ప్రేమ అతి పవిత్రంగా జ్వలించే ఒక జ్వాల
దాని పాల బడిన వ్యక్తిని తీయని కోరికతో నింపుతుంది.
ఒకసారి ప్రేమ వేడి నిట్టూర్పులకు శరీరం ఎరయైతే
నాటినుండి ఆ గుండె మరణించేదాకా మండే “మూస”యే
ప్రేమే జీవితం అను; అది పొరపాటు కాదను,
అది పరమానందానికి పర్యాయపదం అను,
నీకు తోచింది ఏదైనా “ఇదీ ప్రేమ” అను ఎన్నిసార్లైనా
కానీ, గుండెకి తెలుసు… ప్రేమంటే ఒక వేదన అని.
.
జార్జి మేరియోన్ మెక్లీలన్
(1860- 1934)
అమెరికను కవి.

వ్యాఖ్యానించండి