తల్లులెలాంటి వారో పిల్లలలాంటి వారు.
వెర్రి అభిమానపడే తండ్రి అంత వెర్రిగా చూచినా,
ఉయ్యాలలో నిద్రపోతున్న కొడుకుమీద
రాశిపోసిన తన అన్ని ఆశలూ, భయాలతో
తల్లి తన పేగుబంధంతో చూసినట్టుగా
ఆ చిన్నారి హృదయాన్ని ప్రేమగా చూడలేడు.
తన ప్రక్కన మోకాళ్ళమీద కూచుని
తన రూపుదిద్దుకుంటున్న తన ముఖంలో ఎప్పుడూ
తల్లి పోలికలు వెదుకుతున్న నాన్నను చూసి
ఆ చిన్నారి ఆశ్చర్యంగా,గుడ్లప్పగించి చూస్తాడు;
కానీ, ఆమె ఒక్కతెకే చేతులు చాచి
నిలబడతాడు; ఆమె ఒక్కతెకే ఆ కళ్ళు
ఆనందంతో విప్పారుతాయి, ఆశ్చర్యంతో కాకుండా.
.
వాల్టర్ సావేజ్ లాండర్
(30 January 1775 – 17 September 1864)
ఇంగ్లీషు కవి

వ్యాఖ్యానించండి