నా మార్గంలో అడుగులు ఎంత దుఃఖభరితంగా పడుతున్నాయో చెప్పలేను.
నేను కోరుకుంటున్న ఈ ప్రయాణం ముగిసే వేళకి నాకు దొరకవలసిన
సుఖమూ, విశ్రాంతి దొరకకపోవడమేగాక, గుర్తుచేస్తున్నాయి:
ఇకనుండి మైళ్ళు “నీ నుండి నా దూరం”తో కొలవబడుతాయని.
నా బరువుతోపాటు బాధలబరువూ మోస్తూ ఈ జంతువు అలిసిపోయింది
అందుకే కాళ్ళీడుస్తోంది, నా లోపలి బరువు మోయడానికి వీలుగా,
ఈ గుర్రం ఏ అతీంద్రియ శక్తితో తెలిసుకుందో తెలీదు గాని
రౌతుకి నీ నుండి త్వరగా దూరం కావాలనిలేదని తెలుసుకుంది
ఒక్కోసారి కోపం వచ్చి దాని డొక్కలోకి తన్నినపుడు
కాలి జోడు రక్తంవచ్చేలా చర్మంలోకి గుచ్చుకున్నా చలించడం లేదు
అది బాధతో గట్టిగా ఒక మూలుగు మూలిగి ఊరుకుంటోంది తప్ప;
ఆ మూలుగు నా జోడు దానికి గుచ్చుకున్న బాధకంటే ఎక్కువ బాధిస్తోంది.
ఎందుకంటే, ఆ మూలుగు పదే పదే నాకు గుర్తుచేస్తోంది:
నా ఆనందం వెనుకనీ, దుఃఖం ముందునీ ఉన్నాయని.
.
విలియం షేక్స్పియర్
26 April 1564 (baptised) – 23 April 1616
ఇంగ్లీషు కవి.
.
.
Sonnet L
.
How heavy do I journey on the way,
When what I seek, my weary travel’s end,
Doth teach that ease and that repose to say,
‘Thus far the miles are measured from thy friend!’
వ్యాఖ్యానించండి