నువ్వు ఈ రోజు రాత్రి
మన కుటీరానికి వచ్చినపుడు
నువ్వు నాకోసం వెతుకుతావు
కానీ, నేను ఉండను.
మొరలు వినిపించుకోని అందరు దేవుళ్ళకి
నీ గోడువినిపించుకుంతూ రోదిస్తావు
ప్రతి చప్పుడూ వింటూ, ఎదురుచూస్తావు
కానీ నేను అక్కడ ఉండను.
నాచేతుల్లో ఒదిగిన నీ చేతులకంటే
నీలోని ఒక భాగం నాకు ఇష్టం;
నా గుండెలమీద నీ పెదాలకంటే,
నీలోని ఒక భాగం నాకు ఇష్టం
నా లాలనలోకూడా గాయపరిచే
నీలోని ఒక భాగం ఉంది;
నేను ఎన్నటికీ పొందలేని
నీలోని ఒక భాగం ఉంది.
నువ్వు ఒక్కడివి ఉన్నప్పుడు
ఒంటరిగా, స్వేచ్ఛగా ఉన్నప్పుడు
నా అవసరాన్ని గుర్తించే
నీలోని ఒక భాగమంటే అసహ్యం.
నువ్వు ఈ రోజు రాత్రి
మన కుటీరానికి వచ్చినపుడు
నువ్వు నాకోసం వెతుకుతావు
కానీ, నేను ఉండను.
.
మేరీ ఆల్డస్
1872-1949
అమెరికను కవయిత్రి
.
వ్యాఖ్యానించండి