రోజులు సాగుతూ ఉంటాయి; ప్రతిక్షణమూ
విఫలప్రేమ వల్ల గాయపడ్డ నా మనసులోని
బాధనీ దుఃఖాన్ని ఇనుమడింపజేస్తూ చీకటి మిగిల్చి
నిద్ర పోనీని కలలకీ, వెంటాడే కోరికలకీ దారితీస్తుంది;
అయినా, నేను ఫిర్యాదు చెయ్యను; బదులుగా, శోకిస్తాను;
కన్నీళ్ళు నాకు మనశ్శాంతి నిస్తాయి, ఇచ్చి శలవుతీసుకుంటాయి.
గాఢమైన దుఃఖానికి బందీ అయిన నా మనసుకి,
నా మాటనమ్మండి, చెప్పలేని ఆనందం కలుగుతుంది.
జీవితమా! సాగిపో! రిక్తాత్మా! రా, ముందుకి ఎగిరిపో,
నిశ్శబ్ద తమోశూన్యంలోకి అంతర్థానమైపో!
నా ప్రేమ గురించి అంతులేని మనోవేదన నాకు ఇష్టం.
ప్రేమిస్తూ మరణించగలిగితే, దయచేసి నన్ను మరణించనీండి.
.
అలెగ్జాండర్ సెర్గెవిచ్ పూష్కిన్
6 జూన్ 1799 – 10 ఫిబ్రవరి 1837
రష్యను కవి.
.

వ్యాఖ్యానించండి