ఒకసారి అద్దంలోకి చూసుకుని, కనిపించిన ముఖానికి చెప్పు: ఆ ముఖం మరో ముఖాన్ని తీసుకురావలసిన వయసు ఒచ్చిందని, ఆ లోపాన్ని గాని నువ్విప్పుడు భర్తీ చెయ్యకపోతే నువ్వు ప్రపంచాన్ని మభ్యపెట్టి, కాబోయే తల్లిని అన్యాయం చేస్తున్నావని. బిడ్డలను కనవలసి వస్తుందని నీ సహచర్యాన్ని తిరస్కరించే అందమైన స్త్రీ ఎక్కడైనా ఉందేమో చూపించు? మృత్యువంటే అంత అపేక్ష ఉన్నవారెవరు, తన అందం మీద ప్రేమతో బిడ్డలను కనకుండా ఉండడానికి? నువ్వు మీ తల్లికి ప్రతిబింబానివి; ఆమె నినుచూసినపుడు తన పూర్ణయవ్వన వయః పరిపాకాన్ని తలపోసుకుంటుంది. అలాగే నువ్వు నీ వయసు వాటారిన వేళ, తనువు ముడుతలు దేరినా, నేటి సొగసులు నెమరువేసుకుంటావు. నిన్నెవరూ గుర్తుపెట్టుకోనక్కరలేదని బ్రతుకుతా నంటావా సరే, ఒంటరిగా మరణించు. నీ రూపు నీతోనే సమసిపోతుంది. . విలియం షేక్స్పియర్
వ్యాఖ్యానించండి