ఇది షేక్స్పియర్ 400వ వర్థంతి సంవత్సరము
ప్రియ మిత్రమా, నాకు నువ్వెన్నాళ్ళయినా పాతబడవు
నిన్ను మొదటిసారి చూసినపుడెలా ఉన్నావో అలాగే ఉన్నావు
నీ అందం అలాగే ఉంది. అప్పుడే మూడు హేమంతాలు గడిచాయి
అడవి గర్వించే వనసంపదని మూడు వేసవులై హరిస్తూ,
అందమైన మూడు వసంతాలు మూడు పలిత శిశిరాలయేయి,
ఈ నిరంతర ఋతుచక్రభ్రమణంలో నేను గమనించినది:
మూడు వసంతాల సుగంధాలు మూడు మండు వేసవులలో నిందుకోవడం.
నేను మొదటిసారి చూసిన దనం ఇంకా అలానే ఉంది.
ప్చ్! అయినా వాచీలోని సెకన్ల ముల్లు అందాన్ని
శరీరంనుండి చాపకిందనీరులా సంగ్రహిస్తుంది
అందువల్ల, నీలో నేను ఇంకా మిగిలుండనుకుంటున్న అందం
కరిగిపోతోందేమో, నా కళ్ళు భ్రమిస్తున్నాయేమో!
అందుకనే, ముదిమి నీకు చెప్పకముందె ఇది విను
నీ పుట్టువన్నెలరుచులు క్షీణించక ముందె విను.
.
షేక్స్పియర్
ఇంగ్లీషు కవి

వ్యాఖ్యానించండి