సంతృప్తిని ప్రతిఫలించే ఏ ఆలోచనైనా అందంగా ఉంటుంది!
ప్రశాంతంగా ఉండగలిగే మనసు మహరాజుకన్నా సంపన్నమైనది!
ఏ వంతలూ లేకుండా నిద్రపోగలిగే రాత్రులే దివ్యమైన రాత్రులు!
పేదరికం కోపంగా నుదుట ముడివేసి చూసే భాగ్యాన్ని ధిక్కరిస్తుంది
అటువంటి సంతృప్తి, అటువంటి మనసు, అటువంటి నిద్ర, పరమసౌఖ్యం
యాచకులకి తప్ప యువరాజులకి సైతం తరచు దొరికేది కాదు.
ఎల్లప్పుడూ ప్రశాంతతనిండిన విశ్రాంతి నివ్వగలిగిన ఇల్లూ,
అటు గర్వాన్నీ, ఇటూ ఆందోళననీ కలిగించని కుటీరమూ,
తన పరిసరాలకి తగినట్టుగా జీవించడానికి సరిపోయే వనరులూ,
ఉల్లాసమూ ఆటపాటలతో కూడిన ఆహ్లాదకరమైన జీవితమూ
ఎవరిదృష్టికీ అందకుండా గడిపే జీవితం అదో బ్రహ్మానందం!
సంతృప్తి గలిగిన మనసే … రాజ్యమూ, రాజరికమూ!
.
రాబర్ట్ గ్రీన్
(11 July 1558 – 3 September 1592)
ఇంగ్లీషు

వ్యాఖ్యానించండి