కోపంలో ఉన్న ఓ చిన్నదానా
ఇది మనసులో పెట్టుకో:
పొంద యోగ్యుడైనవాడిని
నువ్వెన్నడూ పొందలేవు!
ఈ విలువైన కఠోర సత్యాన్ని,
చురుకుతున్న నీ బుగ్గన పెట్టుకో
అది నీ కన్నీటిని దాచనీ.
నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు
దాన్ని మంచులా ఘనీభవించిన
మాయా స్ఫటికం లోలోతులకు చూడు
చాలాసేపు దాన్ని పరీక్షించు,
నీకు మనశ్శాంతి లభిస్తుంది.
పొందడానికి యోగ్యుడైన వాడిని
నువ్వెన్నడూ పొందలేవు.
.
సారా టీజ్డేల్
August 8, 1884 – January 29, 1933
అమెరికను కవయిత్రి
.

వ్యాఖ్యానించండి