశాంత చిత్తుడు పిడుగులు పడుతున్నా హాయిగా నిద్రపోగలడు. |
| Are you angry that others disappoint you? Remember you cannot depend upon yourself. ఇతరులు మీ అంచనాలకు తగ్గట్టు లేరని కోపంగా ఉందా? గుర్తుంచుకోండి: మీ విచక్షణని మీరు నమ్మడం అంత మంచిది కాదు. (ఇంగ్లీషు వాక్యంలో చివర చిన్న చమత్కారం ఉంది. You cannot depend upon yourself అన్న హెచ్చరికలో, మీ వివేకాన్ని నమ్మడం అంత మంచిది కాదని ఒక అర్థం, ఇతరులు ఎంత చాతకాని వారైనా, ఏ మనిషీ ఒంటరిగా ఏదీ సాధించలేడని రెండవ అర్థం.) |
| As charms are a nonsense, nonsense is a charm. తావీదులు, మంత్రాలూ ఎలా అర్థం లేనివో, అన్నిటికీ అర్థంలేదనడం కూడా ఒక తావీదు లాంటిది. |
| Ask and have, is sometimes dear buying. అడిగి, ఉచితంగా తీసుకోవడం, ఒకోసారి ప్రియంగా పరిణమించ వచ్చు. (మనం ఒకటి ఉచితంగా అడిగి తీసుకున్నపుడు, ఆ వ్యక్తి రెండవ సారి మన దగ్గర నుండి అంతకంటే ఎక్కువ విలువైన దాన్ని ఉచితంగా పట్టుకెళ్ళవచ్చు.) |
| As pride increases, fortune declines. అహంకారం (ఉద్ధతి) పెరుగుతున్నకొద్దీ, సంపద తరుగుతుంటుంది. |
| A soft tongue may strike hard. మెత్తని నాలుక గట్టి దెబ్బ కొట్టవచ్చు. (ఒకోసారి భౌతికమైన గాయం కంటే, మాటలు చేసే గాయం లోతైనదీ, ప్రాణాంతకమూ కాగలదు) |
వ్యాఖ్యానించండి