నిజానికి మనిషికి రెండు పుట్టుకలు:మొదటిది
మేల్కొన్న ఇంద్రియస్పృహపై తొలి వెలుగు కిరణం పడినపుడు;
రెండవసారి రెండు హృదయాలు కలిసినపుడు;
మనజీవితాన్ని అప్పటినుండే లెక్కపెట్టాలి:
మనం ఒకర్నొకరు ప్రేమించుకున్నప్పుడు
మనిద్దరం కొత్తగా పుట్టినట్టే లెక్క.
ప్రేమ మనకి సరికొత్త ఆత్మలను ప్రసాదిస్తుంది
ఆ ఆత్మలలో కొత్త శక్తులను నింపుతుంది;
అప్పటినుండి మనం ఒక కొత్త జీవితం మొదలెడతాము;
మనం పీల్చే ప్రతి శ్వాస మనది కాదు, ప్రేమికది:
వయసు భయపెట్టే వారిని ప్రేమ యవ్వనులని చేస్తుంది
తమని తాము యవ్వనులుగా చూసుకోగలవారు యవ్వనులుగానే ఉంటారు.
.
విలియం కార్ట్ రైట్
ఇంగ్లీషు కవి
వ్యాఖ్యానించండి