నేను ఎవరుపడితే వాళ్ళదగ్గర ప్రేమ ప్రకటించను గనుక,
లేదా కొన్ని ప్రత్యేకమైన దుస్తులు ధరించను గనుక,
జుత్తుని కొన్ని విధాలుగా అలంకరించుకోను గనుక,
ప్రతి మాటలోనూ నిట్టూర్పులు విడిచిపెట్టను గనుక …
ఈ సొగసుకత్తెలు, అలవాటుగా ప్రేమనిప్రకటించేవారి
పెదాలపై నిట్టూర్పులకు అలవాటు పడి
“ఏమిటి? వాడా?” అంటుంటారు నా గురించి:” నేను ఒట్టేసి చెప్పగలను
అతనికి ప్రేమంటే తెలీదు. లాభంలేదు. అతన్ని ఒక్కణ్ణీ ఉండనీండి.”
ఇప్పటికీ అలాగే అనుకుంటారు… స్టెల్లా కి నా మనసు తెలిస్తే…
నిజమే, ఒప్పుకుంటాను. నాకు అనంగ కళలు తెలీవు;
కానీ, ఓ అందమైన పడుచులారా, చివరకి మీరు నిజం తెలుసుకుంటారు,
ప్రేమించినవాడు తన గుర్తులు మనసులో భద్రపరుచుకుంటాడు.
ప్రేమికులంటే వాగుడుకాయలు కాదు, మాటలకి వెదుక్కుంటారు;
నిజంగా ప్రేమించిన వాళ్ళు ప్రేమించేమని చెప్పడానికి వణుకుతారు.
.
సర్ ఫిలిప్ సిడ్నీ
30 November 1554 – 17 October 1586
ఇంగ్లీషు కవి
![]()
వ్యాఖ్యానించండి