ఇసక పర్రలలో స్వేచ్ఛాబీజాలు జల్లుతుంటే
చుక్క పొడవకముందే నేను నడుస్తున్నాను;
పాపం బానిస నాగళ్ళు విడిచిన చాళ్లలోకి
స్వచ్చమైన, నిష్కల్మషమైన వేళ్ళు విత్తులు జల్లుతున్నాయి
ఫలప్రదమైనది ఈ విత్తనము, తరాలను సృష్టిస్తుంది;
కానీ, ఈ పంట నొర్లుకునేవాడు, వట్టి అహంకారపు జులాయి
ఇప్పుడు నాకు అర్థం అయింది ‘వృధాశ్రమ’ అంటే ఏమిటో.
ఓ శాంతియుత దేశాల్లారా, మీకు కావలసినంత మెయ్యండి
మీ రెన్నడూ అన్నార్తుల ఆక్రందనలకి బదులు పలకలేదు !
స్వాతంత్ర పోరాటాల పిలుపులకి గొర్రెలా బదులు పలికేది?
ఉన్ని కత్తిరించడానికో, బలిగా ఇవ్వడానికో పనికివస్తాయి అవి
వాటికి దొరికే ఓలి… సుఖజీవులైన వాటి యజమానులు
తరాలుగా, నిస్సిగ్గుగా మెడకి తగిలించే… కాడి.
.
అలెగ్జాండర్ పుష్కిన్
6 June 1799 – 10 February 1837
రష్యను కవి

వ్యాఖ్యానించండి