ఏ శపధాలూ చెయ్యొద్దు… గ్రేస్ ఫాలో నార్టన్, అమెరికను కవయిత్రి
నేనోసారి శపథం చేశాను, ఒక్కటంటే ఒక్కటి. అప్పుడు నేను యవ్వనంలో ఉన్నాను, ఒంటరిగా. నాకు బాగా ధైర్యం వచ్చినపుడు ఇలా అనుకున్నాను: “ఈ నియమాలు నాకు చాలా సంకుచితంగా కనిపిస్తున్నాయి. అరిగిపోయిన ఆ పాత నియమాలకి నేనెందుకు కట్టుబడి ఉండాలి? ఈ రోజు నుంచీ బట్టలు మార్చినట్టు అన్ని నియమాలూ మార్చెస్తాను!”
కానీ ఆ పాత అరిగిపోయిన నియమమే నాకు ఇప్పుడు సంకెలలా తగులుకుంది. అదిప్పుడు ఉల్లంఘించడం చాలా చాలా కష్టం; నానుండి దాన్ని వదుల్చుకోడం మహా మహాకష్టం.
ఉదయం దాన్ని ఉల్లంఘిస్తానా, రాత్రి నన్ను పట్టుకుంటుంది, ఉదయం పూటమాత్రమే స్వేచ్ఛగా ఉండేవాడు, స్వేచ్చాజీవి కాడు, కలల్లో సంకెలలు భరించేవాడు స్వేచ్చాజీవి కానేరడు కలల్లో కనిపించే తేట ఊట సెలయేళ్లకు ఆనందించేవాడిలా.
బతకడానికి చాలా విలువైన శక్తి కావాలి. కనుక నీ శక్తినంతా ఎక్కడ వెచ్చించాలో జాగ్రత్తగా గమనించు. నిరంకుశంగా, ఆనందంగా ఇపుడుండవలసిన నేను, నా శక్తినంతా నాకు భారంగా మారిన శపథాన్ని ఉల్లంఘించడానికి వినియోగించాలి . గ్రేస్ ఫాలో నార్టన్
29th October 1876 – 1956
అమెరికను కవయిత్రి
.
Make No Vows
.
I made a vow once, one only.
I was young and I was lonely.
When I grew strong I said: “This vow
Is too narrow for me now.
Who am I to be bound by old oaths?
I will change them as I change my clothes!”
But that ancient outworn vow
Was like fetters upon me now.
It was hard to break, hard to break;
Hard to shake from me, hard to shake.
I broke it by day, but it closed upon me at night.
He is not free who is free only in the sun-light.
He is not free who bears fetters in his dreams,
Nor he who laughs only by dark dream-fed streams.
Oh, it costs much bright coin of strength to live!
వ్యాఖ్యానించండి