జూన్ నెలకి మా సెలయేటి పరుగూ, సంగీతమూ పల్చబడతాయి
ఆ తర్వాత దాని కోసం ఎంత గాలించినా,
ఎక్కడో భూగర్భంలో కనీ కనిపించకుండా పారడమో
(హైలా తనతో బాటే నెలరోజుల క్రిందటివరకూ
మంచులో గంటలుకొట్టుకుంటూ పరిగెత్తే బళ్ళలా
పొగమంచులో నినదించిన పాదప, జీవజాలాన్ని తీసుకుపోతుంది)
లేదా దాని నీళ్ళు పలచబడుతున్న కొద్దీ పెరిగిన
కలుపుమొక్కలతో నిండి, గాలికి ఇట్టే కొట్టుకుపోయే
బలహీన మొక్కలతో మలుపువరకూ సాగుతుంది.
ఇప్పుడు ఆ సెలయేటి గర్భంలో రంగు వెలసిన
కాగితంలా ఎండుటాకులు అతుక్కుని ఉన్నాయి
అది బాగా ఎరిగున్న వారికి తప్ప సెలయేరులా కనిపించదు.
ఐనా, గలగల పారుతూ ధ్వనించే సెలయేళ్ళకు మల్లే
దీనిని కూడా అంత అపురూపంతోనూ చూస్తారు.
మనకు ప్రియమైనవి యథాతథంగా ఇష్టపడడం సహజం
.
రాబర్ట్ ఫ్రాస్ట్
(March 26, 1874 – January 29, 1963)
అమెరికను కవి
.

వ్యాఖ్యానించండి