.
పొద్దు పొడిచిన కాసేపటికి
సూర్యుడు రక్తారుణిమమైన తన తల ఎత్తి
నల్లని తాటితోపులో నిలుచున్నాడు
నురగలు కక్కే
తెల్లనికాంతిని అందివ్వడానికి
వచ్చేవారికోసం ఎదురుచూస్తూ.
తర్వాత రోజు రోజల్లా పచ్చికబయలుమీదే.
నేనుకూడా రోజల్లా మేస్తూ గడిపాను
చీకటి పడేదాకా
తక్కిన వాళ్లతోపాటే
అందిన ప్రతి పచ్చ గడ్డిపరకనీ ఆస్వాదించి
చివరకి, నేనూ చీకటిలో కలిసిపోతాను
నా పేరు ధరించిన
ఈ చిరుగంటని మోగిస్తూ.
.
టెడ్ కూజర్
జననం 1939
అమెరికను కవి

వ్యాఖ్యానించండి