మనిద్దరం వినీలాకాశం క్రింద
మహానగాగ్రాల శిఖరాలపై
రెక్కలు బారజాపుకుని
గాలిలో జంటగా ఎగిరే పక్షులం.
సూర్యకాంతి మనని రంజిస్తుంది
పేరుకున్న మంచు విస్మయపరుస్తుంది
పల్చబడి చెదురై, చిక్కులుపడుతూ
మన వెనక మేఘాలు గిరికీలుకొడతాయి
మనిద్దరం పక్షులులాంటి వారిమి;
కానీ మృత్యువు తరుముకొచ్చి
దానికి మర్త్యులమై మోకరిల్లినపుడు,
మనలో ఒకరు నిష్క్రమించగానే,
రెండవవారు అనుసరింతురు గాక!
ఈ గగనవిహారము ముగియుగాక!
చితిమంటలు చల్లారుగాక!
పుస్తకము మూసివెయ్యబడుగాక!
.
సారా టీజ్డేల్
August 8, 1884 – January 29, 1933
అమెరికను కవయిత్రి

వ్యాఖ్యానించండి