ప్రియమైన పాపాయీ ఎక్కడనుండి ఇక్కడకు వచ్చేవు?
ఈ విశాల విశ్వంలోంచే నీదగ్గరకు వచ్చేను?
నీ కళ్ళు ఎందుకు అంత అందంగా నీలంగా ఉన్నాయి?
ఓ అదా, నేను వస్తుంటే ఆకాశం రంగు అంటుకుంది
ఆ కళ్ళలో వెలుగులెందుకు చక్రాల్లా తిరిగి మెరుస్తున్నాయి?
అందులో నక్షత్రాల తునకలు కొన్ని చిక్కుపడిపోయాయి
నీ కన్నుల్లో అస్రుకణం ఎక్కడినుండి వచ్చింది?
నేనిక్కడికొచ్చేసరికి నాకై అది ఎదురుచూస్తోంది.
నీ నుదురెందుకు మెత్తగా ఉన్నతణ్గా కనిపిస్తోంది?
ఓ అదా, మెత్తని చెయ్యొకటి నే వస్తుంటే పుణికింది
నులివెచ్చని తెల్లగులాబిలా నీ బుగ్గలెందుకున్నాయి?
అది ఒక దేవరహస్యం. ఎవరికీ తెలీదు.
సొట్టలుపడే చిరునవ్వు ఎక్కడనుండి తెచ్చుకున్నావు?
ముగ్గురు దేవదూతలొకసారే నను ముద్దుపెట్టుకున్నందుకు
ముత్యాలవంటి చెవులెక్కడినుండి వచ్చేయి?
దేముడు మాటాడబోతే, వినడానికి ఆతృతగా విచ్చుకున్నాయి
ఆ అరచేతులూ, మోచేతులూ ఎక్కడనుంది వచ్చేయి?
ప్రేమే తనని తాను కొక్కేలుగా పట్టీలుగా విభజించుకుంది.
అంత అందమైన పాదాలు ఎక్కడనుండి వచ్చేయి?
దేవదూతలకు రెక్కలొచ్చిన పెట్టెలోంచే
వ్యాఖ్యానించండి