ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం
ఈ కవితలన్నీ ఒక అజ్ఞాత యువకుణ్ణి (Mr. W H) ఉద్దేశించి వ్రాసినవి
(బహుశా పెళ్లి చేసుకుందికి నిరాకరిస్తున్న ఈ యువకుణ్ణి సున్నితంగా పరోక్షంగా మందలిస్తున్నట్టు కనిపిస్తుంది)
నలభై వసంతాలు నీ ఒంటి పైబడి, నీ
సౌందర్యక్షేత్రంలో లోతుగా నెరియలు తీసినపుడు,
నీ గరువపు పరువాల ఉడుపులు పరీక్షించినపుడు
అవి పీలికలై, పనికిమాలి విలువలేనిగా కనిపిస్తాయి;
ఇపుడు ఎవరైనా “నీ సౌందర్యమంతా ఏమయింది?”అనో,
“నీ జవ్వనపు సిరులేమయినా?”యనో ప్రశ్నిస్తే అవి లోతుగా
కొలకులలోకి క్రుంగిన కన్నుల్లో ఉన్నాయని బదులివ్వడానికి
ఎంత సిగ్గుతో అవమానంటో చచ్చిపోవాలి; ఆ ప్రశంస ఎంత నిరర్థకం.
దానికి బదులుగా, “ఇదిగో ఇది నా అందమైన బిడ్డ,
నా అందం పుణికిపుచ్చుకుంది, నా ముదిమికి ఊరట,”
అని నువ్వు అనగలిగితే, తను వారసత్వంగా కొనసాగించే
నీ అందం … ఎన్ని రెట్లు కొనియాడబడి ఉండేది!
నీకు వయసు వాటారుతున్నపుడు అందం కొత్తగా సృజించబడాలి
నీ రక్తం వేడి తగ్గినపుడు, “నీరక్తం” వేడిగా తగలాలి.”
.
షేక్స్పియర్

వ్యాఖ్యానించండి